Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 01,2023

రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి

'కాలిబాటలు' పేరిట విడుదల చేసిన ఈ పుస్తకం చాలా విలువైనది, వెల కట్టలేనిది. డా|| బి.వి.ఎన్‌. స్వామి తెలంగాణలో గొప్ప కథకులు, కథా సమీక్షకులు, విమర్శకులు, పరిశోధకులు. 'ఉత్తర తెలంగాణ కథా సాహిత్య పరిశీలన' అనే అంశంపై పి.హెచ్‌.డి. తీసుకున్నారు. డాక్టరేట్‌తో ఆగిపోకుండా కథలు రాయడం, సమీక్షించడం, విమర్శను పరామర్శగా మల్చుకోవడం, కశప (కథా శతక పద్యం) అనే 117 కథలతో సంకలనం తెచ్చారు. 224 మంది కథకుల్ని 'అందుబాటు'లో తెచ్చిన కథా రచన, కథా విమర్శ, కథా పరిశోధన, కథా ప్రయోగం, కథా సంపాదకత్వం నెరపుతున్న కథా ఋషి స్వామి... కథా సాహిత్యంతో జీవితాన్ని పెనవేసుకున్నారు.
ఈ పుస్తకంలో తెలంగాణ వికాసం విస్తృతి నుంచి అనువాద కథల దాకా 14 అంశాలతో పరిశోధనాంశాలు లోతుగా చర్చించారు. రైతు కథ, కార్మిక కథ, కార్మిక కథ, ఆదివాసి కథ, స్త్రీవాద కథ, దళిత కథ, బహుజన కథ, ముస్లింవాద కథ, ప్రాంతీయవాద కథ, ప్రపంచీకరణ కథ, మానవతావాద కథ, బాలల కథ అనే పలు విభాగాలుగా ఎంచుకుని రాసారు. కాలాన్ని నమోదు చేసే కథా సాహిత్యాంసాల సమాహారంగా ఈ రచన సాగింది.
బాలల కథల వర్గీకరణ (5 ఏండ్ల పిల్లలు - ఐదు నుంచి పది ఏండ్లు, పది నుంచి 16 ఏండ్లు వయసు దాకా) బాలల కథా రకాలు, జానపద, సాహస, వీర గాధలు, శాస్త్రీయ కథలు, పురాణ, పంచతంత్ర, సాంఘిక, బేతాళ కథలు, పర్యావరణ కథలు ఇలా 15 రకాల కథలు, వాటి పరమార్థం, కథా వస్తు ఎంపిక, సృజనాత్మకత, వర్ణన, వాస్తవాలు లేని స్థితిగతుల సవిశ్లేషణగా చర్చించారు. కథలు, బాల కథా రచయితల గురించి కూడా క్లుప్తంగా రాస్తే సమగ్రత సంతరించుకునేది. ఇది విమర్శ కాదు, సూచన మాత్రమే. (మలి ముద్రణలో ఆలోచన చేయగలరు) కొండను అద్దంలో చూసినట్లుగా 125 ఏండ్ల కథా సాహిత్య చరిత్ర 133 పేజీల్లో చెప్పి ఒప్పించారు స్వామి. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నలిమెల భాస్కర్‌, ముక్తవరం పార్థసారథి, జి.లక్ష్మి, విశ్వనాథల కథల విశ్లేషణ బాగుంది. వస్తు శిల్పాల సమన్వయమే కథ.
కథ శీర్షిక ప్రారంభాల తరువాత, లోతుల్లోకి వెళ్ళే కథలో స్థలం, కాలం, పాత్రలు, వర్ణనలు, దృష్టి కోణం, భాష, క్లుప్తత, అనుభూతి ఐక్యత, ఉన్నది ఉన్నట్లుగా (ఉత్తమ పురుషలో) చెప్పడం, సమస్యలకు చక్కటి పరిష్కార ముగింపు అందించి పాఠకుల్ని కదిలించే గొప్ప సాహిత్య ప్రక్రియ కథ.
భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో ఏదో ఒక కాలంలోగాని, ఏకకాలంలో అన్నింటిలోకాని కథ రాయొచ్చు. అంటారు (పేజీ. 121)
ఈ పుస్తకం చివర ఉపయుక్త కథా సంకలనాలు, పుస్తకాల పట్టిక ఇవ్వడం కథకులకో దారిదీపం లాంటిది. మానవత, మత సామరస్యం, సామాజిక అంతరాలు, కొందరు మనుషుల్లో డొల్లతనం, మానవ సంబంధాలు, ప్రేమలు, విశ్వాసాలు, మత ఘర్షణ, పర్యావరణం, ప్రపంచీకరణ విధ్వంసం, పల్లె సంస్కృతి, పట్నం గాగరికతల ప్రభావాలు, స్త్రీల సమస్యలు, అణగారిన పేదలపై పెత్తందార్ల దౌష్ట్యం, పోరాట గాధలు, పలు ఉద్యమాలు... కథా వస్తువులై బలమైన సాహిత్య సృజనకు తెలంగాణ కథ ఎలా కేంద్ర బిందువుగా ఉండో ఈ చిన్న పుస్తకంలో పెద్ద సందేశంగా అక్షరీకరించిన స్వామి కృషి బహు ప్రశంసనీయం.
1892 భండారి అచ్చమాంబ 'గుణవతియగు స్త్రీ' నుంచి కథ మొదలు పెట్టి మాడపాటి హన్మంతరావు, భాగ్యరెడ్డి వర్మ, నెల్లూరి కేశవస్వామి, ఇల్లెందుల సరస్వతి, బిఎన్‌ శాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు, పి.వి.నర్సింహారావు, బిఎన్‌రెడ్డి, సురవరం, ఎల్లా ప్రగడ సీతాకుమారి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి, కాంచనపల్లి చినవెంకట రామారావు, హీరాలాల్‌, జాతశ్రీ పొట్టపల్లి రామారావు, ఇలివెంటి కృష్ణమూర్తి, దాశరథి, ప్వేరాం జగన్నాథం, వట్టికోట, తాడిగిరి పోతరాజు లాంటి ఆనాటి కథకుల నుంచి నేటి తరం యువ రచయితల కథల దాకా... కథల విశ్లేషణ ఓ చిన్న పాఠ్య గ్రంథంలా రాసారు స్వామి. వీరి కృషి అభినందనీయం. కాబోయే కథా రచయితలకు చక్కటి కరదీపిక.
- తంగిరాల చక్రవర్తి , 9393804472

'కాలిబాటలు'
రచన : డా|| బి.వి.ఎన్‌.స్వామి
పేజలు : 133, వెల : రూ. 150/-,
ప్రతులకు : తెలంగాణ పబ్లికేషన్స్‌
మొదటి అంతస్తు, ఇ.నెం. 1-1-80/15,
ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, ముషీరాబాద్‌, హైదారాబాద్‌ - 020
సెల్‌ : 8639972160

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.