Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Dec 25,2022

ల‌త్కోర్ సాబ్

కొన్ని దోమలు ప్రవచనకారుల్ని కుట్టాయి. వాటికి వారి లక్షణాలొచ్చాయి. దాంతో అవి ప్రవచనాలు మొదలెట్టాయి. ఒక దోమ తిండిపోతు ప్రవచన కారుడ్ని కుట్టింది.. అది చెరువులోని గుర్రపుడెక్క మీద కూర్చుని ప్రవచనాలు మొదలెట్టింది.
రామాయ రామ భద్రాయ
రామ చంద్రాయ వేదసే
రఘునాధాయ నాథాయ
సీతాయా పతయేనమ:
జన్మలలో దోమ జన్మ ఉత్తమమైనది. ఉత్కృష్టమైనది. పెట్టిపుట్టిన వారికే దోమ జన్మ లభిస్తుంది. కేవలం దోమలకే పుట్టుకతోనే సంగీత జ్ఞానం అబ్బుతుంది. సంగీతము విన్నా సన్మార్గము గలదే మనసా? సంగీత సాధన ద్వారానే సర్వేశ్వరుని చూసే భాగ్యం కలుగుతుంది. మోక్షం సంప్రాప్తిస్తుంది. మన వాగ్గేయ కారులు ఎన్నో కీర్తనలు రాసారు. వాటిని మనం ఆలపించాలి.
శనగపిండికి బియ్యం పిండి కలపండి. దానిలో సరిపడా ఉప్పు, కారం వేయండి. నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి మురుకుల గొట్టంతో కాగిన నూనెలో వేసి వేయించండి. మురుకులు తయారైపోతాయి.
శనగపిండికి బియ్యం పిండి సరిపడా కలుపుకోవాలి. దాన్ని వామూ, వెన్నా వేసి తగినన్ని నీళ్లు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. దాన్ని జంతికల గొట్టం ద్వారా కాగిన నూనెలో వేయిస్తే జంతికలవుతాయి.
శనగపిండికి సరిపడా నీళ్లు పోసి ముద్దగా చేసుకోవాలి. దాన్ని చిల్లుల గిన్నె ద్వారా నూనెలో వేసి గోలిస్తే బూంది అవుతుంది. దానికి నూనెలో వేయించిన పల్లీలు, కరివేపాకూ కలిపి తగినంత ఉప్పు కారం వేస్తే బూంది తయారవుతుంది.
శనగపిండితో చేసిన బూందీని చెక్కర పాకంలో కలిపి జీడిపప్పు, యాలకులూ, కిస్‌మిసూ వేసి ఉండలుగా చేస్తే బూందీ లడ్డు అవుతుంది.
పచ్చి మిరపకాయల్ని తీసుకుని గింజలు తీయాలి. వాటిలో కాస్త చింతపండు గుజ్జూ, వాము పెట్టాలి. వాటిని శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేసి వేయిస్తే మిరపకాయల బజ్జీలు రెడీ.
ఆలుగడ్డలను చక్రల్లా తరగాలి. వాటిని శనగపిండిలో ముంచి తీసి కాగిన నూనెలో వేసి గోలిస్తే ఆలూ బజ్జీలు రెడీ.
శనగపిండికి మైదా పిండి వేసి కలపాలి. దానిలో నెయ్యీ, అల్లం వెల్లుల్లీ పేస్టు వెయ్యాలి. సరిపడా కారమూ, ఉప్పు కలుపుకోవాలి. నీళ్లు పోస్తూ పూరి పిండిలా కలపాలి. దాన్ని చపాతీలా వత్తాలి. ఒక గ్లాసుతో దాన్ని గుండ్రం ముక్కలుగా కట్‌ చేసుకుని వాటిని నూనెలో వేయిస్తే చెక్కలు తయారైపోతాయి.
శనగపిండికి బియ్యం పిండి కలపాలి. పచ్చిమిర్చీ, అల్లమూ, ఉల్లిపాయలు, జీలకర్రా తగినతం ఉప్పు వెయ్యాలి. నీళ్లు పోసి అట్ల పిండిలా కలుపుకోవాలి. దాన్ని పెనం మీద వేసి కాలిస్తే అట్లు సిద్ధమవుతాయి.
శనగపిండిని తీసుకుని ఉండలు లేకుండా జల్లిచి పెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె తీసుకుని వేడి చేయాలి. మరో మూకుడులో చక్కెర పాకం పట్టాలి. ఆ పాకంలో శనగపిండి వేసి గరిటెతో తిప్పాలి. మధ్య మధ్యలో వేడి నూనె పోయాలి. గట్టిపడే స్థితికి వచ్చినప్పుడు దాన్ని ఒక ప్లేటులో వేసి చల్లబరిచి కత్తితో ముక్కలుగా కట్‌ చేస్తే మైసూర్‌ పాక్‌ రెడీ.
శనగపిండిని జల్లించాలి. జీడిపప్పు, నెయ్యీ వేసి వేయిం చాలి. ఒక బాండిలో పంచదార పాకం పట్టాలి. దానిలో ఇలాయిచీ పొడి వెయ్యాలి. వేయించిన శనగ పిండిని పంచదార పాకంలో వేసి గరిటెతో తిప్పితే హల్వా తయారవుతుంది.
శనగపిండిలో పెరుగు కలిపి ఐదారు గంటలు నానబెట్టాలి. అదులో పచ్చి మిర్చి ముక్కలూ, అల్లం తరుగూ, చెంచాడు పంచదారా, తగినంత ఉప్పు, బేకింగ్‌ సోడా కలిసి బాగా కలియ బెట్టాలి. ఒక మూకుడులో నీళ్లు పోసి స్టౌవ్‌ మీద పెట్టాలి. ఒక పళ్లెంలో పెరుగుతో కలిసిన శనగపిండిని వేసి నీళ్లు పోసిన మూకుడులో ఆ పళ్లెం ఉంచాలి. ఐదారు నిమిషాలైయ్యాక తాలింపి వేస్తే డోక్లా సిద్ధమవుతుంది.
ఇలా శనగపిండితో రకరకాల పిండి వంటలు చేయవచ్చు. పిండి వంటలెన్నయినా మూలము శనగపిండి మాత్రమే.
మనం కృష్ణున్ని ఆరాధిస్తాం. రాముణ్ని పూజిస్తాం. సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాం. శివునికి అభిషేకం చేస్తాం. స్వామియే శరణం అయ్యప్ప శరణం అంటాం. నరసింహ స్వామిని కొలుస్తాం. వేంకటేశ్వరునికి ముడుపులు చెల్లిస్తాం. బుద్ధం శరణం గచ్ఛామి అంటాం. 'ఏకంసత్‌ విప్రా బహుదా వదంతి'
శనగపిండి వంటకాల్లాగే దేవుణ్ని రకరకాల పేర్లతో పిలుస్తాం. అలా పిలిచినప్పటికీ శనగపిండిలాగ దేవుడొక్కడే.
ఈ సత్యాన్ని గ్రహించిన వాడే జ్ఞాని.
మన పాలిట మహామంత్రి లత్కోర్‌ దోమనే సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగ దైవం.
ఆయనకు సుప్రభాతం అంటే గుడ్‌ మార్నింగ్‌
వేంకటేశ్వరునికి గుడ్‌ మార్నింగ్‌ చెప్పటానికి 330 మిలియన్ల దేవతలొచ్చారు. ఎలా వచ్చారంటే మొదట పుష్కరిణిలో వారు స్నానం చేసారు. తడి బట్టలతోనే స్వామి దర్శనం కోసం క్యూలో నిలుచున్నారు. వారిలో ఇంద్రుడూ, చంద్రుడూ, వరుణుడూ, అగ్ని వంటి దేవతలున్నారు. అగ్ని గట్టిగా మంత్రాలు చదువుతుంటే మిగతావాళ్లూ చదువుతున్నారు. మెల్లగా చదవమని ద్వార పాలకులైన జయవిజయులు వారిని హెచ్చరించారు. దేవతల రాజుననే అహంకారంతో అందర్నీ తోసుకుని ఇంద్రుడు ముందుకెళితే ఇవాళ నీకు అపాయింట్‌మెంట్‌ లేదు. రేపు రా అని వారన్నారు. 'వరవేత్ర హతోత్త మాంగా:' అంటే మాట వినని వారిని వెండి బెత్తంతో ఒకటేసారు.
మహామంత్రి దోమను చూడ్డానికి రోజూ ఎన్నో దోమలు వస్తుంటాయి. అపాయింట్‌మెంట్‌ ఉన్న వాటితోనే ఆయన మాట్లాడుతాడు. తక్కిన వాటిని జయవిజయుల్లాంటి గార్డు దోమలు వెళ్లిపొమ్మంటాయి. మాట వినకపోతే ఒక్కటేస్తాయి.
ఈ రోజుల్లో నాస్తిక వాదం ప్రబలిపోతున్నది. కొన్ని దోమలు ఆ వాదాన్ని బలపరుస్తున్నాయి. కలియుగ దైవం లాంటి మన మహా మంత్రిని ఆడిపోసుకుంటున్నాయి. ఆయనపై అభాండాలు వేస్తున్నాయి.
ధర్మోరక్షతి రక్షిత: ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది.
స్వస్తి
కొన్ని పిల్ల దోమలు కరోనా కాలంలో చదువుకున్న పిల్లల్ని కుట్టాయి. వాటికి ఆ పిల్లల లక్షణాలొచ్చాయి.
''కరోనా అంటే ఏమిటి?'' అనే ప్రశ్నకు ఓ పిల్ల దోమ ఇలా జవాబు చెప్పింది.
''కరోనా హౌలీ తరువాత వచ్చే పండుగ. దీన్ని ప్రపంచంలో అందరూ జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో మార్కెట్‌ మూసేస్తారు. రవాణాను పూర్తిగా ఆపేస్తారు. అందరూ ఇళ్లలోనే ఉంటారు. రకరకాల వంటలు చేసుకుని తింటారు. మగవాళ్లు వండితే ఆడవాళ్లు మజా చేస్తారు. చుట్టాలను, బంధువులను ఆఖరికి స్నేహితులను ఇంటికి రానివ్వరు. స్కూళ్లకు బోలెడు సెలవులిస్తారు. పరీక్షలు లేకుండా అందర్నీ పాస్‌ చేస్తారు. కరోనా పండుగను అన్ని మతాల వారు జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ పండుగ. పోయినట్లే పోయి మళ్లీ మళ్లీ వచ్చే పండుగ. ఈ పండుగ సమయంలో మాస్క్‌లు పెట్టుకుంటారు. గుళ్లకు కూడా సెలవులిస్తారు. ఎన్నో రోజులు జరుపుకునే పండుగ ఇదొక్కటే. మాటిమాటికి చేతులు కడుక్కోవడం, మనిషి మనిషికి దూరముండటం ఈ పండుగ ఆచారం. 'ఐదో ఎక్కం చెప్పు' అని ఇంకో పిల్ల దోమతోని అంటే, అది ఇలా చెప్పింది -
ఐదొకట్ల ఆరు
ఐదు రెళ్ల ఎనిమిది
ఐదు మూళ్ల తొమ్మిది
ఐదు నాళ్ల పదకొండు
ఐదు ఐదుల పన్నెండు
ఐదు ఆర్ల పదిహేను
ఐదు ఏడ్ల పదిహేడు
ఐదు ఎన్మిదిల ఇర్వై
ఐదు తొమ్మిదిల తొంభై
ఐదు పదుల రెండు వందలు
తరువాయి వచ్చేవారం...

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.