Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సూర్యచంద్రులు! | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2022

సూర్యచంద్రులు!

            ఒక స్కూలు. ఒక క్లాస్‌ రూం. క్లాస్‌ రూంలో అదో బెంచీ. ఆ బెంచీ మీద ఇద్దరు. ఒకటి పేరు సూర్య, మరొకడు చంద్ర. చంద్ర ముఖం చంద్రుడిలా లేదు. ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేదు. సూర్య ముఖం ఉదయపు సూర్యుడిలా ఎర్రగానూ, మధ్యాహ్నపు సూర్యుడిలా తెల్లగానూ లేదు. నలుపు సూర్యుడయితేనేం ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కే. సన్నగా పొడుగ్గా ఆ ముఖానికదో ప్రత్యేకమైనదిగా ఉంది.
సూటి ముక్కు ఉన్న సూర్యకు చిన్నప్పటి నుంచీ సూటిగా మాట్లాడ్డం అలవాటు. ఉన్నది ఉన్నట్టు మనసులో అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడ్డం అందరికీ చాతవదు. సూర్యకుమాత్రం అవుతంది.
మచ్చలేని చంద్రుడిలా ఉన్న చంద్రకు చిన్నప్పట్నించీ డొంక తిరుగుడుగా మాట్లాడ్డం అలవాటు. ఉన్నది లేనట్టు మనసులో అనుకున్నది కాక మరోలా మాట్లాడ్డం చాతయ్యే వాళ్ళు కొందరుంటారు. చంద్రకు యిది ఎవరూ నేర్పని విద్య.
మనుషులకి కొన్ని లక్షణాలు చిన్న నాటి నుంచే మొక్కలుగా మొదలయి పెద్దయ్యేప్పటికి వృక్షాలవుతయి. సూర్యచంద్రల లక్షణాలు స్కూలు రోజుల్లోనే పురుడు పోసుకున్నవి.
మాష్టారు పాఠం అంతా చెప్పి అర్థమయిందా అనడుగుతాడు. దాదాపు అందరూ అర్థమైంది అంటారు. కొందరు భయపడి, కొందరు నిజంగానే అర్థమయి. కాని సూర్యం మాత్రం నిర్మొహమాటంగా, సూటిగా అర్థంకాలేదు అని అరుస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఉండలేడు మరి. చంద్ర ఇందుకు పూర్తిగావ్యతిరేకం. పాఠం ఒక్క ముక్క క్కూడా బుర్రలో చోటు యివ్వలేకపోయినా పూర్తిగా అర్థమైంది అంటాడు. అందరు టీచర్లనీ పొగుడ్తాడు. ఎవరికి వారు వాడి మాటలు విని తాము బ్రహ్మాండంగా పాఠాలు చెబుతున్నామని, ఉత్తమ ఉపాధ్యాయులమని మురిసిపోతారు. ఒకళ్ళకు తెలీకుండా మరొకళ్ళను మునగ చెట్టు ఎక్కించే చంద్ర అంటే అందరికీ ప్రత్యేక అభిమానం. అందుకే మార్కులు బహుమానం.
సూర్యంటే ఎందుకో మార్కులకి కోపం. ప్రొగ్రెస్‌ కార్డులో ఎర్ర గీతలు ఎక్కువై పోయేవి. మంచోడు అనిపించుకున్న చంద్రుడూ పోరంబోకు అనిపించుకున్న సూర్యుడూ స్కూలు నుంచి కాలేజికి కలిసి ప్రయాణంచేరు. ఒకరివి అత్తెసరు మార్కులు. మరొకరివి మంచి మార్కులు. ఒకరంటే అందరికీ అభిమానం. ఒకరంటే అందరికీ తలనొప్పి, చిరాకు.
చదువయ్యాక చంద్రుడు వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టీ ఓ ప్రైవేటు కంపెనీలో మ్యానేజర్‌ అయ్యేడు. ఖర్మకాలి అదే కంపెనీలో సూర్యం గుమస్తా అయ్యేడు. చంద్రం చేసే వన్నీ చేస్తూ యజమానికి దగ్గరయ్యేడు. సూర్యం ముక్కుసూటిగా పనిచేస్తూ ఎవరినీ ఆకట్టుకోలేకపోయేడు. ఉన్నది ఉన్నట్టుగా మాటాడ్డం, ఖచ్చితత్వాన్ని పాటించడం స్వంత అభిప్రాయాలు కలిగి ఉండటం వాటినే వ్యక్తం చెయ్యడం సరియైనది కాదని అతనెప్పుడూ అనుకోలేదు. తనని తాను లోకానికి సరిపోయేట్టుగా మార్చుకునే ప్రయత్నమూ చెయ్యలేదు.
అందుకే ఓ నాడు యజమానితో గొడవపడ్డాడు. లెక్కల్లో తప్పులు బయట పెట్టాడు. మేనేజర్‌ కంపనీని మోసం చేస్తున్నాడని వాదించేడు. ముఖస్తుతికి, చెక్క భజనకీ లొంగిపోయే యజమాని సూర్యం తలపొగరును భరించలేకపోయాడు. నిజాలన్నీ అబద్ధాలనుకున్నాడు. అబద్ధాన్ని ఆలింగనం చేసుకున్నాడు. నిజాన్ని కాలుతో తన్నాడు. ఉద్యోగం ఊడి సూర్యం రోడ్డున పడ్డాడు.
ఇలా సూర్యం రోడ్డున పడటానికి ముందు ఓ సంఘటన జరిగింది. ప్రతిమనిషి జీవితమూ సంఘటనల సమాహారమే. సూర్యం జీవితం కూడా. గుమాస్తాగా చేరిన కొన్నాళ్ళకే పెళ్ళికొడుకయ్యేడు సూర్యం. కొత్తలో ఇద్దరికీ కొత్తే కదా. ఆ తర్వాత ఇద్దరిలో పాతా బయటకు తన్నుకుంటూ వచ్చేయి. సూర్యం పద్ధతి ఆమెకస్సలు నచ్చలేదు. ఏ మాట పడితే ఆ మాట ముఖం మీదే అనేయడం అన్నీ పద్ధతి ప్రకారం జరగాలనడం ఆమెకు చిరాకు తెప్పించింది. ముఖ్యంగా ఆమె సెల్‌ఫోన్‌ ఉపయోగించడమ్మీద సూర్యం చేసిన ప్రసంగంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.
సూర్యం సంపాదన సంసారం విలాసవంతంగా గడవడానిక్కాదు. అదో మాదిరిగా కూడా నడవడానికి సరిపోదని ఆమె విసుక్కోసాగింది. అతను పని చేసే కంపెనీ మానేజర్‌ తింటున్న లంచాల్లో భాగం అడగమని, యజమానికి మంచి చేసుకుంటే జీతం పెంచుతాడని హితబోధ చేసింది. అవేవీ సూర్యం చెవులు దాటి లోపలికి పోలేదు. సిద్ధాంతాలూ, విలువలూ, పద్ధతులూ ముక్కుసూటి తనం ఈకాలంలో ఎందుకూ పనికిరావని ఆమె చెప్పినా సూర్యం వినడు కదా. ఓ రోజున ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. సూర్య భార్యనీ ఆమె తల్లిదండ్రుల్నీ ఆ వెనుక తరాల్ని దుమ్మెత్తి పోశాడు. బలహీనతలు, లోపాలు, వికారపు చేష్టలు, దుర్మార్గం మనుషుల్లో ఉండటం సహజం. కానీ వాటిని ఎత్తి చూపటం అసహజం. సహించరాని నేరం. సూర్యం భార్య బ్యాగు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఉద్యోగం ఊడి రోడ్డున పడ్డ సూర్య ఇప్పుడు ఒంటరివాడు. చేయడానికి పనేమీ లేకపోవడంతో రికామీగా తిరగసాగాడు. ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు కుళాయి నీళ్ళు తాగుతూ, జీవితం అన్నాక మనిషికి తెలియని మలుపులు ఉంటయి. తెల్సిన వాడొకడు ఓ పార్టీలో పరపతి ఉన్నవాడు సూర్యాన్ని ఆ పార్టీ కార్యకర్తగా చేశాడు. పార్టీ సభల్లో 'హలో హలో మైక్‌ టెస్టింగ్‌'తో మొదలైన అతని రాజకీయ అరంగ్రేటం ఉపన్యాసాలు యిచ్చే స్థాయికి ఎదిగింది. వేడిగా, వాడిగా నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే సూర్య పార్టీ తరుపున అసెంబ్లీలో ఉంటే అధికార పార్టీకి చుక్కలు చూపించగలడని భావించి ప్రతిపక్ష పార్టీ ఎన్నికల అభ్యర్థిగా ఓ సీటు ఇచ్చింది. మలుపు తిరిగే దాకా తెలీదు కదా. ఎక్కడ్నించో దూసుకువచ్చిన చంద్ర అధికార పార్టీ నుంచి ఎన్నికలలో బరిలోకి దిగేడు అదీ సూర్యకు వ్యతిరేకంగా.
అబద్ధపు హామీలు యిచ్చేది లేదని, మంచి వాడనిపించిన వాడిని న్యాయంగా ఎన్నుకోవాలని ఓట్లు కొనడం దారుణమని అవతలి పార్టీ వాళ్ళ డబ్బుకు ఆశపడి ఓటు వేసేవాడు నరకానికి పోతాడని సూర్య సభల్లో చెప్పటం విని జనం నవ్వుకున్నారు. అనేక పథకాలు అమలు చేస్తానని ఇళ్ళూ నీళ్ళూ ఉద్యోగాలు యివ్వడమే కాక ఓటుకింత చొప్పున యిస్తానని ఇచ్చిన చంద్రం అధిక మెజారిటీ ఓట్లతో సూర్యాన్ని ఓడించాడు. ఈ పార్టీ కాకపోతే మరోకటి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మారి మళ్ళీ మళ్ళీ మంత్రి అయ్యే సత్తా వుంది, పైకి ఏ మచ్చా కనిపించని చంద్రకి.
సూర్య మళ్ళీ రోడ్డు మీద పడి ముక్కుసూటిగా నడవసాగాడు. లోపలా బయటా ఒకే ముఖం ఉన్నవాడు సూర్య. అసలు ముఖం ఏదో కనిపించనీయని వాడు చంద్ర.

- చింతపట్ల సుదర్శన్‌, 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.