Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'కాల్పనికేతర కథా గుచ్ఛం' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 20,2022

'కాల్పనికేతర కథా గుచ్ఛం'

        'అదొక చౌరస్తా.మధ్యన నిలువెత్తు అంబేద్కర్‌ విగ్రహం. దాన్ని ఆనుకుని ఓ కానుగచెట్టు. ఆచెట్టు కింద చెప్పులు కుడుతున్న ఓ ముసలితాత. ఆషాఢమాసం ఎండ కాస్తున్నప్పటికీ, ఆకస్మాత్తుగా మబ్బులు కమ్మి దబదబ వర్షం కురుస్తున్నది. వర్షానికి ఆ తాత తనపైనా, తన పనిముట్లపైనా ప్లాస్టిక్‌ పరదా కప్పుకుని పనిచేస్తున్నాడు.కొంత సేపటికి వాన వెలిసింది.
           75 ఏండ్ల భారత స్వాతంత్య్రం ఆ తాత దారిద్య్రం తీర్చలేక పోయిందా? పై నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ దృక్కులు ప్రశ్నిస్తున్నాయి. జాలిగ కన్నీరు కారుస్తున్నట్టు కానుక చెట్టు ఆకులు నుండి నీటిబట్లు రాలుతున్నాయి.
ఇదంతా వాస్తవమే. చదివే పాఠకులకు దృశ్యం బమ్మ కట్టడమే కాదు. మనస్సు ఆలోచనాత్మకమైన హృదయం ద్రవీ భూతమవు తుంది. దీనినే నాన్‌ఫిక్షన్‌ జర్నలిజం (కాల్పనికేతర వార్తా కథనం' అంటున్నారు.
దీనికి మనదేశంలో ప్రతీకగా నిలిచింది ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌. ఇప్పుడు ఆయన బాటలోఎంతోమంది జర్నలిస్టులు, రచయితలు ముందుకొస్తున్నారు.
వాస్తవం నుంచే ఊహా, కల్పనాశక్తి ఉత్పన్నం అవుతందని చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం. శుద్ధ భావవాదులకు ఇది మింగుడు పడదు.తన ఆలోచన, తన మేధస్సు, తన భావాలకే అగ్ర తాంబూలం ఇచ్చుకుంటారు. వస్తు గతదృష్టిని (ఆబ్జెక్టివ్‌రియాల్టీ) ని పూర్వపక్షం చేస్తారు. సమర్థవంతమైన రచయితలు మాత్రమే వస్తుగత దృష్టిలోకి పరకాయ ప్రవేశం చేయగలరు. సత్యనిష్టతో యధార్థాన్ని చూపగలరు.
కొందరు గాఢానుభూతిలో పాఠకుల హృదయాలపై చెరగని ముద్రవేయాలని తాపత్రయపడితే, మరికొందరు అసలు విషయాన్ని లోకానికి వ్యక్తపరిచే తాపత్రయంలో ముందుంటారు. అలాంటి ఆపేక్షను గోటేటి లలితాశేఖర్‌ 'పుడమితల్లి నేస్తం' కథా సంపుటి ద్వారా చాలా హృద్యంగా వ్యక్తీకరించారు.
సమాజగమనం, దేశభవిష్యత్తు గురించి చర్చిస్తూ వ్యవసాయ ప్రాధాన్యత ఏమిటో గుర్తించకపోవడం లాగనే చాలా అసంగతలు మనకు తారసపడుతుంటాయి. సమాజాన్ని నడిపించే విజ్ఞాన శాస్త్రాలు పట్ల శీతకన్ను వేస్తుంటారు. కనుకనే తెలుగులో నాన్‌ఫిక్షన్‌ కు ఇవ్వాల్సినంత స్థానం ఇవ్వలేక పోయారని ప్రముఖ సైన్స్‌ రచయిత నాగసూరి వేణుగోపాల్‌ ముందుమాటలో వాపోయారు. మత మౌఢ్యంతో పాలకులే వెర్రి కల్పనలకు భాష్యం చెపుతున్న కాలంలో జీవిస్తున్నాంగా మరి!
పుస్తకంలో నాలుగగే కథలు ఉన్నాయి.భిన్న జీవన మార్గాలు తెలిపేవి. ఆదర్శవంతమైనవి. అనుసరణీయమైనవి. ఆచరణ సాధ్రంగా నిరూపితమైనవి.
ది హిందూస్థాన్‌ టైమ్స్‌వారి పత్రిక 'మింట్‌' పరిశోధనగా గత 75ఏండ్ల స్వతంత్ర భారతావనిని ప్రభావితం చేసిన పది అంశాలలతో 'ఐ.ఆర్‌.8.వరి' విజయ సృష్టికర్తగా శ్రీ నెక్కింటి సుబ్బారావును పేర్కొన్నది. 1960వ దశకంలో ఈ వరి వంగడం అప్పటికంటే ఎక్కువగా అనూహ్యంగా పదిరెట్లు అధిక దిగుబడిని సాధించింది. ఈ వరి వంగడాన్ని సాగుచేసిన రైతుల్లో దేశంలో ప్రథముడు నెక్కంటి.ఈ ప్రయత్నమే హరిత విప్లవానికి నాందిగా పేర్కొన్నది. ఒక ఛాలెంజింగ్‌ పర్సనాలిటీ గురించి కథ రాయాలనే సంకల్పంతోనే లలితా శేఖర్‌ తనకు బాగా పరిచయం ఉన్న నెక్కంటినే కథానాయకుడిగా (విజయ రామయ్యగా)చేసి పుడమితల్లి నేస్తాన్ని ఆవిష్కరించారు.
అలాగే 'సేద్యం ధీరబోజ్యం'లో కథానాయకుడు వెంకట్‌ అసలు పేరు ఏడుకొండలు.లలిత ప్రియ శిష్యుడు'దీక్ష' కథలో కథానాయిక శాంతి నిజ జీవితంలో కూడా శాంతియే. ఇక చివరిగా 'ఎరుక'కథకు మూలం రచయిత మాటల్లోనే ఓ గ్రామీణ రైతుకు ఉండే జ్ఞానం పట్ల అవెర్‌నెస్‌ మీద నాకు ఉన్న పూర్తి నమ్మకం ఈ కథ రాయించింది. రచయిత రైతు పక్షపాతి అని వేరుగా చెప్పనక్కర్లేదు కదా.
కాల్పనికేతర సాహిత్యం అయినప్పటికీ లలిత పాఠకుల అంతరంగాన్ని లలితంగా సృజించే అవకాశాన్ని ఎక్కడా వదులుకోలేదు.
'ఒక మనిషితోనో, ఒక బంధంతోనే నీ జీవితం ముడిపడి లేదు. అడుగిడిన ప్రతి ఊరూ నీఊరే. ఎదురైన ప్రతి మనిషి నీవాడే. ఏదీనీది కాదు.నీది కానిది ఏదీ లేదు. ఆ ధైర్యపడకు. నలుగురికి ఉపకారం చేసే మార్గంలో నడువు. తొలిపుటలోనే ఓ తాత్విక బంధంతో పాఠకున్నికట్టడి చేస్తుంది. వ్యవసాయ క్షేత్రం తల్లివంటిద. కుటుంబాలను కలుపుతుంది. మనుషులను కలుపుతుంది. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపుతుంది అంటూ భూమి పట్ల, మనుషుల పట్ల, అవ్యాజమైన ప్రేమ గుణాన్ని వ్యక్తపరుస్తుంది.
రచయిత స్వతహాగ అధ్యాపకురాలు గనుక ఆ పాత్ర స్వగతం చూడండి. కాలేజీకి అడుగుపెడుతూనే నాలో ఓ ఉత్సాహం ప్రవేశిస్తుంది. ఈ చదువులమ్మఒడి నాకు ఒక వేదిక. నాలోపలి తపనకు, తత్వానికి భగవంతుడు నాకు ఏర్పర్చిన దారి. జీవితంలో వికసించడానికి మొగ్గల్లా సిద్ధంగా ఉన్న పిల్లని చూడగానే,ఆనందంగా జీవించడానికి కావాల్సిన మెలుకువలను వారికి కలిగించాలనే తపన కలుగుతుంతి. ఇది నాకూ, నా విద్యార్థులకు మధ్య ఒక బంధం ఏర్పరిచింది.' ఇలా సరళంగా సహజంగా సాగిపోతుంది.ఎక్కడా అతిశయం కన్పించదు.
మనకు ఇష్టం ఉన్నా లేకున్నా,మనం అంతకుముందు నుంచే నిర్మితమైన ఓ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతి చట్రం అనివార్యంగా జీవిస్తున్నామనేది ఓ వాస్తవం. అయితే మనిషిని మనిషిగా జీవించనీయకుండా ఓజంతువుగానే, యంత్రంగానే మార్చే పరిస్థితులు దోపిడీ వ్యవస్థలో కోకొల్లలతు. అప్పుడే మనిషిని ఎలాగైనా లంగదీసుకోవచ్చు. ఎన్ని నీచమైన పనులైనా మనిషిచేత చేయించుకోవచ్చు అనేది దోపిడీ దృక్పథం.
(ఎక్ప్‌ఆ్లయిటేషన్‌ ఏటిట్యూడ్‌) మనిషి మనిషిగా నిటారుగా నిలబడాలంటే సచేతనం ముఖ్యం. దోపిడీ వ్యవస్థకు అది నచ్చదు.ప్రమాదమని దానికి తెలుసు.
ఈ నేపథ్యంలో నవ్యంగా ఆలోచించడం, నాణ్యంగా జీవించడం కొందరికే సాధ్యం.ఆ కొందరిలా జీవించాలంఏ ఇలాంటి పుస్తకాలు చదవడం అవశ్యం.
భారత రైతంగానికి అంకితమొనర్చిన ఈ పుస్తకాన్ని అమరావతి పబ్లికేషన్స్‌ ప్రచురించింది. వెల రూ.100.

- కె.శాంతారావు, 9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.