Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటికో దీపం!! | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 27,2022

ఇంటికో దీపం!!

          అలాగ పెద్ద పెద్ద పట్నాలు పల్లెలు, అడవులు, వాగులు, వంకలు, డొంకలు చూసి వద్దామని బయల్లేరేరు నారదుడూ తుంబురుడూ.
వీళ్ళిద్దరి పేర్లు ఇవే గానీ వీళ్లు పురాణ పురుషులేం కాదు. ఇప్పటి మామూలు మనుషులే.
          'ఈ పట్నం చాలా పెద్దదిలా కనిపిస్తున్నది' అన్నాడు నారదుడు చెవిలో చూపుడు వేలు పెట్టి కెలుకుతూ.
          'అవును సుమా! ఇక్కడ చూడవలసిన వింతలూ విశేషాలు చాలా ఉన్నట్టున్నాయి' అన్నాడు తుంబురుడు తలని ఐదు వేళ్ళతో గోక్కుంటూ.
'తలని అలాగ బరబరా గీకేయకు. ఉన్న నాలుగు పోచలూ రాలిపోగలవు. తల నొప్పిగా ఉంటే వేడి వేడి టీ తాగుదాం పద' అంటూ ఎదురుగ్గా కనిపించిన 'కేఫ్‌' వైపు నడిచాడు నారదుడు. అనుసరించాడు తుంబురుడు.
          ఇద్దరూ రెండు కప్పులు వేడి వేడి టీ గొంతులో పోసుకుని సేదతీరారు. డబ్బులివ్వబోతే హౌటేలు వాడు తిరస్కరించాడు. 'మేం టిఫిన్లకి డబ్బు తీసుకుంటాం కానీ టీ కి తీసుకోం. అలా గోడ మీదికి చూడండి' అన్నాడు.
ఇద్దరూ తలలతో పాటు కళ్ళూ పైకి ఎత్తి చూశారు. గోడ మీద ఫ్రేం కట్టిన పెద్దఫొటో ఆ ఫొటోలో కదలకుండా ఓ పెద్ద మనిషీ ఉన్నారు.
'ఎవరాయన?' అనడిగారిద్దరూ రెండు గొంతులతో ఏక శబ్దంతో.
'ఆయన తెలీదా? ఆయనే రుక్మాంగదుడు. ఈ పట్నపు ప్రభువు. ఆయన పుణ్యమా అని జనం ఉచితంగా టీలు తాగుతున్నారు' అన్నాడు హౌటల్‌ యజమాని.
          'అదేవిటి?' అని అసంకల్పితంగా మళ్ళీ తల గోక్కున్నాడు తుంబురుడు.
          'వేడి తేనీటి పథకం... ఈ పథకం ఆ మహానుభావుడి చలవే' అంటూ డబ్బు లెక్క చూసుకోడం మొదలెట్టాడు హౌటల్‌ వోనర్‌.
          మిత్రులిద్దరూ బయటకు వచ్చారు. మెల్లిగా రుక్మాంగదుడి పథకాల తడాఖా తెల్సి వచ్చింది ఇద్దరికీ. మధ్యాహ్న భోజన పథకంలో ఉచితంగా మెక్కారు. సాయంత్రం వేళ కాస్త ఉషారుగా మజా చేసుకుందామని బారులో దూరారు. పెగ్గు తాగితే పెగ్గు ఫ్రీ అన్నాడు బేరర్‌. అదేమిటంటే గోడమీది రుక్మాంగదుడి ఫొటో చూపించాడు. ఉచిత మందు పంపిణీ పథకం అని కిసుక్కున్నవ్వాడు బేరర్‌.
          వీళ్ళిద్దరికీ ఎదురుగ్గా వచ్చి కూచున్న 'ప్రభుత్వ పోషకుడు' ఒకడు రెండు రౌండ్లు తర్వాత పట్నం చరిత్రా భూగోళం విపులంగా వివరించాడు నారదుడికీ తుంబురుడికీ జమిలిగా. ఉచిత వేడి తేనీటి పథకం, ఉచిత మందుల పంపిణీ పథకంతో పాటు స్త్రీల పథకం, బాలల పథకం, యువకుల పథకం, నిరుద్యోగుల పథకం, వృద్ధుల పథకం, బియ్యపు పథకం, పాల పథకం, పెరుగు పథకం, పెళ్ళి పథకం, చావు పథకం, దగ్గు పథకం, తుమ్ము పథకం, తలనొప్పి పథకం, ఇలాగ లెక్కకు మించినన్ని పథకాలతో రుక్మాంగదుడు పట్నానికి తిరుగులేని ప్రభువయ్యాడని ముద్దుముద్దుగా మందమైన లుక్‌తో వివరించడంతో పాటు ఇక్కడ జనానికి చేయడానికి పన్లేమీ లేవని అన్నీ ఉచితంగా దొరకడం వల్ల టీవీలు, మొబైళ్ళ చాటింగులూ వాట్సప్పుల్లో కులాసాగా గడిపేస్తున్నారని సెలవిచ్చాడు.
          'ఆహా! ఏమి భాగ్యము ఈ నగరములోనే మనమూ సెటిలైపోతే పనీ పాటా లేకుండా ఉచిత పథకాలను అనుభవిస్తూ బాగా బలిసి పోదాం' అన్నాడు నారదుడు. బలవడానికి తనకూ అభ్యంతరం లేదన్నాడు తుంబురుడు.
విశాలమైన మైదానంలో ఎన్నికల ప్రచార సభ జరుగుతున్నదని విని రుక్మాంగదుడ్ని చూద్దామని వెళ్ళారు మిత్రులిద్దరూ.
వేదిక మీది మైకు ముందున్న ముఖాన్ని ఫొటోల్లో చూసి ఉండటాన్ని రుక్మాంగదుడిగా తేల్చుకున్నారు.
          'అమ్మలారా! అయ్యలారా! అక్కలారా! చెల్లెళ్ళరా అందరికీ వందనాలు. ఎన్నికలు రాబోతున్నవి. నన్ను పదవసారి ఎన్నుకోవల్సిన బాధ్యత మీ అందరిదీ. ఇది వరకే అనేక అనుచిత క్షమించాలి. ఉచిత పథకాలు ప్రవేశపెట్టాను. అయితే ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా మీకు కడుపు నిండదు నాకు తెల్సు. అందుకే ఈ సారి ఒక సరికొత్త ఆలోచన చేశాను. అది వింటే ఇక మీరు నన్నే శాశ్వతంగా ఎన్నుకుంటారు. 'అల్లా ఉద్దీన్‌ అద్భుతదీపం' గురించి వినే ఉంటారు. మీరు ఏది కోరితే అది చిటికెలో అందిస్తుంది. అది మీకు అందితే పథకాలతో అసలు పనే ఉండదు. అందుకే దేశ విదేశాల నుండి సైంటిస్టులను, మంత్రవేత్తలను పిలిపించాను. వారు ఒకటికాదు పట్నంలో ప్రతి ఇంటికీ ఒక అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇంటింటికో అద్భుత దీపం అందిస్తాం! దీపం మీకు ఓటు నాకు! అంటూ ఉపన్యాసం ముగించాడు రుక్మాంగదుడు. చప్పట్లు మోగాయి.
          నారదుడు, తుంబురుడు అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం కోసం ఆ పట్నంలోనే సెటిలైపోయారు.


- చింతపట్ల సుదర్శన్‌, 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.