Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల 'చిత్ర'-'కథా'కారుడు చెన్నూరి సుదర్శన్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 30,2022

బాలల 'చిత్ర'-'కథా'కారుడు చెన్నూరి సుదర్శన్‌

             చేనేత కుటుంబంలో పుట్టి పెరిగి, చిత్రగీత, అక్షరాల రాతలో అంచలంచెలుగా ఎదిగి, ఒదిగిన కృషీవలుడు, విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ చెన్నూరి సుదర్శన్‌. పుట్టింది అమ్మమ్మ ఇంట్లో హుజురాబాద్‌లో. తండ్రి శ్రీ చెన్నూరి లక్ష్మయ్య, పోలీసు. తల్లి శ్రీమతి లక్ష్మి (గౌరమ్మ). మే 18, 1952న పుట్టారు. హుజూరాబాద్‌లో తాత అక్షరభ్యాసం చేయించాడు. కాని తండ్రి ఉద్యోగరీత్యా, చదువు వరంగల్‌ జిల్లాలోని వివిధ ఊళ్ళల్లో కొనసాగింది.
             పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌, ఎంఫిల్‌లు పూర్తి చేసిన సుదర్శన్‌ తొలుత 'టెలిఫోన్‌ ఆపరేటర్‌'గా ఉద్యోగం చేశారు. బాల్యం నుంచి రంగస్థల నటనపై మిక్కిలి ఆసక్తితో పాఠశాల దశలోనే ముఖానికి రంగేసుకుని ప్రశంసలు పొందారు. బాల్యం నురచి చందమామ చదవడం ఒక వ్యాపకంగా చేసుకున్న వీరిపై తదనంతరం గురువైన శ్రీ దూపాటి రమణాచారి ప్రోత్సాహం లభించింది. విద్యార్థి దశలోనే ఆంగ్ల పుస్తకంలోని కవితలను తెలుగులోకి అనువాదం చేసుకునేవారు. రేడియోలో ఆదివారం ప్రసారమయ్యే 'బాలానందం' కార్యక్రమానికి రకరకాల జోక్స్‌ పోస్ట్‌ కార్డు మీద రాసి పంపగా అవి ప్రసారమయ్యాయి. తొలి కథ 'నా అనుభవం' పంపగా, 1 జనవరి, 1970న ప్రసారమైంది. అది మొదలు 'యువకవి'గా పాఠశాల సన్మానం, మొదటి కవిత 'రజతోత్సవం' హుజూరాబాద్‌ పాఠశాల మ్యాగజైన్‌ (1972)లో వచ్చింది. ఇదే సమయంలో 'నిండు మనసులు' అనే నవల రాసారు. బహుశః డెబ్బయ్యవ దశకంలో విదార్థి రచనగా వచ్చిన నవల ఇదే కావచ్చేమో... పరిశోధించాలి. ఇదే సమయంలో గూడూరి రాఘవేంద్ర 7వ తరగతి విద్యార్థిగా బాలల కథలు రాయడం విశేషం. పదవ తరగతిలో పాఠశాల కల్చరర్‌ సెక్రటరీగా ఎన్నుకోబడి, నాటికలు వేసి వచ్చిన డబ్బుని సుదర్శన్‌ బృందం పేద కళాకారులకు ఇవ్వడం అభినందనీయం. అంతేకాక పాఠశాల గది నిర్మాణం కోసం సినిమా ప్రదర్శింపజేసి అందులో విజయం సాధించిందీ బృందం. వాలీబాల్‌ క్రీడాకారునిగా అంతర్‌ జల్లా స్థాయిలో అనేక బహుమతులు అందుకున్న వీరి మిత్రుడు గుర్రాల బాలరాజు ప్రోత్సాహంతో చిత్రలేఖనం వైపు దృష్టి సారించారు. ప్రముఖ ఆర్టిస్ట్‌, శిల్పి సురేంద్రనాథ్‌ శిష్యరికంతో పోట్రేట్స్‌, ల్యాండ్‌ స్కేప్స్‌, గ్లాస్‌ పెయింటింగ్స్‌లో అనుభవం గడించి, కార్ట్యూన్స్‌ గీయడం నేర్చుకుని బహుమతులు అందుకున్నారు. ఇదే సమయంలో సీతారామయ్య వద్ద సుద్దముక్కలపై శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు. పూక్షకళలోని ఈ నైపుణ్యంతో బియ్యం గింజపై 16 అక్షరాలు రాయగలరు చెన్నూరి.
ఇదే సమయంలో లెక్చరర్‌గా 1982లో శ్రీకాకుళం డిగ్రీ కాలేజీలో చేరారు. తీరిక వేళల్లో తిరిగి బొమ్మలు గీయడం.. అప్పుడప్పుడు కవితలు రాసేవారు. తరువాత పటాన్‌చెరు జూనియర్‌ కాలేజీలో డా.నాళేశ్వరం శంకరం ప్రోత్సహంతో తిరిగి కవిత్వం వైపు మరలారు. 2012 మార్చిలో ఆత్మకథను రాసుకున్న సుదర్శన్‌ రచయితగా, సబెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌గా వివిధ రచనలు చేశారు. 200ల కథలు, 150 కవితలు, 60 కార్టూన్లు వీరి సృజన. కథలు తెలంగాణ భాషలో రాయడంలో వీరు సిద్ధహస్తులు కూడా.
'ఎం.సెట్‌ ప్రశ్నలు-సాధనాలు' (తెలుగు, ఆంగ్ల మాధ్యమం) జె.పి వారి కోసం రాశారు. 'జీవనచిత్రం', 'రంగుల వలయం' చెన్నూరి సుదర్శన్‌ ఆత్మకథ, కథల సంపుటి 'ఝాన్సీ హెచ్‌.ఎం' పేరుతో ప్రచురింపబడింది. మరో రెండు కథా సంపుటాలు 'మహా ప్రస్థానం', 'జీవనగతులు' పేరుతో వచ్చాయి. పదవ తరగతి విద్యార్థిగా నవల రాసిన చెన్నూరి సుదర్శన్‌ రాసిన మరో నవల 'జర్నీ ఆఫ్‌ ఏ టీచర్‌'.
చెన్నూరి సుదర్శన్‌ రచయిగా, చిత్రకారునిగా, మెజీషియన్‌గా, క్రీడాకారునిగా, కార్టునిస్ట్‌గా, బాల సాహిత్య కారునిగా చేసిన సృజన వెలకట్టలేనిది. తన రచనలకు తానే చిత్రాలు గీసుకుని, ముఖచిత్రాలు కూర్చుకుని పిల్లలకు కానుకగా అందించడం ఈ కథల బొమ్మల తాతకు బాగా తెలుసు. జీవన సత్యాలను, జీవితంలోని వివిధ అంశాలను అత్యంత సులభంగా పిల్లలకు అర్థం అయ్యేలా తన అక్షరాలతో... కుంచెతో చెప్పడం ఈయనకు బాగా తెలుసు. అలా పిల్లల కోసం రాసిన రచనలు... 'ప్రకృతిమాతజ పిల్లల కథలు. 'రామచిలుక', 'రామబాణం' కూడా వీరి బాలల కథా సంపుటాలే. ఇవేకాక 'చెన్నూరి సుదర్శన్‌ కథలు', 'అనసూయ ఆరాటం' నవల అచ్చులో ఉంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాష్ట్ర ఉత్తమ టెలిఫోన్‌ ఆపరేటర్‌ అవార్డు, హాస్య కవి, యువకవి, సన్మానాలు. శ్రీవాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం, గిడుగు రామమూర్తి పంతులు సాహిత్య పురస్కారం, ఐతా భారతీ చంద్రయ్య సాహిత్య పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్న చెన్నూరి ఇటు కథా సాహిత్యంలో, చిత్ర లేఖనంలో... అన్నింటికి మించి బాల సాహిత్యంలో విశేష సృజన చేస్తున్న సృజనకారుడు. జయహో! చెన్నూరి...

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.