Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

ల‌త్కోర్ సాబ్‌

''నీకైనా, మీకైనా, జెనాలకైనా, దేవతలకైనా రైతులు పండించడం వల్లే అన్నం దొరుకుతున్నది. ఈ దిక్కుమాలిన రాష్ట్రంలో రైతులు బాగున్నారా?'' అని మూషికరాజం అడిగింది.
''ఎక్కడ బాగు. పంటలు పండకా అప్పులు బాధ భరించలేకా పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు'' అని ఒక చుంచెలుక చెప్పింది.
''మహామంత్రి లత్కోర్‌ ఏం చెయ్యడం లేదా?''
''ఎందుకు చెయ్యడం లేదు. చేసాడు''
''ఏం చేసాడు?''
''రైతుల మరణాల మీద ఒక విచారణ సంఘాన్ని వేసాడు.''
''విచారణ సంఘమా?''
''అవును. విచారణ సంఘమే''
''ఎవరితో'?''
''వేదాంతులూ; వ్యవసాయ శాస్త్రవేత్తలు; వడ్డీ వ్యాపారులూ; డాక్టర్లతో''
''వీరేం చేస్తారు?''
''రైతు ఆత్మహత్యలకు గల కారణాల్ని తెలియజేస్తారు?''
''వేదాంతులకూ, రైతు ఆత్మహత్యలకూ సంబంధమేమిటి?''
''సంబంధముంది''
''అదెలా?''
వేదాంతులకు ఆత్మతో సంబంధముంది. రైతుల ఆత్మహత్యల్లో ఆత్మ ఉంది. ఆ కారణంగా రైతులు ఆత్మను ఎందుకు హత్య చేసారో తెలుసుకోవడానికి వేదాంతులు ప్రయత్నిస్తారు''
''వ్యవసాయ శాస్త్రవేత్తలెందుకు?''
''రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొంటున్నారు. పురుగుల మందు గురించి వ్యవసాయ శాస్త్రవేత్తల కంటే ఇంకెవరికి బాగా తెలుసు''
''బాగానే ఉంది. కానీ రైతుల ఆత్మహత్యలకూ, వడ్డీ వ్యాపారులకూ ఎలా సంబంధముందో నాకు అర్థం కావడం లేదు''
''ఇందులో అర్థం కాకపోవడానికేముంది? అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పులిచ్చేదెవరు? వడ్డీ వ్యాపారులు''
''రైతుల ఆత్మహత్యల మీద డాక్టర్లేం చేస్తారు?''
''రైతుల శవాల్ని డాక్టర్లు పరీక్షిస్తారు. వారి ఆత్మహత్యలకు గల కారణాల్ని కనుక్కుంటారు.''
''వేదాంతులేం చేశారు?''
''ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి వేదాంతులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు శివాలయానికి వెళ్లారు. అభిషేకం చేసారు. మారేడు దళాలతో పూజించారు. లింగాష్టకం చదివారు. ఎంత పూజ చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా ఆత్మ అంటే వాళ్లకు తెలియలేదు.''
''తెలియకపోతే వాళ్లేం చేసారు?''
''శివాలయమైతే లాభం లేదని రామాలయానికి వెళ్లారు''
''రాజకీయ నాయకులు పార్టీ మారినట్లు వేదాంతులు ఈ దేవుడి నుంచి ఆ దేవుడికి మారారన్నమాట''
''అవును. రామ నీల మేఘ శ్యామా! అని పాడుతూ వారు పూజలు చేసారు. కళ్లు మూసుకొని రాం రాం అంటూ ధ్యానం చేసారు. సిఫార్సు లేనిదే దేవుడు సైతం కరుణించడని మముబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ! అంటూ సీతాదేవిని వేడుకొన్నారు. ఎన్ని కీర్తనలు పాడినా ఎంతగా ప్రార్థించినా లాభం లేకపోయింది.''
''ఆత్మ అంటే తెలుసుకోవడానికి వేదాంతులు ఇంకేమైనా చేసారా?''
''పూజలూ పునస్కారాల వల్ల లాభం లేకపోవడంతో వేదాంతులు మత గ్రంథాల్ని తిరగేసారు. మత గ్రంథాల్ని తిరగేస్తుండగా ఒక వేదాంతికి ఆత్మ అంటే ఏమిటో తెలిసింది''
''అది సరే. రైతుల ఆత్మహత్యలకు గల కారణమేమిటో తెలిసిందా?''
''తెలిసింది. రైతుల ఆత్మహత్యలపై వేదాంతులు ఒక నివేదిక తయారు చేసారు''
''ఏమిటా నివేదిక. అందులో ఏముంది?''
''ఆత్మ నిప్పులో కాలదు. నీళ్లలో నానదు. ఆత్మను కత్తి నరకలేదు. తుపాకీ గుండు తునకలు చెయ్యలేదు. ఆత్మకు చావులేదు. చావు లేని ఆత్మను రైతులెలా హత్య చేస్తారు. రైతుల ఆత్మహత్య బూటకం. పత్రికలు అల్లిన కట్టుకథ అంటూ వేదాంతులు నివేదిక తయారు చేసారు. దాన్ని లత్కోర్‌ సర్కారుకు పంపారు''
''వహ్వా! ఏం నివేదిక! ఏం నివేదిక! వ్యవసాయ శాస్త్రవేత్తల నివేదిక మాటేమిటి?''
''పురుగుల మందును పంట పొలాలపై జెల్లి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరీక్షించారు. పరీక్షించిన తరువాత నివేదిక తయారు చేసారు''
''ఏమిటా నివేదిక''
''పురుగుల మందుకు పురుగులే చావడం లేదు. పైగా పెళ్లాం పిల్లలతో సుఖంగా ఉన్నాయి. పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్య చేసుకోవడం శుద్ధ అబద్ధం. ఇది కేవలం ప్రతిపక్షాల ఆరోపణ అంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు నివేదిక తయారు చేసారు''
''వడ్డీ వ్యాపారుల మాటేమిటి?''
''వడ్డీ వ్యాపారులు నలుగురికీ అప్పులిచ్చారు. కానీ ఆ నాలుగులో మూడు మొండి బాకీలు. వడ్డీ వ్యాపారులు ఎంత తిరిగినా ఏం చేసినా అవి వసూలు కాలేదు.''
''వసూలు కాకపోతే వారేం చేసారు?''
''రైతు ఆత్మహత్యలపై నివేదిక తయారు చేసారు.''
''బాకీలు వసూలు కాకపోతే నివేదికా! చిత్రంగా ఉందే. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది?''
''ఇవాళ్రేపు అప్పు తీసుకొన్నవాడు మహారాజులా దర్జాగా ఉన్నాడు. అప్పు ఇచ్చిన వాడే అప్పు తీసుకొన్న వాడి చుట్టూ తిరుగుతున్నాడు. ఆత్మహత్య చేసుకొంటే అప్పు ఇచ్చిన వాడు చేసుకొంటాడు. కానీ అప్పు తీసుకొన్న వాడు కాదు. రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం కట్టుకథ. గిట్టని వారు ప్రభుత్వంపై జల్లిన బురద అని వడ్డీ వ్యాపారులు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికిచ్చారు.''
''డాక్టర్లేం చేసారు?''
''డాక్టర్లు రైతుల శవాలకు పరీక్షలు జరిపారు. ఒక డాక్టర్‌ శవపరీక్ష చేస్తూ ఒక రైతు శవం కడుపు కోసాడు. ఆ రైతు శవం కడుపులో అతనికో అన్నం మెతుకు కనిపించింది. అన్నం మెతుకు కనిపించగానే అతని కళ్లు మెరిసాయి. నిజమేమిటో తెలిసిపోయింది. రైతుల ఆత్మహత్యలపై వెంటనే అతనో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చాడు''
''ఆ నివేదిక ఏమిటి?''
''రైతులు అప్పుల బాధ భరించలేకా ఆత్మహత్య చేసుకోలేదు. పురుగుల మందు తాగీ ప్రాణాలు తీసుకోలేదు. కేవలం తిన్నది అరక్క చచ్చారంటూ ఆ డాక్టర్‌ నివేదికనిచ్చాడు''
''అందరూ ఇచ్చిన నివేదికలను చూసిన తరువాత మహామంత్రి లత్కోర్‌ ఏం చేసాడు?''
''నివేదికలన్నిటినీ చూసిన తరువాత లత్కోర్‌ పత్రికలకు ఫుల్‌ పేజీ అడ్వర్టైజ్‌మెంటిచ్చాడు.''
''అందులో ఏముంది?''
''రైతుల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ సంఘాన్ని వేసాము. రైతులు అప్పుల బాధ భరించలేకా ఆత్మ హత్య చేసుకోలేదనీ పురుగుల మందు తాగీ ప్రాణాలు తీసుకోలేదనీ కేవలం తిన్నది అరక్క చచ్చారని ఆ సంఘమిచ్చిన నివేదికలో తేలింది. ఇప్పటి నుంచి రైతులందరూ నాలాగే పొద్దుగూకులూ పని చేస్తూ మన దిక్కుమాలిన రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని కోరుతున్నాను అని లత్కోర్‌ ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో విజ్ఞప్తి చేసాడు'' అని చుంచెలుక మూషిక రాజానికి చెప్పింది.
''దిక్కుమాలిన రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయి'' అని మూహిక రాజం అడిగింది.
''ఒక మెతుకు పట్టి చూపుతాను.''
అమ్మో నగరంలో వెంకట్రావు మధ్య తరగతి ఉద్యోగి. అతనికి తల్లీదండ్రా, పెళ్లాం పిల్లలూ ఉన్నారు. అప్పులూ, తిప్పలూ ఉన్నాయి. కష్టాలూ, కన్నీళ్లూ ఉన్నాయి. అవి పిలవని పేరంటంలా వస్తూ ఉంటాయి.
ఆ రోజే ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. వెంకట్రావు తన స్నేహితులందరినీ విందుకు పిలిచాడు. వీలున్న వాళ్లంతా వచ్చారు.
అతని కొడుకు ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వాడి మెడలో పూలదండ ఉంది. వాడి ముందు చిన్న టేబుల్‌ ఉంది. దాని మీద ఒక కేక్‌ ఉంది. ఆ కేక్‌ను వాడు కోసాడు
''హ్యాపీ బర్త్‌డే టూ యూ'' అని అంటూ అందరూ చప్పట్లు కొట్టారు.
''ఇవాళ మా వాడి బర్తడే కాదు.'' అని వెంకట్రావన్నాడు.
''మరేమిటి?'' అని ఒకడడిగాడు.
''ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చాయి...'' అని వెంకట్రావు ఇంకేమో చెప్పబోతుంటే-
''మీ వాడికి ఫస్ట్‌ క్లాస్‌ వచ్చిందా?''
''రాలేదు''
''మరెందుకు పార్టీ''
''ఎందుకంటే మా వాడు ఫెయిల్‌ అయినందుకు''
''ఫెయిల్‌ అయింనందుకు పార్టీయా!''
అవును. మా వాడు ప్యాసయితే వాణ్ని ఏ బీటెక్కో, ఏ ఎంబిఏలోనో చేర్చాలి. అందుకు లక్షలు డొనేషన్‌ కట్టాలి. ఫీజులు చెల్లించాలి. వాటి కోసం అప్పులు చెయ్యాలి. వాటి మీద వడ్డీ మీద వడ్డీ కట్టాలి. అసలు తీర్చలేక చావాలి. మా వాడు నాకు ఈ బాధలు లేకుండా చేసాడు.'' అని అన్నాడు.
ఈ విషయాన్ని చుంచెలుక చెప్పింది.
''వినాయకుని దగ్గరకెళ్లాలి'' అంటూ మూషిక రాజం వెళ్లిపోయింది.
********
చిమ్మన్‌ చీకటి. నిద్రాదేవి ఒడిలో అందరూ సేద తీరుతున్నారు. అందరూ అంటే అందరు కాదు. కొందరు నిద్ర రాక అటిటూ బొర్లుతున్నారు. కొందరు కలవరిస్తున్నారు. మరికొందరు కలల బజార్లో తిరుగుతున్నారు. కలల బజార్లో తిరుగుతున్నా కొందరికి యాక్సిడెంట్లవుతున్నాయి. కుక్కలు భౌ బౌ మంటున్నాయి. కీచురాళ్లు గాన కచేరీ చేస్తున్నాయి. దోమలు వీర విహారం చేస్తున్నాయి. లాటీతో రోడ్డు మీద ముద్రలేస్తూ గూర్ఖా గస్తీ తిరుగుతున్నాడు. పాల కోసం లేచి ఏడుస్తున్న పసివాణ్ని ఓ ఉద్యోగి అఫీసర్‌లా అదమాయిస్తున్నాడు.
సింహగిరిలో చీమ చిటుక్కుమన్నా వినిపించడం లేదు. అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. పవళింపు సేవ కావడంతో ఆయన నిద్రపోతున్నాడు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. మూసిన తలుపులకు తాళాలూ ఉన్నాయి. దేవుడికీ దొంగల భయముంటుంది.
గర్భగుడిలో పడుకొన్న నరసింహస్వామి హఠాత్తుగా మేల్కొన్నాడు. ఎప్పుడూ పక్కనే ఉండే లక్ష్మీదేవి ఆయనకు కనిపించలేదు. మొగుడూ పెళ్లాలన్నాక చిన్నపాటి కొట్లాటలవుతూనే ఉంటాయి. అసువంటివేవీ కాలేదు. ఫలానిది కావాలనీ అడగలేదు. నా మీద అలిగిందా? అలిగితే ఎందుకలిగింది? ఎక్కడికెళ్లింది? ఎందుకెళ్లింది అని నరసింహస్వామి అనుకొన్నాడు. ఎక్కడికెళ్లినా ఇక్కడికి రాకుండా పోతుందా అని ఊరుకోకుండా బుగులు లేకుండా మొగులు తొవ్వపొంటి బయల్దేరాడు.
తొవ్వ నడ్మలో సింహగిరి వైపు వస్తున్న నారదుడు ఆయనకు ఎదురయ్యాడు.
''నారాయణ నారాయణ నేను మీ దగ్గరకొస్తుంటే మీరెటు వెళుతున్నారు స్వామీ!''
''ఏం చెప్పమంటావు నారదా! అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే లక్ష్మీదేవి కనిపించలేదు. ఆమెను వెతుకుతూ వెళుతున్నాను''
''లక్ష్మీదేవి మీ మీద అలిగిందేమో దేవా!''
''నేనామెను ఏమనలేదే''
ఈ మధ్య జరిగిన సంఘటనల్ని ఓ సారి గుర్తుచేసుకోండి''
''ముసలితనం వల్ల మతిమరుపొచ్చింది నారదా!''
''గుర్తు తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి''
గడ్డం కింద చెయ్యి పెట్టుకోని పైకి చూస్తూ నరసింహ స్వామి ఒక్క తీర్గ ఆలోచించాడు.
''ఆ గుర్తుకొచ్చింది నారదా!''
''అదేంటో చెప్పండి''
''తన పుట్టింటి వారిని అడవి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారనీ, నేనేమో నిమ్మకు నీరెత్తినట్లున్నాననీ ఓ సారి లక్ష్మీ నాతో అన్నట్లు గుర్తు''
''ఎవరు వెళ్లగొట్టాలని చూస్తున్నారు? ఎందుకు వెళ్లగొట్టాలని చూస్తున్నారని మీరామెనడిగారా?''
''అడక్కపోగా ఇంతకీ మీ పుట్టింటి వారెవరన్నాను''
''అలా ఎందుకడిగారు దేవా?''
''ఏం చెయ్యమంటావు నారదా! అన్నీ మరిచి పోతున్నాను. నేనలా అడగ్గానే ఆమె చిన్నబుచ్చుకొంది. నాతో మాట్లాడటం తగ్గించేసింది.''
''మీరలా అడిగితే ఆమెకు కోపం రాదా మరి. రామావతారంలో సీత మీ సహచరి. కృష్ణావతారంలో రుక్మిణి మీ భార్య. నరసింహావతారంలో చెంచులక్ష్మి మీ ధర్మపత్ని. ఆమె పుట్టింటి వారు చెంచులు. వారు నల్లమల అడవిలో ఉన్నారు. నల్లమలే చెంచులక్ష్మి పుట్టిల్లు.''
''ఇంతకీ చెంచులకొచ్చిన కష్టమేమిటి నారదా?''
''నల్లమల అడవిలో యురేనియం ఉంది. నాయకులు దాన్ని పైకి తియ్యాలని చూస్తున్నారు. అందుగ్గాను చెంచుల్ని అడవి నుంచి తరిమేయాలనుకొంటున్నారు''
''అడవిలోనే ఉండాలన్న రూలేమిటి? చెంచులు ఎంచక్కా ఏ నగరంలోనో ఉండొచ్చు గదా.''
''చెంచులకి అడవే ప్రాణం. అడవి నుంచి వెళ్లగొడితే నీళ్ల నుంచి పైకి తీసిన చేపల్లా వాళ్లు గిలగిలా తన్నుకొంటారు''
''యురేనియం ఎందుకు పైకి తియ్యాలనుకొంటున్నారు'' అని నరసింహస్వామి అడిగాడు.
''ఏం తెలియకుండా ఎలా ఉంటున్నారు స్వామీ!''
''గర్భగుడిలో ఉండే నాకు విషయాలు ఎలా తెలుస్తాయి నారదా!''
''మరి లక్ష్మీదేవికి ఎలా తెలుస్తున్నాయి?''
''ఆమె అందరిళ్లలో ఉంటుంది''
''ఆమె మీకేం చెప్పలేదా?''
''చెప్పలేదు. అన్నీ స్వయంగా నేనే తెలుసుకోవాలంటుంది''
''యురేనియం గురించి అడిగారు కదా. దాంతో కరెంటు పుట్టించవచ్చు. బాంబులూ తయారు చేయవచ్చు'' అని నారదుడు చెప్పాడు.
''మరెందుగ్గొడవ''
''అది భూమిలో దాచిన భూతం లాంటిది. అది పైకి వచ్చిందంటే...'' అని నారదుడింకేమో చెప్పబోతుంటే నరసింహుడు అడ్డుకొని-
''అది భూమ్మీదకు వస్తే ఏమవుతుంది?'' అని అడిగాడు
''అడవిలోని జంతువులన్నీ చచ్చిపోతాయి. దానిలోని చెట్ల ఆకులూ, దాని దగ్గరలోని నదుల నీళ్లూ విషంగా మారుతాయి. జెనాలకు రోగాలొస్తాయి.''
''చెంచులేమనటం లేదా?''
''బూమ్ల ఉన్న దాన్ని మీద్కి దెచ్చి బూమ్మీద ఉన్లోల్లను సంపుతరా? చిన్లోల్లమంత గల్సి ఒక పెద్దోన్ని కుర్సి మీద గూసుండ బెట్టినం. ఎందుగ్గూసుండబెట్టినం. మాకెమన్న అయితె మాతోనే ఉంటడని. గిప్పుడు మాకు కష్టమొచ్చింది. మాకు కష్టమొస్తే పెద్దోడు అడ్డం దిర్గాలె. గని తిర్గుతలేదు. గిప్పుడు మేమేం జేస్తం. పెద్దోనికే అడ్డం దిర్గుతం' అని చెంచులు అంటున్నారు దేవా.
''వారికి అండగా ఉండటానికే లక్ష్మి అడవికెళ్లిందంటావా?''
''అవును''
''లక్ష్మి దేవి సింహగిరికి తిరిగిరావాలంటే ఏం చెయ్యాలి నారదా?''
''యురేనియం తవ్వకాలు నిలుపగలిగితే లక్ష్మిదేవి సింహగిరి తిరిగి వస్తుంది''
''వాటినెలా ఆపాలి''
''మీరు జెనంలో కలిసి ఆ తవ్వకాన్ని అడ్డుకోవాలి. ప్రజాశక్తి ముందు ఎంతటి ప్రభుత్వమైనా తలవంచక తప్పదు.''
''నువ్వు చెప్పినట్లే చేస్తా నారదా!''
''వస్తా దేవా! నారాయణ నారాయణ'' అంటూ నారదుడు వైకుంఠం వైపు వెళ్లాడు.
నరసింహ స్వామి నల్లమల వైపు నడిచాడు.
ఏదో చప్పుడుకు లత్కోర్‌కు మెలకువొచ్చింది. గాబరాపడుతూ ఆయనగారు లేచి కూర్చున్నారు. ఇదేమిటి ఇలాంటి కల పడింది. సింహగిరిలో పెద్ద ఎత్తున యాగం చెయ్యాలనుకుంటున్నాను. నరసింహస్వామి, లక్ష్మీదేవీ లేకపోతే కొంప మునుగుతుంది. ఇంతకీ ఈ కల నిజమైతుందా? ఒక వేళ నిజమైతే? ఎందుకన్నా మంచిది ఏదో ఒకటి చెయ్యాలని అతను అనుకొన్నాడు.
********

- తెలిదేవ‌ర భానుమూర్తి
   99591 50491
తరువాయి వచ్చేవారం....

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.