Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'

            2018లో ''దానా పానీ'' అనే పంజాబీ సినిమా తన్వీర్‌ సింఘ్‌ జగ్పాల్‌ దర్శకత్వంలో వచ్చింది. కమర్షియల్‌ సినిమా పంధాలోనే నిర్మించిన ఈ చిత్రం మన దేశంలో స్త్రీ జీవిత పరిస్థితులకు అద్దంలా నిలుస్తుంది. మన సమాజంలో స్త్రీ తన జీవితంలో ఏ నిర్ణయాన్ని స్వంతంగా తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండదు. ఆమె కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం ఆమె ఎలా జీవించాలో నిర్ణయిస్తారు. ''నీకేం కావాలి'' అని స్త్రీని ప్రశ్నించే వ్యవస్థ ఆమె చుట్టూ ఎప్పుడూ లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఆమెపై ప్రేమతో చేస్తున్నట్లుగానే అందరూ భావిస్తారు. ఆమె భవిష్యత్తు, జీవితం, భద్రత దృష్టిలో పెట్టుకునే ఆమె కోసం తాము నిర్ణయాలు తీసుకుంటున్నాం అని, ఆమెను రక్షించే వ్యవ్యస్థ పట్ల ఆమె గౌరవం చూపాలని కూడా ఆమెను నిర్దేశిస్తారు. కాని స్త్రీ మనసు ఏం కోరుకుంటుందో ఆ వ్యవ్యస్థకు ఎప్పుడూ అవసరం లేదు.
             పంజాబ్‌లోని ఓ పల్లెటూరిలో ఓ ఉమ్మడి కుటుంబంలో ఆనందంగా జీవిస్తుంది బసంత్‌ అనే ఓ అమ్మాయి. ఏడు సంవత్సరాలు కూడా నిండని ఆమె జీవితం అంతా కూడా తల్లిదండ్రీ చుట్టూనే అల్లుకుని ఉంటుంది. తండ్రికి కూతురంటే చాలా ఇష్టం. ఓ రోజు ఇంట్లోనే పాము కరిచి చనిపోతాడు. భర్త చనిపోవడంతో ఆ ఇంట్లో బసంత్‌ తల్లి స్థానం మారి పోతుంది. ఆ ఇంటిలోని ఇతర సభ్యులు ఆమెను పనిమనిషి కన్నా నీచంగా చూస్తూ ఉంటారు. ఇంటెడు చాకిరితో కూతురితో గడిపే సమయం కూడా లేకుండా ఆమె ఎన్నో అవమానాల మధ్య అత్తగారింట్లో జీవిస్తూ ఉంటుంది. ఈమె తండ్రి కాస్త ఉన్నత కుటుంబాన్నికి చెందిన వ్యక్తి. కూతురు బాగోగులు చూసుకోవడాని ఆయన అప్పుడప్పుడు బిడ్డ అత్తగారింటికి వస్తూ ఉంటాడు. ఒకసారి అలా వచ్చినప్పుడు ఆ కుటుంబం కూతురుని ఎంత హీనంగా చూస్తుందో చూసి అతని రక్తం ఉడికిపోతుంది. నా బిడ్డకు ఇలా బతకవలసిన అవసరం లేదు. నేను తనను నాతో తీసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ వివాహం చేస్తాను అని వారికి తెలియజేస్తాడు. కూతురు ఇలా వీరి మధ్య ఉంటే ఆమెకు నాదనే జీవితం లేకుండా, తనదైన భవిష్యత్తు లేకుండా అనాధలా మిగిలిపోతుందని, తాను ఉండగానే కూతురు జీవితం చక్కబెట్టాలని తపనపడే అతని తండ్రి ప్రేమను బసంత్‌ తల్లి ఎదిరించలేకపోతుంది.
బసంత్‌ తాత అంటే నాన్న తండ్రి మనవరాలిని కోడలితో పంప డానికి నిరాకరిస్తాడు. ఆమె తమ రక్తం అని, తన కొడుకు సంతానం కాబట్టి ఆ బిడ్డ తమ వద్దే ఉండాలని పంచాయితీలో చెప్పుకుంటాడు. పంచాయితీ కూడా దానికి అంగీకరిస్తుంది. మరో వివాహం చేసుకుంటే బసంత్‌ తల్లి ఇంటి పేరు మారిపోతుంది. బసంత్‌ మాత్రం తన తండ్రికి వారసురాలిగా ఆ వారస త్వాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి. అందుకని ఆమె తండ్రి ఇంటిలోనే ఉండి పోవాలని నిర్ణయిస్తుంది ఊరి పంచాయితి. బసంత్‌ తల్లి ఎంత ఏడ్చి మొత్తుకున్నా పెద్దవాళ్ళు ఆమె మాట వినరు. అలా బిడ్డను వదిలి ఇష్టం లేకపోయినా పుట్టింటికి వెళ్ళిపోతుంది బసంత్‌ తల్లి. పంచాయితీ ఆరునెలలకొకసారి బసంత్‌ తన తల్లి వద్దకు వెళ్ళి ఉండవచ్చని తీర్పు ఇస్తుంది. కాని అత్తల మధ్య పెరుగుతున్న బసంత్‌ నోరు నొక్కేస్తారు ఆ ఇంటి వాళ్ళు. ఆమె మేనమామ ఆరు నెలల తరువాత బసంత్‌ను తల్లి దగ్గరకు తీసుకువెళ్ళడానికి వస్తే తాను తల్లి దగ్గరకు వెళ్ళనని ఆమెతో చెప్పిస్తారు ఆ ఇంటి వ్యక్తులు. తల్లి కోసం ఏడుస్తూనే అత్తలు కోరినట్లే మేనమామతో అమ్మ దగ్గరకు రానని చెబుతుంది బసంత్‌. దీనితో ఆమె శాశ్వతంగా తల్లి నుంచి దూరం అవుతుంది.
ఈలోపు బసంత్‌ తాతగారికి తాను చనిపోతే తన మన వరాలి భవిష్యత్తు ఏమవుతుందనే చింత పట్టుకుం టుంది. అందు కని మంచి సంబంధం చూసి బసంత్‌ పెండ్లి
నిర్ణయిస్తాడు. పెండ్లి కొడుకు బసంత్‌ తల్లి రెండవ వివాహం చేసుకున్న వ్యక్తి ఇంటి పక్కనే ఉంటాడని, తల్లి కూతుళ్లు ఇప్పుడు పక్క పక్క ఇళ్ళ వారవుతారని అత్తలు మాట్లాడుకోవడం విన్న బసంత్‌ ఆనందంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఎనిమిదేళ్ళ బసంత్‌, పదేళ్ళ ఆ పెళ్ళికొడుకు నిద్రపోతుండగా వారిని ఎత్తుకుని అగ్ని చుట్టూ తాతలు తిరుగుతూ ఆ పెండ్లి తంతు నిర్వహిస్తారు. అత్తగారింటికి వెళ్ళిపోవడానికి ఆనందం గా తయార వుతుంది బసంత్‌. కాని ఆమె చాలా చిన్నది కాబట్టి వయ సుకు వచ్చాక అత్తగారింటికి తీసు కుని వెళతా మని చెప్పి పెండ్లి వారు వెళ్లి పోతారు. ఈ పెండ్లి తరువాత తల్లికి దగ్గరగా ఉండవచ్చనే బసంత్‌ కోరిక ఆమె మనసులోనే సమాధి అయి పోతుంది.
చైనాతో భారత దేశం యుద్ధం మొదల వుతుంది. యుద్ధ భూమిలో చైనా సరి హద్దులలో ఇద్దరు భారతీయ సైనికులు మెహతాబ్‌ సింగ్‌ పేరుతో ఒకే దళంలో ఉంటారు. ఒకరు బసంత్‌ భర్త. యుద్ధంలో అతను చని పోతాడు. ఈ వార్త అతని ఇంట్లో చెప్ప మని రెండవ మెహతాబ్‌ను ఆ ఊరికి పంపిస్తారు ఆఫీసర్లు. ఈ మెహతాబ్‌ అనాధ. ఇంటి పక్కనుండే ఓ స్త్రీ దయతో చేరదీస్తే ఆమె వద్ద పెరుగుతాడు ఇతను. అతనికి వివాహం చేసే వారెవ్వరూ లేకపోవడంతో ఇంకా అవివాహితుడి గానే మిగిలిపోతాడు. స్నేహితుని మరణం గురించి చెప్పడానికి అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు ఇతను. ఏవో కాగితా లపై మెహతాబ్‌ భార్య అంటే బసంత్‌ సంతకం కావాలని ఆమె ఊరికి బయలుదేరతాడు.
బసంత్‌ ఉంటున్న ఊరికి దగ్గరగా వచ్చినప్పుడు అతను బావి దగ్గర నీళ్ళు తోడుతున్న బసంత్‌ని చూస్తాడు. ఆతన్ని సైనికుని యూనిఫారంలో చూసిన బసంత్‌, ఆమె అక్కా చెల్లెల్లు అతనే బసంత్‌ భర్త అని అనుమానపడతారు. ఈలోగా మెహతాబ్‌ దారిలో బసంత్‌ అన్నను కలుస్తాడు. బసంత్‌ తండ్రి సోదరుని కొడుకు ఇతను. బసంత్‌ భర్త మరణిం చాడని తెలుసుకున్న అతను చాలా బాధపడతాడు. అయితే ఇంట్లో మరో చెల్లెలి పెళ్ళి ఉన్నదని, ఒక ఐదు రోజులు ఆగి ఈ కబురు ఇంట్లో చెప్పమని లేదా ఈ విషాదవార్తతో పెండ్లి ఆగిపోతుందని మెహతాబ్‌ను బతిమిలా డుతాడు బసంత్‌ అన్న. తమ ఇంట్లో పెండ్లి అయిపోయేదాకా ఓ స్నేహితుని ఇంట్లో మెహతాబ్‌కి బస ఏర్పాటు చేసి ఇంటి నుంచి భోజనం పంపించే ఏర్పాటు చేస్తాడు బసంత్‌ అన్న.
పక్క వీధిలో ఆ సైనికుడు ఉన్నాడని అతనికి అన్న భోజనం పంపిస్తున్నాడని తెలుసుకున్న బసంత్‌ ఆమె పెదనాన్న కూతుర్లు, ఆతన్ని కలుసుకోవడానికి భోజనం ఇచ్చే నెపంతో అతనున్న చోటుకు వెళతారు. అతన్ని తన పేరు చెప్పమ న్నప్పుడు అతను మెహతాబ్‌ సింఫ్‌ు అని చెబుతాడు. దానితో అతనే బసంత్‌ భర్త అని అందరూ అనుకుంటారు. తనకు భోజనం తీసుకొచ్చిన అమ్మాయే బసంత్‌ అని, తాను ఆ ఊరికి వచ్చింది ఆమె వద్ద సంతకం కోసమే అని మెహతాబ్‌ తెలుసు కుని ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోతాడు. బసంత్‌ను చిన్నతనంలో పెంచిన ఆమె మేనత్త పెండ్లి కోసం ఇంటికి వస్తుంది. అయితే ఆమెతో బసంత్‌ ఈ సైనికుని విషయం చెప్పి తనను కూడా అత్తగారింటికి పంపిస్తున్నారు కదా అని ప్రశ్నిస్తుంది. విషయం తెలియని ఆమె బసంత్‌ అన్నను ఈ విషయంపై కదిలి స్తుంది. ఇక తప్పక అసలు నిజం అత్తతో చెప్పవలసి వస్తుంది. అయితే మాటల మధ్యలో తామెందుకు వచ్చిన సైనికునితో బసంత్‌ వివాహం జరిపించ కూడదు అనే ఆలోచన మొదలవుతుంది. అత్త సహాయం తో ఈ విషయాన్ని మెహతాబ్‌ వద్ద ప్రస్తావిస్తాడు బసంత్‌ అన్న. బసంత్‌ కు చిన్నతనంలోనే పెళ్లి జరిగింది కాని ఏ రోజు అత్తింటి మొహం చూడని ఆమె జీవితంలో మోడుగా మారకుండా ఆమెకు నీడని ఇమ్మని మెహతాబ్‌ని అర్ధి స్తుంది బసంత్‌ అత్త. బసంత్‌ అన్న కూడా వివాహం చేసుకొమ్మని మెహతాబ్‌ని అర్ధిస్తారు. అయితే ఈ విషయాన్ని ఎవరైనా పెద్దల వద్ద ప్రస్తావించమని మెహతాబ్‌ చెబుతాడు. దానికి ఊరి పెద్దల మనస్తత్వం తెలిసిన ఆ ఇద్దరూ అంగీకరించరు. మెహతాబ్‌గా ఆ ఇంటి అల్లునిగానే బసంత్‌ని తనతో తీసుకెళ్లమని ఇద్దరూ మెహతాబ్‌ని బతిమాలతారు. మెహతాబ్‌ దీనికి ఒప్పుకుంటాడు.
ఇంటి అల్లుడిగా అప్పుడు మెహతాబ్‌ని బంధువర్గానికి పరిచయం చేస్తాడు బసంత్‌ అన్న. బసంత్‌ ఇతన్ని తన భర్తగానే ఊహించుకుంటుంది. అతనిపై కోరిక పెంచుకుంటుంది. బసంత్‌ను అత్తగారింటికి పంపడానికి ఓ చిన్న విందు ఏర్పాటు చేస్తారు ఇంటిలోని వ్యక్తులు. ఆ విందుకు మెహతాబ్‌తో పని చేసిన ఆఫీసర్‌ వస్తాడు. మెహతాబ్‌ మోసం చేసి బసంత్‌ను తనతో తీసుకుని వెళుతున్నాడని అనుకుని అతను బసంత్‌ భర్త యుద్ధంలో మరణించిన విషయాన్ని ఊరి పెద్దలకు ఆ ఇంటి బంధువులకూ చెబుతాడు. ఊరి వాళ్లు మెహతాబ్‌ను చంపడానికి ముందుకు వస్తారు. ఇదేమీ అర్ధం కాని బసంత్‌ ఆశ్యర్యంగా చూస్తూ ఉండగానే మెహతాబ్‌ని చంపడానికి వెంటపడతారు ఊరి వాళ్లు. వారి మధ్య నుంచి అతన్ని రక్షించి తన చెల్లిలిని తీసుకుని వెళ్ళమని తానే చెప్పానని బసంత్‌ అన్న ఊరి వారి మధ్యకు వచ్చి చెబుతాడు. చిన్నప్పటి నుంచి అకారణంగా తల్లి ప్రేమకు ఆమెను దూరం చేసి, బాల్యవివాహం చేసి అన్ని విధాలుగా ఆమె జీవితంతో తాము ఆడుకున్నామని ఇది అన్యాయమని, ఏ పాపం చేయని ఆమె జీవితం ఇలా మిగిలి పోవడం తప్పని ఓ అభ్యుదయ భావాలున్న యువకుడు ఆమెకు అండగా ఉంటానని ఒప్పుకుంటే ఊరి వాళ్ళు ఆపడం అన్యాయం అని అతను వాదిస్తాడు. బసంత్‌ తల్లికి ఇష్టం లేకుండా వివాహం పేరుతో ఆమెను బిడ్డకు దూరం చేయడం, ఎక్కడా ఆ ఇంటి స్త్రీలకు ఏం కావాలో ఎవరూ అడగకపోవడం అన్యాయమని వాదించి ఊరి పెద్దలని ఈ వివాహానికి ఒప్పిస్తాడు.
మెహతాబ్‌ బసంత్‌కు ఇప్పుడు అన్నీ విషయాలు తెలిసాయి బట్టి ఈ వివాహం ఆమెకు ఇష్టమా లేదా అన్నది కనుక్కొమ్మని ఆ ఇంటివారికి చెబుతాడు. మొదటిసారి ఆ ఇంటి అమ్మాయి యిష్టాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తారు ఊరి వాళ్లు.
మెహతాబ్‌తో వివాహం తనకిష్టమే అని బసంత్‌ చెప్పిన తరువాత ఆమెకు వివాహం చేసి అత్తగారింటికి పంపిస్తారు ఆమె బంధువులు. మెహతాబ్‌ ఊరికి వచ్చిన బసంత్‌ అతని ఇంట పెద్ద దిక్కుగా ఉన్న తల్లిని చూసి ఆనందం పట్టలేకపోతుంది. అనాధ అయిన మెహతాబ్‌ను చిన్నప్పటి నుండి ఆమె చూసుకుందని తెలిసి ఈ విధంగా మళ్ళీ తల్లి ఒడి చేరినందుకు సంతోషిస్తుంది.
కథ అంతా కూడా ఫ్లాష్‌ బాక్‌లో నడుస్తుంది. బసంత్‌ కౌర్‌ ముసలితనంలో తన ఆత్మకథను రాస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్టులకు తన కథ చెప్పి మరణిస్తుంది ఆమె. మరణం తరువాత చిన్న పిల్లగా మారి మబ్బుల మధ్య స్వర్గలోకంలో ఆమె తన తల్లి తండ్రులిద్దరినీ కలుసుకోవడం చివరి షాట్‌. అయితే తల్లిదండ్రులను చేరడానికి వెళుతున్నప్పుడు మరణించిన మెహతాబ్‌ను దారిలో ఆమె చూసి ఆగిపోతుంది. చిరునవ్వుతో ఆమెను తల్లిదండ్రులను చేరమని అతను ప్రోత్సహించడం ఆమె జీవితంలో అతను చూపిన ప్రేమను, ఆదరణను తెలుపుతుంది. ఈ షాట్‌ ద్వారా ఓ పురుషుడు స్త్రీకి ఇవ్వవలసిన స్వేచ్ఛను, అండను దర్శకుడు చూపించారని అనిపిస్తుంది.
మెహతాబ్‌గా జిమ్మీ షేర్గిల్‌ బావుంటాడు. పంజాబ్‌లో మధ్య తరగతి గ్రామీణ జీవితాలను ముఖ్యంగా స్త్రీల జీవితంలో అన్ని కోణాలను ఈ సినిమా ప్రస్తావిస్తుంది. కథా వస్తువు 1950 లతో మొదలయినా ఎందరో స్త్రీల జీవితాలను ప్రతీకగా ఈ కథను తీసుకోవచ్చు. దానా పాని అన్న పేరుతో బసంత్‌ రాసుకున్న ఆత్మకథగా ఈ కథను సినిమాగ మలిచిన విధానం బవుంటుంది. సిమి చాహల్‌ ప్రధాన పాత్రలో అలరిస్తుంది.
- పి.జ్యోతి, 9885384740

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.