Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జానపద బాలల కవి పాలడుగు నాగయ్య | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 27,2022

జానపద బాలల కవి పాలడుగు నాగయ్య

    'బాలానందం' తెలియని రేడియో ప్రేమికులు గానీ, ఎనభై, తొంభయ్యవ దశకాల్లో బడికి వెళ్ళిన పిల్లలు గానీ ఉండరనడం నిజం. బాలబాలికలకే కాదు పెద్దలకూ ఇష్టమైన రేడియో కార్యక్రమమది. 'బాలనందం' కార్యక్రమం వచ్చే ముందు కొంత కాలంపాటు ఒక పాట ప్రధానంగా వినిపించేది. అది, 'రారండోరు.. రారండోరు.. నవయువకుల్లార... యువ కర్షకుల్లార దేశ సమైక్యత కాపాడుటకు దీక్షతొ ఒకటై నిలవాలోరు'' అంటూ సాగేది. అందరిని బాలానందానికి ప్రేమగా స్వాగతం పలికేది. ఈ పాట రాసింది బుఱ్ఱకథలు, జానపదాలు, పల్లెపదాలతో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన పాలడుగు నాగయ్య.
    ఖమ్మం జిల్లా రామాపురంలో పాలడుగు ఈరయ్య, తిర్పమ్మ దంపతులకు జులై 19, 1943న పాలడుగు నాగయ్య పుట్టాడు. బాల్యంలోనే తల్లి మరణించడంతో నల్లగొండ జిల్లా సూర్యాపేట దగ్గరి కుడకుడలో మేనత్తల ఇంట్లో పెరిగి, అక్కడే విద్యాబ్యాసం చేశాడు. పాఠశాల విద్యార్థిగా పాటల రచన ప్రారంభించిన నాగయ్య 1958లో పాఠశాల స్థాయిలో బహుమతి అందుకున్నాడు. నాగయ్య చేతిలో పాట వడిసెలలాగా రయ్యన సాగేది. అందుకు ఆయన రాసిన ప్రతిపాట అక్షర సత్యంగా నిలుస్తుంది. పుట్టిన ఊరు రామాపురం గురించి రాస్తూ, 'పాకాల ఏరు పక్కనుండే ఊరు / రామాపురమనే పేరు రాళ్ళకాడ ఉన్నది / గార్ల కాడ ఉండి ఊరు దార్లు చూపుతున్నది/ జొన్నశేల పంటలతో జోరుగ ఊరున్నది' అంటూ తన జన్మ భూమికి కావ్య గౌరవం కల్పించారాయన.
    స్వయాన కవి, గాయుకుడు, కళాకారుడు అయిన నాగయ్య పిల్లల కోసం అను బుర్రకథలు రాసి స్వయంగా ప్రదర్శించారు. ఆయన ప్రదర్శల్లో ఇతర కళాకారులు ఆయన కుటుంబ సభ్యులు కావడం విశేషం. నాగయ్య రాసిన బుర్రకథల్లో మిక్కిలి ప్రసిద్ధి పొందినది 'డా.బి.ఆర్‌.అంబేద్కర్‌' బుర్రకథ. దీనిని 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శించి, 1973లో ప్రచురించాడు. బుర్రకథే కాక ఈయన రాసిన 'అంబేద్కర్‌' నృత్యనాటిక కూడా ప్రసిద్ది చెందింది. 'భక్తి జనపదాల భవనము', 'పాలడుగు పదాలు' మొదలగు రచనలు, 'సీతారామ కళ్యాణము', 'డి. సంజీవయ్య', 'ఝాన్నీ లక్ష్మీబాయి', 'వీర అభిమన్యు' బుర్రకథలు అచ్చయిన వాటిలో ఉన్నాయి. అంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి కోసం బుర్రకథలను సంకలనం చేయగా 'తందాన తాన' పేరుతో ఆకాడమి దీనిని 1982లో ప్రచురించింది. ఇందులో నాగయ్య రాసిన 'బాల చంద్రుడు' బుర్రకథతో పాటు ఏడిద కామేశ్వరరావు 'బుద్ధ లీలలు', కవుల ఆంజనేయశర్మ 'వీర శివాజీ', రెడ్డి చినవెంకటరెడ్డి 'ఆంధ్రకేసరి', కోసూరు పున్నయ్య రాసిన 'జెగజెట్టి కోడిరామమూర్తి' వంటి బుర్ర కథలున్నాయి.
    'పిల్ల పదే జాతరా పిల్లలమర్రి జాతరా/ పోరి పదే జాతరా పోదాము రాయె జాతరా', 'నడువే ఓ రాములమ్మ నడువే నీవు/ నరసిమ్మా సామికాడికి నడువే నీవు' వంటి అనేక పాటలు, భజనలు, కీర్తనలు రాసిన పాలడుగు నాగయ్య పాలబుగ్గల పసిపిల్లల కోసం రచనలు చేశారు. పిల్లల కోసం పాటలు, గీతాలు, ఏకపాత్రలు, బుర్రకథలు రాసి స్వయంగా తానే దగ్గరుండి నేర్పించి రేడియోలోనూ, రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ వంటి అనేక వేదికలపైన వారితో ప్రదర్శనలు ఇప్పించాడు. తాను కూడా పిల్లలతో కలిసి ప్రదర్శించి అనేక పోటీల్లో బహుమతులు కూడా అందుకున్నాడు. ఆయనకు పేరు తెచ్చిన ఎకపాత్రల్లో 'పిట్లలదొర', 'పకోడివాలా' వంటివి ప్రముఖమైనవి.
    'పకపక నవ్వే పాపల్లార చకచక సాగే చిగురుల్లారా / వడివడి విద్యలు నేర్వండి / అడుగిడి ముందుకు సాగండి' అంటూ రాసినా, 'బాబులు బొమ్మలు బాలల బొమ్మలు / బలెబలె బొమ్మలు బలె మంచి బొమ్మలు / కా అంటూ పాడేటి కాకమ్మ బొమ్మలు / కూ అంటూ కూసేటి కోయిలమ్మ బొమ్మలు' అంటూ పాడినా లేదా జాతరల్లో, దుకాణాల్లో పిల్లలకు కనువిందు చేసి ఆకర్శించే బొమ్మల గురించి 'వైకుంఠం చూపిస్తం బాబు మేము వైకుంఠం చూపిస్తం బాబు / పైస మాకిస్తేను పట్నము చూపెడుతాం / పది పైసలిస్తేను పంజాబు చూపిస్తం / ఏబై పైసలిస్తేను ఎల్లోర చూపిస్తం / రూపాయి ఇస్తేను ఢిల్లీకోట చూపిస్తం' అంటూ పాడిన అది ఆయనకే చెల్లింది.
    దేశం, ధర్మం, రాముదు, నరసింహస్వామి వంటి అంశాలు, గ్రామీణులు, గ్రామీణ జాతరలు, గ్రామ దేవతల గురించి కూడా పాటలు రాసిన పాలడుగు నాగయ్య బుర్రకథల ఎత్తుగడ విలక్షణంగా ఉంటుంది. అది ఆయన అన్ని కథల్లో కనిపిస్తుంది. 'అంబ భారతి/ ఆదుకొని మమ్మేలుకోవే / పాడి పంట లొసగి, భాగ్యాలు మాకొసగి / దీవించవే ముమ్మ దీనులము మేమోయమ్మ' అంటూ 'బాలచంద్రుడు' కథలో కథ ప్రారంభిస్తే, 'న్యాయధర్మమములు నాల్గుపాదముల నడిపించిన దేశం తందాన తాన/ కత్తి నిచ్చి యుద్దానికి పంపె కన్నతల్లులకును / కొదువలేనిది భారతదేశం' దేశశౌర్యవీర పరాక్రమాలను వర్ణిస్తాడు. 1982 ఏప్రిల్‌ 10న అనారోగ్యంతో అర్ధాంతరంగా తనువుచాలిచాడు ఈ పాటల బాటసారి.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.