Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బహిరంగ ప్రకటన | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

బహిరంగ ప్రకటన

''ఇప్పుడేది రహస్యం కాదంటూ'' అంతరంగంలో అంతుచిక్కని ప్రశ్నలను వెలిబుచ్చలేని రహస్యాల వంటి ఆవేదనలను బహిర్గతం చేసిన ఇబ్రహీం ఇప్పుడు బహిరంగ ప్రకటనతో మన ముందుకొచ్చాడు. తొలి కవిత లోనే తన పదునెక్కిన కలాన్ని ఝుళిపించాడు.
''రాయి విసరడం అంటే ప్రశ్నించటం / తుపాకీ ఎక్కు పెట్టడం సమాధానం కాదు... / కాటు వేస్తుందని తెలిసినా / పడగ నీడనే నిలబడ్డాను కదాని / నమ్మకం మీదకు నీ ద్రోహపు విషం చల్లకు'' అంటూ సమకాలీన సమాజ స్థితులను తెలియజేసే అంశాన్ని ''హమీద్‌'' చిత్రం సాయంతో... మనల్ని ఆలోచింప జేయిస్తూ రాసిన కవిత. రాబోయే రోజుల్లో చాలామంది నోట పై రెండు లైన్లు మాట వింటామనడంలో ఎటువంటి సందేహం లేదు.
''పులి విడిసిన చొక్కా'' తో తన అభ్యుదయ భావజాలాన్ని చెప్పకనే చెప్పాడు. తన కవితలు చదువుతుంటే ఆలోచనల సుడిగుండాలలో తిరుగుతూ పూర్వపు దినాల నుంచి... వర్తమాన రోజుల దిగులుతో... భవిష్యత్తులోకి భయ పడుతూ తొంగిచూసేలా చేస్తుంది.
ఇబ్రహీం.. అక్షరాల సెగతో కవిత్వపు మంటలు మండించాడు. నేటి కవులలో ఇంతటి ధైర్యాన్ని చూసింది అరుదేనని అనవచ్చు. ఎన్నో ఏళ్లుగా లోపల దాచు కున్న బడబాగ్ని ఒక్కసారిగా విస్ఫోటనమై బహిరంగ ప్రకటనతో పేలింది. అందరి దృష్టి తన వైపు తిప్పుకునేలా చేయడమే కాదు అతని ధైర్యాన్ని మెచ్చుకునేలా చేసింది.
''ముని వేళ్ళను తెగ్గోసినా... / నా అక్షర తూటాలు / ఆకాశాన్ని నేలపై కూల్చగలవు..'' అన్న మాటలు తన రచనపై తనకున్న అచంచల ఆత్మ విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
''మీరు మీరు చొక్కాలు మార్చుకొని / శత్రువుకి శత్రువు మిత్రుడై.. / దశావతారాల్లో ఏ యుగానికి హాని చేయని నన్ను .. / ఏకంగా దేశానికే ద్రోహినని పన్నుతున్న కుట్ర .. కాదా / నేను ఏ యుగంలో ని మతానికి శత్రువునైయ్యానో / కొంచెం విడమరచి చెప్పవూ'' అంటూ.. ''నేను నీకు శత్రువు నెట్లయితా?'' కవితలో రాసిన రాతలు ప్రతిపాటకుడిని ఆలోచింపజేస్తుంది.
చాప కింద నీరులా పాలకుల పన్నాగాలు.. ప్రవహింపజేసే.. ప్రయత్నం జరుగుతున్న వేళ... దశాబ్దాలుగా వివక్షకు గురవుతూ.. అడుగడుగు అనుమానపు చూపులు.. అవమానపు చేష్టలు.. భరిస్తూ అవని పోరల్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకెగసిన అగ్ని జలలా పారిన.. జ్వాలా ప్రవాహం .. నిర్గుణ్‌ కవిత్వం
'నాకెందుకు చెప్పలేదు నాన్న.. నేను పుట్టక ముందే ఈ మట్టికి శత్రువ య్యానని...' అనే కవితలో తన గోసను వెలిబుచ్చాడు..
''బొట్టుకు టోపీకి మధ్య నువ్వు విల విలలాడిపోతావని.. / ఎక్కడ చూసినా, ఏ పత్రిక చదివినా / నన్ను శత్రువుగా చూపిస్తున్నాడు.., / నా చిన్ననాటి దోస్తు లకు సుపారీ ఇచ్చి / నా మీద ఎగదో స్తున్నాడు.. / నా జాడ మీద చూపుల నిఘాను మోహరిస్తున్నాడు... / నా బిడ్డల పరువును బజారులో వేలం వేస్తున్నాడు..'' అంటూ ఇబ్రహీం చెప్తున్నది తన గోస మాత్రమే కాదు.. ఇది తన జాతి గోస...ఆధిపత్య మతోన్మాదుల ఆగడాలు.. పెచ్చు మీరు తున్న తీరును ప్రశ్నిస్తాడు కవి.
పీడన ప్రతిఘటన కోరుతుంది.. తిరుగుబాటుకై కొత్తదారులు వెతుకు తుంది.. కవి విశ్వంలో ఏ మూలన దుర్నీతి జరిగినా తన కలంతో పంచనామా చేస్తాడు.. అసాంఘిక చర్యలను అమాయ కులపై రుద్దినప్పుడు.. అనుమానపు వేధిం పులు అల్పులను కాకుల్లా పొడుస్తున్న ప్పుడు... నేనున్నానంటూ ఇబ్రహీం కలం.. గళమెత్తి కయిత రూపంలో అభాండాల తెరను...ఖండ ఖండాలుగా చేస్తుంది.
మార్పు అనేది సహజమైన ప్రక్రి యని.. కాలానుగుణంగా మనిషి ఆలోచ నలో.. ఆచరణలో.. అహర్యంలో మార్పు అనివార్యమని...
''పేగుల్లో లేకున్నా / పైకి కనిపిం చాలనే / చిగురుల దర్పాల వాసనలోంచి బయటపడేసుకోవాలని... / అశాస్త్రీయం లోంచి... శాస్త్రీయ దృక్పథంలోకి.... / వేరుతనాల పాతదనంలోంచి../ కొత్త దనంలోకి మారాలని'' 'పెట్టుడు మచ్చ' కవితలో కవి కోరుకుంటాడు.
అమ్మపై.. అవనిపై రాయని కవి ఉండడు. అందునా అమ్మను దూరం చేసు కున్న ఇబ్రహీం తన బాధను.. ప్రేమను ..పదాల రూపంలో పేజీల కొద్దీ గుమ్మరిం చాడు. ''మా అమ్మ'' ... ''చెప్పే వెళ్లాల్సిందమ్మా'' కవితలు చదివితే అది మనకర్థమవుతుంది.
కఠినమైన నిజాలు కళ్ళ ముందు కనబడుతున్నా... భయమనే గంతలు కట్టుకున్న మనకు బహిరంగ ప్రకటన ద్వారా వాస్తవ స్థితిని నివేదించాడు.
ఈ పుస్తకం ఒకసారి చదివితే అర్థమ వుతుంది.. వ్యవస్థ విస్మరిస్తున్న లౌకిక వాదం గురించి.. మతాల పేరిట మనుషుల్ని చీలుస్తున్న వైనం గురించి.. అవమానాల పాలవుతున్న అణగారిన వర్గాల గురించి.. ఈ కవి ఏ భాషకు... ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఎక్కడ ఏ భాష అవసరమనుకుంటే అక్కడ ఆ భాషను మాడలికాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకున్నాడు.
ఏదేమైనా ఇటువంటి రచన చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ధిక్కార స్వరంతో.. దీటైన పదజాలంతో తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎటువంటి తెరలు లేకుండా బహిరంగం గా ప్రకటించిన కవి ఇబ్రహీం నిర్గుణ్‌.. కాదు కాదు ఇబ్రహీం నిర్భరు...

- నయీమ్‌ పాష
  99089 16783

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....

తాజా వార్తలు

07:15 AM

నేడు కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ..

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.