Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైజ్ఞానిక, హేతువాద రచనల రాజముద్ర డా.దేవరాజు మహారాజు | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 20,2022

వైజ్ఞానిక, హేతువాద రచనల రాజముద్ర డా.దేవరాజు మహారాజు

            డా. దేవరాజు మహారాజు కవి, రచయిత, అనువాదకుడు, నాటకకర్త, కాలమిస్టు, శాస్త్రీయ అవగాహనను పెంచడానికి రచనలు చేశాడు. శాస్త్రవేత్తగా, జంతశాస్త్ర నిపుణుడుగా ప్రసిద్ధుడు. ఫిబ్రవరి 21, 1951లో వరంగల్‌ జిల్లా కోడూరులో పుట్టారు. తనదైన 'రాజముద్ర'తో సృజనాత్మక, వైజ్ఞానిక రచనలు చేస్తున్న ఈ డెబ్బైఒక్క యేండ్ల చైతన్యశీలి కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ, అనువాదం, బాలసాహిత్యం, సినీ విమర్శ, జానపద సాహిత్య పరిశోధన, నాటకరచన వంటి వాటిల్లో ఎనభై అయిదు రచనలు చేశారు. విశ్వ సాహిత్యం, భారతీయ సాహిత్యంపై చేసిన రచనలు ఇంకా అచ్చుకావాల్సి వుంది.
            వృత్తిరీత్యా జీవశాస్త్రవేత్త అయిన డా.మహారాజు తెలంగాణ ప్రజల భాషలో వచనరిల కవిత, కథ రాసిన తొలి తరం రచయిత. మౌళిక రచనలతోపాటు భారతీయ భాషల, ప్రపంచ భాషల కవిత్వాన్ని, కథలను తెలుగులోకి అనువదించి తెలుగు కళ్ళకు ఇరుగుపొరుగు దృశ్యాలను చూపించిన వీరు ''నేను అంటే ఎవరు?'' అన్న ప్రశ్నకు వీరు యిచ్చిన వైజ్ఞానిక విశ్లేషణకు 2021 సంవత్సర కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం లభించింది. 'మా'నవ'వాదం'పై తొలి గ్రంథ రచనతో పాటు 'భారతీయ సమాంతర సినిమా'పై గ్రంథ రచన చేశారు. 1974లో వచ్చిన తొలి రచన 'గుడిసె గుండె' నుండి నిన్నటి 'నేను అంటే ఎవరు?' వరకు వచ్చిన 85 పుస్తకాల్లో 'గాయపడ్డ ఉదయం', 'కవితా భారతి', 'మట్టిగుండె చప్పుళ్ళు', 'రాజముద్ర', 'నీకూ నాకూ మద్య ఓ రంగులనది', తెలంగాణ ప్రజల బాషలో వచ్చిన తొలి సంపుటిగా ప్రసిద్ధి పొందిన 'కడుపు కోత', 'పాలు ఎర్రబడ్డాయి', 'దేవరాజు మహారాజు కథలు', భారతీయ భాషల్లో స్త్రీవాద కథలు 'ఆరుబయట ఆకాశం కోసం', 'భారతీయ కథా ప్రతిబింబం', 'మనిషి'కత'లు'తో పాటు నోబెల్‌ అవార్డు గ్రహీత నవల 'మంచిముత్యం' వీరి రచనల్లో కొన్ని.
ఇవేకాక 'ఆధునిక యుగంలో జానపద సాహిత్యం', 'స్మృతి సుగంధం', 'స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం', 'ఆత్మనుంచి అక్షరానికి', 'స్త్రీ అక్షరాలు శిలాక్షరాలు', భారతీయ రచయిత్రుల విజయకేతనం', 'కవిత్వంలో సమాంతర రేఖలు', 'కొన్ని కలాలు-కొన్ని సమయాలు', 'అవార్డుల వాపసీ' వంటివి వీరి ప్రసిద్ధ విశ్లేషణాత్మక రచనలు, 'మూడనమ్మకాల్ని వదిలిద్దాం', 'లైఫ్‌టానిక్‌', అకాడడి అవార్డు పొందిన నాటకం 'నేను అంటె ఎవరు?' మహారాజు రాసిన నాటకాలు. భారతీయ, సమాంతర సినిమాపై వీరు పలు రచనలు చేశారు.'పథేర్‌ పాంచాలి' తెలుగు స్క్రిప్టు, ప్రయో'జన' సినిమా' వాటిలోనివి. దేవరాజు మహారాజు అనగాగానే తెలుగు పాఠకులకు గుర్తొచ్చివి వైజ్ఞానిక రచనలు. 'మూడనమ్మకాలు-సైన్స్‌', 'ఎయిడ్స్‌', 'భారతీయ వైజ్ఞానిక వికాసం', 'విజ్ఞాన పథంలో విజయఘట్టాలు', 'జీవ పరిశ్రమలు', 'సామాజిక జీవనంలో వైజ్ఞానిక స్పృహ', 'నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది', 'విజ్ఞానశాస్త్రం-మన జీవన సిద్ధాంతం' వంటి అనేక రచనలు వీరి వైజ్ఞానిక, శాస్రీయ దృక్పథాన్ని తెలుపుతాయి. ఇవేకాక 'భారతీయ వారసత్వం-విజ్ఞానం' వంటి సంపాకత్వాలు వీరి కృషిలో భాగమే.
బాల సాహిత్యం: వైజ్ఞానిక, హేతువాద రచయితగానే కాక సరళభాషలో విజ్ఞానశాస్త్ర రచనలు చేసిన మహారాజు బాలల నాలుగు దశాబ్దాలుగా తన బాధ్యతగా రచనలు చేస్తున్న బాల సాహితీవేత. వీరి బాల సాహిత్యంలో 'బుడుంగు' 1984, 'గురువుకు ఎగనామం' 1984, 'చిన్నోడి ప్రయాణం', 'అనగనగా కథలు' 2006, 'అపూర్వ జానపద కథలు' 2013, 'దేవుడెవరు?' 2018, 'పొన్నపూల చెట్టు' 2019, 'బోడి గుండు', 'నవ్వు వాసన' వంటివి ప్రసిద్ధమైనవి. వీటి ప్రచురణల కాలన్ని చూసినప్పుడు బాల వీరి తొలి బాలల రచన 'బుడుంగు'ను సృష్టించిన నాటినుండి నేటి వరకు పైన చెప్పిన ప్రసిద్ధ వైజ్ఞానిక, సాహిత్య రచనలతో పాటు బాల సాహిత్య సృజన చేయడం బాలల పట్ల, బాల సాహిత్యంపట్ల డాక్టర్‌ దేవరాజు మహారాజుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఇవే కాక పిల్లల కోసం వీరు రాసిన చైనా జానపథ కథలు నాలుగు సంపుటాలుగా వెలువడ్దాయి.
సమాజంలో శాస్త్రయ అవగాహనను పెంచడానికి వైజ్ఞానిక, వ్యంగ్య రచనలు చేసిన డా.మహారాజు బాల సాహిత్యంలోనూ అంతే కృషిచేశాడు. సారస్వత పరిషత్తు వారి 'డా.దేవులపల్లి రామానుజారావు పురస్కారం' మొదలుకుని 'మారసం జి.సురమౌళి కథా పురస్కారం', 'తెలుగు విశ్వవిద్యాలయం కవితా పురస్కారం', తొలి 'ఎక్స్‌రె' అవార్డు, 'ఫ్రీవర్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారం' వంటి వివిధ పురస్కారాలు వీరు అందుకుకొన్నారు. ముప్పైయేళ్లు జువాలజీ అచార్యునిగా ఉంటూ 'పరాన్న జీవశాస్త్రంలోంచి సామాజిక పరాన్నజీవులపైకి దృష్టి సారించడం, ఒక తాత్త్విక భూమికను రూపొందికుని రెండింటి మధ్య ఒక వారధిలా నిలబడగలగడం' వీరి వీరి ప్రత్యేకత. ఈ నిత్య పరిశోధనా యాత్రికుడు, కవి, రచయిత, నిబద్ధత కలిగిన బాల సాహితీవేత్తకు జేజేలు.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.