Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

          సమ్మెట ఉమాదేవి.... తెలుగు కథలు, బాల సాహిత్యం చదువుతున్నవాళ్ళకు పరిచయం అవసరంలేని పేరు. తాను పనిచేసిన ప్రతి చోటును... అక్కడి పిల్లలను... వాళ్ళ కుటుంబాలను సాహిత్యం చేసిన పంతులమ్మ. గిరిజన పిల్లలకు అండగా నిలిచిన అమ్మ. వరంగల్‌కు చెందిన సమ్మెట ఉమాదేవి బందరులోని అమ్మమ్మ ఇంట్లో ఆగస్టు 17, 1961న పుట్టింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయినిగా దాదాపు ఇరవైయేండ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లోని తండాలు, పల్లెల్లో పనిచేసింది. పనిచేసింది అనడంకంటే కలిసి జీవించింది అనడం సబబు. నూటా ముప్పైకిపైగా కథలు రాసి ముప్పై బహుమతులు అందుకుంది. రచయిత్రిగా గిరిజన జీవితాలను కథలుగా చిత్రించి 'రేలపూలు', 'జమ్మిపూలు'గా తెచ్చిన ఉమాదేవి ఇతర రచనలు 'అమ్మ కథలు', 'సమ్మెట ఉమాదేవి కథానికలు'.
            ఉపాధ్యాయినిగా, బాలికల విద్యాభివృద్ధి అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఉమాదేవికి అంగన్‌వాడీలతో, అక్కడి పిల్లలతో అనుబంధం ఉంది. వాళ్ళకోసం పనిచేసింది కూడా. వృత్తిరీత్యా డిపెప్‌లో పనిచేయడమేకాక, ఆసక్తి, అభిరుచితో ఉద్యోగ విరమణ తరువాత కూడా 'ప్యూర్‌' వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పాఠశాలల మౌలిక సధుపాయాల అభివృద్ది కోసం పనిచేస్తోంది. నాలుగు నెలల్లో దాదాపు డెబ్భై అయిదు బడులు తిరిగి ఆడపిల్లల కోసం ఆరోగ్య తరగతులను నిర్వహించిన స్ఫూర్తి సమ్మెట ఉమాదేవికి సొంతం. మైసూరు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన సదస్సుల్లో బాల సాహిత్యంపై పత్రసమర్పణ చేశారు. వివిధ పత్రికలు, ఆకాశవాణి ద్వారా బాల సాహిత్యంపై ప్రసం గాలు, వ్యాసాలు వచ్చాయి. బాల సాహిత్య పరిషత్‌తో అనుబంధం ఉంది.
రచయిత్రిగా పలు పురస్కారాలు, రివార్డులు అందుకున్న ఉమాదేవికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం'తో పాటు 'నోముల సత్యనారాయణ కథా పురస్కారం', 'సాహితీ వారధి పురస్కారం', 'మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం', 'ఖమ్మం జిల్లా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ పురస్కారం', 'గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం', 'అపురూప విద్యా పురస్కారం', 'ప్యూర్‌ గురు పురస్కారం', 'రంజని-నందివాడ శ్యామల స్మారక పురస్కారం' వంటివి లభించాయి. బాల సాహిత్యానికి'తానా-మంచి పుస్తకం పురస్కార రచనగా వీరి రచన ఎంపికైంది.
బాలలతో నిరంతరం ఉండే అవకాశం అందరికీ రాదు... కొద్దిమందికే ఆ అవకాశం వస్తుంది. అలా వచ్చినదానిని వాళ్ళ కోసం ఉపయోగించడం ఒక కళ.. ఆ కళ తెలిసిన ఉమాదేవి వాళ్ళతో ఉన్న క్షణాలను, వాళ్ళ లక్షణాలను, వాళ్ళ అనుభవాలను, అనుభూతులను, వాళ్ళతో తనకున్న రెండు దశాబ్ధాల సంబంధబాంధవ్యాలను అందరికోసం అక్షరర రూపంలో అందించిన రచన 'మా పిల్లల ముచ్చట్లు', ఇది ఒక టీచర్‌ అనుభవంగా కనిపించినా అనేక మంది బడిని ప్రేమించే పంతులమ్మలు, పంతుళ్ళ వ్యక్తిత్వాలకు ప్రతినిథిగా నిలిచే రచన.
రచయిత్రిగా ఎంతగా గిరిజన జీవితాలతో పాటు మానవ సంబంధాలు, మమతలు, ఆర్థిక సామాజిక స్థితి గతులను తన రచనల్లో చిత్రించారో బాల సాహితీవేత్తగా అదే విధంగా పిల్లల కోసం రచనలు చేశారు సమ్మెట ఉమాదేవి. 'అల్లరి కావ్య', 'పిల్లల దండు', 'నిజాయితి', 'పిల్లి ముసుగు' పుస్తకాలు పిల్లల కోసం విజయవాణి తెచ్చినవి. బాలల కోసం మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాన్ని 'పిల్లల బొమ్మల రామకృష్ణ పరమహంస' పేరుతో రచించారు. ఇవేకాక 'చిలుక పలుకులు' పిల్లల కథలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇటీవల వచ్చిన పుస్తకం 'నిక్‌ అంటే ప్రేరణ.'
పిల్లల కోసం మౌళిక రచనలే కాక బడిపిల్లల కోసం పాటలు రాయడమేకాకుండా, కొన్ని ప్రసిద్ధ హిందీ గేయాలను తెలగులోకి అనువాదం చేశారు సమ్మెట ఉమాదేవి. వాటిలో 'సారే జహాసె అచ్చా... హిందుస్తా హమారా', 'హంద్‌ దేశ్‌కే నివాసీ సబీజన్‌ ఏక్‌హై', 'హం మోంగే కామియాబ్‌' వంటివి కొన్ని. ఇవి వీరికి చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి కూడా. బాలల కథలు 'చిలుక పలుకులు కథల్లో పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉండే అనేక విషయాలను వాళ్ళకు హత్తుకునేలా చిలకల నేపథ్యం గా చెబుతారు రచయిత్రి. ఇక నిక్‌ గురించి రాసిన పుస్తకం ఇటీవల వీరికి మంచి పేరును తెచ్చిపెట్టడమే కాక పూర్తిగా వైకల్యమున్నా దివ్యంగా వెలిగిన దివ్యాంగుడైన ఉయిచిచ్‌ నిక్‌ విజయగాథ యిది. రంగుల బొమ్మలతో వివరణాత్యకంగా ఉన్న ఈ పుస్తకంలోని హీరో నిక్‌ పిల్లలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తి ప్రధాత. రచయిత్రిగా, కవయిత్రిగా, బాల వికాస కార్యకర్తగా అనేక కోణాల్లో పనిచేస్తున్న సమ్మెట ఉమాదేవి గిరి బాలల చదువుల సిరి, గిరి. ఉమ్మక్కకు అభినందనలు... జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
రిఫండ్‌

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.