Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 15,2023

ల‌త్కోర్ సాబ్‌

బాకారావుకు ఓ ఇంగ్లీష్‌ మీడియం స్కూలుంది. బస్సు ఎక్కకుండానే సీట్లో దస్తీ వేసినట్లు పిల్లలు పుట్టకుండానే ఆ స్కూల్లో సీటు కోసం దరకాస్తు చేసుకుంటారు. లక్ష రూపాయలు డొనేషన్‌ కింద కడితేనే ఆ స్కూల్లో సీటు దొరుకుతుంది. ఈ విషయంలో రికమండేషన్లు నడవవు.
ఎన్నికల తేదీరాగానే ఎందుకైనా మంచిదని బాకారావు ఆగమేఘాల మీద లత్కోర్‌ విగ్రహాన్ని తయారు చేయించాడు. దాన్ని స్కూలు ఆవరణలో పెట్టించాడు. అంతకు ముందు పొద్దెక్కేక నిద్రలేచేవాడు. ఆరాం కుర్చీలో కూర్చుని అల్లంఛారు తాగుతూ పేపర్‌ తిరగేసేవాడు. ఈ మధ్యన అతను పొద్దున్నే లేస్తున్నాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాక తలస్నానం... ఆ తరువాత పట్టుపంచె కట్టుకునీ, నుదుట బొట్టు పెట్టుకుని, పూల సబ్జె పట్టుకుని కారున్నా కాలి నడకనే స్కూలుకెళుతున్నాడు. లత్కోర్‌ విగ్రహం ముందు కూర్చుని -
నా దైవము నీవే
నా దాతవు నీవే
నా నేతవు నీవే
నా విధాతవు నీవే
నా స్వామివి నీవే, సర్వము నీవే
అంటూ పూలతో పూజ చేస్తున్నాడు. పూజయ్యాక పాలతో లత్కోర్‌ విగ్రహాన్ని అభిషేకిస్తున్నాడు. చిరతల వాయిస్తూ
మదిని నిన్ను నమ్మి కొల్తురా
మా తండ్రీ దయగొను లత్కోరూ
అంటూ భజన చేస్తున్నాడు. ఈ తతంగమంతా పేపర్లో వచ్చే ఏర్పాట్లు చేసుకున్నాడు.
'ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ఎన్ని ఎత్తులో'
ఒకసారొచ్చి తనను కలవవలసిందిగా బాకారావుకు మహామంత్రి కబురంపాడు. అంతమాత్రానికే తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు వచ్చినంతగా అతను సంబరపడ్డాడు. తన పూజలూ, భజనలూ పనికిరాకుండా పోలేదనుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లత్కోర్‌ దగ్గరికెళ్లి పాదాభివందనం చేసాడు.
'నన్నెందుకో రమ్మన్నారట'
'మరేం లేదయ్యా! ఈ సారి నేను రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందంటావు?'
'చాలా బాగుంటుంది'
'నాకనుకూలంగా ఎవరు తన సీటు వొదులుకొంటారు?'
'మీరు అడగటమే ఆలస్యం మన ఎమ్మెల్యేలలో ఎవరు పడితే వారు మీకనుకూలంగా తమ సీటు వదులుకుంటారు'
'ఆ వదులుకునేదేదో నువ్వు వదులుకోరాదూ' అని మహామంత్రి అనగానే-
అతను గ్రహణం పట్టిన చంద్రుడయ్యాడు
శాపగ్రస్త ఇంద్రుడయ్యాడు
'సీటుకోసమొస్తే వేటు పడిందే' అని మనసులో అనుకుని, పైకి మాత్రం నవ్వుతూ - 'మీరంతలా అడగాలా. మీ చొక్కాలాంటి వాణ్ణి. ఆ చొక్కాను మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. విడిచేయొచ్చు. మీ ఇష్టం. ఎప్పుడైనా మీ మాట కాదన్నానా?' అని బాకారావు అన్నాడు
'ఉత్తపుణ్యానికే వదులుకోనక్కర్లేదు. నీకు ఎమ్మెల్సీ సీటిస్తాను.' అని లత్కోర్‌ హామీ ఇవ్వగానే-
అతను గ్రహణం వీడిన చంద్రుడయ్యాడు.
శాపవిముక్త ఇంద్రుడయ్యాడు.
'ఆ చేత్తోనే...' అంటూ బాకారావు అర్ధాంతరంగా ఆగాడు. అతని ఆంతర్యం గ్రహించినా, ఏం తెలియనట్లు
'ఆ చేత్తోనే' అని లత్కోర్‌ అడిగాడు.
'మంత్రిని చేస్తే'
'చూద్దాంలే. నీ నియోజకవర్గంలో వెంటనే నా తరుపున ప్రచారం మొదలుపెట్టు. కావలసిన ప్రచార సామాగ్రిని మన పార్టీ ఆఫీసు నుంచి తీసుకెళ్లు' అని మహామంత్రి చెప్పాడు.
'అలాగే, తీసుకెళతాను. మీరు చెప్పినట్లు ప్రచారం మొదలెడతాను.'
'ఈయన హామీ ఇచ్చినట్లుగా నన్ను ఎమ్మెల్సీ చేస్తాడా? చెయ్యిస్తాడా? ఒకవేళ చెయ్యిస్తే ఏం చెయ్యాలి? ఇదే పార్టీలో ఉండి అవకాశం కోసం ఎదరు చూడాలా? మరో పార్టీలోకి దుంకాలా?'
'మాట తాటిబెల్లం. చేత గోడకు కొట్టిన సున్నం' అని చాలా మంది ఈయనగారి గురించి చెబుతుంటారు. అదే నిజమైతే నా దారి నేను చూసుకోక తప్పదు' అని మనసులో అనుకుంటూ లత్కోర్‌ దగ్గర నుంచి బాకారావు వెళ్లాడు.
దిక్కుమాలిన రాష్ట్రంలో ఐదారు ప్రతిపక్షాలున్నాయి. వాటిలో పల్లేరు గాయల పార్టీ కూడా ఉంది. ఎటన్న ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. ఎటన్న అతని అసలు పేరు కాదు. జెనం పెట్టిన పేరు. అతడు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు. రేపు మరో పార్టీలో కనిపిస్తాడు. ఆ కారణంగా జెనం అతనికా పేరు పెట్టారు. ఎవరైనా ఎటన్నా? అని పిలిచినా అతను కోపం తెచ్చుకోడు. పైగా నవ్వుతూ ఓ నమస్కారం పడేస్తాడు.
గాలివాటు మనిషైన ఎటన్నకు ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకూడదని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించింది. చూచాయగా అతనికా విషయం తెలిసింది. హైకమాండ్‌ను బెదిరించే ఉద్దేశంతో బొచ్చెపార్టీలోకి మారుతున్నట్లు అతను ఫీలరొదిలాడు. ఎవరైనా అడిగితే 'అబ్బే అదేం లేదు' అని అనేవాడు. అతను ఎన్ని వేషాలేసినా హైకమాండ్‌ నిర్ణయం మారలేదు. దాంతో బొచ్చెపార్టీ కండువా కప్పుకున్నాడు. పార్టీ ఎందుకు మారావని ఎవరన్నా అడిగితే నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ అతను చెబుతున్నాడు.
బొచ్చె పార్టీకి ఎటన్న గురించి బాగా తెలుసు. ఆ పార్టీ నాయకులు అతని మాటలు నమ్మినంత పని చేసారు. కానీ నమ్మలేదు. నాయకులందరూ నటన సూత్రధారులే'. బొచ్చె పార్టీ కూడా అతనికి మొండిచెయ్యిచ్చింది. పార్టీ మారి గంట కాకముందే ఎటన్న ఉమ్మెత్త పువ్వుల పార్టీలోకి మారాడు. కానీ అక్కడా బొక్కలే తప్ప ముక్కలు దొరకలేదు.
కిరాయి ఇల్లు కిరాయి ఇల్లే. సొంత ఇల్లు సొంత ఇల్లే అంటూ అతను పల్లేరుగాయల పార్టీలోకి వచ్చేసాడు. ఎవరన్నా ఇదేంటయ్యా? అని అడిగితే, 'నా సొంతింటికి తిరిగొచ్చాను. అందులో తప్పేముంది' అంటున్నాడు. భూమి చతురస్రంగా ఉందని చెప్పే స్వామీజీలున్న ఈ కాలంలో లేదు లేదు భూమి గుండ్రంగా ఉందని నిరూపించే ఎటన్నలు కూడా ఉన్నారు. ఎటన్నకు 'పార్టీలు మారినా ఫలితం దక్కలే. కండువాలు మార్చినా కోరికలు తీరలే'.
ఆ నియోజకవర్గంలో అతని కులస్తులెక్కువ మంది ఉన్నారు. అతని కులాభిమానం బోలెడు. తమ కులం లేనిదే ఇతర కులాలకు దిక్కులేదని అంటాడు. కులపెద్దగా వ్యవహరిస్తుంటాడు. కుల పంచాయితీలు తీరుస్తుంటాడు. కులంలో ఎవరింట పూలుపండ్లు అయినా తప్పకుండా అతణ్ని పిలుస్తారు. కుడుకలూ, వక్కలూ, తమలపాకులతో పెండ్లి పత్రిక అతనికే ముందుగా ఇస్తారు. పంక్తి భోజనాల్లో అతనికే ముందు వడ్డిస్తారు. అతను నోట ముద్ద పెట్టాకే అందరూ తినడం మొదలెడతారు. అతను తిన్న తరువాతే అందరూ చెయ్యి కడుక్కుంటారు.
అతనే కప్పయ్య. అతను బొచ్చెపార్టీ నాయకుడు. ఒకసారి వాళ్ళ ఊళ్లో వానలు పడలేదు. దాంతో ఆ ఊరి జెనం కప్పలకు పెండ్లి చేసారు. కప్పలకు పెండ్లి చేస్తే వానలు పడతాయనే విశ్వాసం అతనికుంది. అటు కప్పలకు పెండ్లవుతుంటే ఇటు కప్పయ్య పుట్టాడు. దాంతో తల్లిదండ్రులు అతనికాపేరు పెట్టారు.
పైరవీల కారణంగా నియోజకవర్గంలో అతనికి పేరుంది. ఈసారి తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తారనే నమ్మకం అతనికుంది. అది సిమెంట్‌ కన్నా, ఉక్కుకన్నా, రాతి గట్టుకన్నా గట్టిదైన కారణంగా అతను ప్రచారంలోకి దిగిపోయాడు.
రోజు కూలీ కింద ఐదు వందల రూపాయలూ, బిర్యానీ పొట్లామూ, క్వార్టర్‌ మందూ ఇచ్చే కండిషన్‌ మీద అతని తరుపున ప్రచారం చెయ్యడానికి కూలి జెనం ఒప్పుకున్నారు. వారందరికీ కప్పయ్య పార్టీ కండువాలు కప్పాడు. కప్పయ్యకే మీ ఓటు, బొచ్చె గుర్తుకే మీ ఓటూ అంటూ వాళ్లు వీధుల్లో తిరగారు. 'రాజకీయమొక వ్యాపారం, మొదట పెట్టుబడి పెడతారు. తరువాత కష్టపడకుండానే అంతకు పదింతలు రాబడతారు'
'మీకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చారా?' అని అడిగితే
'తప్పకుండా ఇస్తారు' అని కప్పయ్య అన్నాడు.
'టిక్కెట్టు రాకుండానే ప్రచారమెందుకు మొదలెట్టారు?' అని కప్పయ్య ఎదురు ప్రశ్నవేసాడు.

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491
తరువాయి వచ్చేవారం...

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.