Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2022

బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'

           దుప్పల్లి శ్రీరాములు.... ఈ పేరు ఇవ్వాళ్ళ బాల సాహిత్యం రాస్తున్న కొందరికి కొత్తగా అనిపించొచ్చు... మరి కొందరికి తెలియక పోవచ్చు. కానీ పిల్లల కోసం... వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం తపించే 'తాత' దుప్పల్లి శ్రీరాములు. మహబూబ్‌ నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం దుప్పల్లిలో 1942లో శ్రీరాములు పుట్టారు. శ్రీమతి నారాయణమ్మ, శ్రీ ఈశ్వరయ్యలు తల్తిదండ్రులు. అయిదవ తరగతి వరకు చదువుకున్న శ్రీరాములు కవి, రచయిత, రంగస్థల నటులు, నాటకకర్త. వ్యాసాలు, కీర్తనలు, మంగళ హారతులు, బాలల నాటికలు రాశారు.
            ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావన, జాతీయ చేతన ప్రధానంగా కార్యక్రమాలు, పనులు, రచనలు చేసిన శ్రీరాములు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రసిద్ధులు. శ్రీసరస్వతీ విధ్యా పీఠం శారాధాధామంతో ప్రత్యక్ష సంబంధంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మప్రచార పరిషత్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుభప్రదం వంటి కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా కోలాటం, చెక్క భజనలు, తాళం వంటివి వీరికి యిష్టమైన కళా రూపాలు.
మూసి మొదలుకుని అక్షరాంజలి వరకు వివిధ పత్రికల్లో అనేక అంశాలపైన వ్యాసాలు రాశారు. వందలాది కార్యక్రమాల్లో వక్తగా, ధార్మిక ప్రసంగకర్తగా పాల్గొన్నారు. 'పాలమూరు జిల్లా నాటక కళా వైభవము', 'నేటి పౌరాణిక నాటక దుస్థితి' వంటివి వీరి రచనలు. నాటకకర్తగానే కాక రంగస్థల నటునిగా అనేక ప్రదర్శనలిచ్చిన శ్రీరాములు 1977 నుండి నేటివరకు సాగిని వీరి నట ప్రస్థానంలో శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో అస్థాన నటులుగా, మహా మహా నటుల సరసన వికర్ణుడుగా, భువన విజయ రూపకంలో భట్టుమూర్తిగా, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి ద్రౌపదిగా నటించిన నాటకంలో శ్రీకృష్ణుడిగా, చింతామణి నాటకంలో బిల్వమంగళుడిగా, పోతనగా, అన్నమయ్య తండ్రిగా, గోవింద భగవత్పాదులుగా, బెజ్జమహాదేవి నాటకంలో మరుళయ్యగా, శతరూపలో మహామంత్రి తిమ్మరుసుగా... ఇలా అనేక పాత్రలను లబ్దప్రతిష్టులైన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, దూళిపాళ సీతారామ శాస్త్రి, పీసపాటి నర్సిహ్మమూర్తి వంటి వారి సరసన నటించి మెప్పును పొందారు. నటులుగా తెలుగు విశ్వవిద్యాలయం అందించే పైడి లక్ష్మయ్య ఉత్తమ నటనా కీర్తి పురస్కారం అందుకున్నారు. తెలుగు నాటకరంగ దినోత్సవాన కందుకూరి వీరేశలింగం పంతులు పురస్కారం, గధ్వాల బాల భవన పురస్కారం వంటివి అందుకున్నారు దుప్పల్లి శ్రీరాములు. వీరి ఆధ్యాత్మిక, ధార్మిక సేవలకు 'హిందూరత్న' బిరుదుతో సత్కరించారు.
ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా అగ్రశ్రేణిలో వెలుగొందు తూనే అనేక ధార్యిక సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు అనేక ధార్యికోత్సవాల్లో భాగస్వాములైన వీరు పిల్లల కోసం పౌరాణికాలతోపాటు అనేక అంశాలతో 'బాలల నాటికలు' రాయడం విశేషం. ఇది 2013లో వెలువడింది. నిజానికి పిల్లల కోసం అన్ని ప్రక్రియలు, రూపాల్లో రచనలు వస్తున్నప్పటికీ నాటికలు, నాటకాలు తక్కువనే చెప్పాలి. తెలంగాణలో నేడు డా.అమృతలత, మధిర బాబ్లానాయక్‌ వంటి నలుగురైదుగురు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఆ కోవలో పిల్లల నాటికలు రాసిన బాలల నాటకకర్త మన దుప్పల్లి శ్రీరాములు.
వీరి 'బాల నాటికలు' విలక్షణమైన సంపుటి. రెండువందల పుటల ఈ పుస్తకంలో 22 రెండు పౌరాణిక నాటికలు, 13 చారిత్రక నాటికలు, 12 సాంఘిక నాటికలతో పాటు నవరత్నాలు పేరుతో పిల్లలకు సంబంధించిన వివిధ అంశాలపై తొమ్మిది నాటికలున్నాయి. ఇవేకాక మరో 20 ఏకపాత్రలు ఉన్నాయి. పౌరాణికాల్లో 'భారత ధరణీస్తుతి', 'మాతృదేవో భవ', 'భక్తమార్కండేయ' వంటి నాటికలు పిల్లల్లో స్ఫూర్తి కలిగించాలన్న సంకల్పంతో రాశారు. ఇవేకాక భగవద్గీత, దానవీరము, భక్త శభరి, రాజదర్బారు వంటివి చక్కని నాటికలు. చారిత్రకాల్లో విగ్రహారాధన మూఢనమ్మకం కారాదని 'వివేక విజయం', పరస్త్రీలను ఎలా గౌరవించాలో తెలియాలనేది 'శివాజీ సౌశీల్యము', శత్రువును సైతం క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని 'శ్రీ మాతృమూర్తి తీర్పు' అనే నాటికలో రాస్తారు. పిల్లల కోసం రాసిన సాంఘికాల్లో 'సత్యమేవజయతే', 'బడిలో తెలుగుభాష', 'ఆడినమాట తప్పిన ఫలము', 'అమ్మ మాటపై నమ్మకము' వంటివి పిల్లలను ఆలోచింప జేస్తాయి. 'నవరత్నాలు' వీరి నాటికల్లో విలక్షణమైనవి. 'విద్యార్థులు-విద్య ప్రయోజనము', 'విద్యార్థులు-సస్త్రధారణ', 'విద్యార్థులు-క్రమశిక్షణ', 'విద్యార్థులు-సినిమా ప్రభావము', 'విద్యార్థులు-టివి ప్రభావము', 'విద్యార్థులు -మాతృమూర్తుల ప్రభావం', 'విద్యార్థులు-తల్లితండ్రుల ప్రభావం', 'విద్యార్థులు-ఉపాధ్యాయుల ప్రభావం', 'విద్యార్థులు-పోషక ఆహారం' వంటివి ఇందులోని నాటికలు. ఈ పేర్లతోనే ఇందులోని విషయం మనకు అర్థమవుతోంది. పిల్లలతో గడుపుతూ వాళ్ళతో ఈ నాటికలను ప్రదర్శింపజేస్తూ బాలల వికాసానికి కృషిచేస్తున్న పెద్దలు దుప్పల్లి శ్రీరాములు 'తాత' ధన్యులు. జయహో!దుప్పల్లి.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.