Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాటక రంగానికి జేజేలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Mar 27,2022

నాటక రంగానికి జేజేలు

       ప్రపంచమంతా రంగస్థల దినోత్సవం జరుపుకునే ఈ రోజు (మార్చి 27)న దాని పరిణామాన్ని మననం చేసుకుందాం...!
       ప్రపంచంలోని అన్ని దేశాలల్లోనూ దాదాపు ఒకేసారి నాటక ప్రక్రియ మొదలయిందని చెప్పవచ్చు. ఒకప్పటి ప్రపంచంలో ఈ రోజులలో వలె ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒక దేశానికి మరొక దేశానికి మధ్యన రాకపోకలు లేవు. ఒక దేశంలో ప్రజల జీవన విధానానికి మరొక దేశంలోని ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునే అవకాశమే లేదు. అసలు ఒక దేశం ఉనికి మరొక దేశానికి తెలీదు. అటువంటి పరిస్థితులలో ఒకే కాలంలో అన్ని దేశాలలో నాటక ప్రక్రియ మొదలయిందని, ప్రాచ్య పాశ్యాత్య దేశాలలో ఒకే ప్రక్రియ ఒకేసారి పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఆయా దేశాలలోని మానవ సంబంధాలు, సమాజం. నాటక ప్రక్రియ ఈ మూలాల నుండే ఉద్భవించింది.
గత చరిత్రను లేదా సాంస్కృతీ సాంప్రదాయాలను మన ముందు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆ కాలపు సమాజంలోకి మనను తీసుకుపోయి మనం ఆ కాలంలో ఉన్నట్లు భ్రమింపజేసేది నాటకం. అయితే ఈ భ్రమకు వాస్తవరూపం ఇచ్చేది నాటక రచన-
       నాటక రచన అనేది సార్వకాలికమైనది, సార్వజనికమైనది. కాలాన్ని బట్టి, ప్రదేశాన్ననుసరించి, సంస్కృతిని బట్టి, రూపం మారుతుందేమో కాని అంతర్లీనంగా ఉన్న నాటక మౌలిక స్వరూపం, అన్ని దేశాలలోను ఒకటే. అందుకే అన్ని దేశాలలోనూ నాటకానికి బహుళజనాదరణ వున్నది. ప్రస్తుతం ఉన్న నాటకం ఆయా కాలాలలో తన స్వరూపాన్ని, దిశనూ మార్చుకుంటూ ఒక ప్రపంచ ప్రఖ్యాత ప్రక్రియగా రూపొందింది.
       విశ్వంలో కళాత్మక వారసత్వ సంపద ఒక దేశానికి పరిమితం కాకుండా అంతర్లీనంగా మానవీయ సంబంధాలు పెంపొందించాలనే సదుద్దేశంతో పారిస్‌ నగరంలో 1947 మార్చి 27వ తేదీన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ థియేటర్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి నాటకాన్ని విశ్వవ్యాపితం చేయాలని నిర్ణయించుకున్నారు.
       తరువాత 1961లో వియన్నా దేశంలో ఈ రోజును పురస్కరించుకుని మార్చి 27వ తేదీన జరిగిన సమావేశంలో ''అర్వికినియా'' అనే హెవెన్‌స్కీ జాతీయుడు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆ సమావేశానికి ఆనేక దేశాల నుంచి వచ్చిన నాటక ప్రముఖులు కినియా చేసిన ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఆ మరుసటి సంవత్సరం పారిస్‌లో జరిగిన ప్రపంచరంగస్థల దినోత్సవం నాటి నుండి ఈనాటి వరకూ విరామం లేకుండా సాగుతోంది.
       ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వున్న రంగస్థల ప్రియులందరు దేశానికి ఒక ప్రతినిధి చొప్పున ఒక చోట సమావేశమై పూర్వాపరాలను చర్చించుకుని, తమ అనుభవాలను రంగరించి నాటక రంగం మరిన్ని ప్రయోగాలతో ముందుకు సాగే ప్రతిపాదనలు చేస్తారు. ఇంతకు ముందు వరకు భారతదేశపుప్రతినిధిగా ప్రముఖ నాటక రచయిత, ప్రయోక్త, దర్శకుడూ అయిన ''గిరీష్‌ కర్నాడ్‌'' ఆయా సభలలో పాల్గొన్నారు. ఇటీవల ఆయన మరణించిన తదుపరి ఎవరున్నారో తెలీదు.
       ప్రపంచంలో నాటక ప్రక్రియ మొదటిసారిగా గ్రీకు దేశంలో ప్రారంభించబడిందని చెపుతారు. తరువాత అన్ని దేశాలలోను కొంచెమించుమించుగా ఈ ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇక ప్రపంచ నాటక రంగంలో భారతదేశ నాటక ప్రదర్శనలను గురించి ఆలోచిస్తే ప్రపంచంలోకాని, భారత దేశంలో కాని అసలు మొదట ప్రదర్శించబడిన నాటకం ఏది? నటడు ఎవరు? ప్రదర్శనశాల ఎక్కడ అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.
       చలన చిత్రాలకు సంబంధించి మొదటి టాకీ ''భక్త ప్రహ్లాద'', నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి, నటులుగా సురభి కమలాబాయి, ఎల్‌.వి.ప్రసాద్‌ మొదలైన వారుగా పరిశోధకులు నిర్ధారించారు. అలాగే నాటకానికి సంబంధించి మొదటి ప్రదర్శనశాల ఏది అని ప్రశ్న వేసుకుంటే 1848లో కర్నల్‌ ఓస్లీ ప్రపంచ దృష్టికి తీసుకువచ్చిన దాన్ని ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని రాంఘర్‌ పర్వతాల మధ్య సీతాబొంగారా, జోగిమారా అనే రెండు గుహలున్నాయి. ఈ రెంటినీ తొలిచి ఒక పెద్ద హాలు నిర్మాంచారు. ఇది ఒక రంగశాల. రంగస్థలంపై తెరలు కట్టడానికి అవసరమయిన గుంజలను నిలబెట్టడానికి అటూయిటూ రెండు గుంటలు ఉన్నాయి. రంగస్థల నిర్మాణం, భరతముని నాట్య శాస్త్రంలో చెప్పిన సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ రంగస్థలాన్ని 19వ శతాబ్దంలోనే కనుగొన్నారు.
       1904లో డాక్టర్‌ బ్లీచ్‌ అనే జర్మన్‌ పండితుడు ఈ ప్రసిద్ధ రంగస్థలంపై జానపద నాటకాలు వేసేవారని అంటూ వాటిని గురించిన వివరాలను ప్రపంచానికి తెలియజేశాడు. ఈ గుహలు ఆసియాలోనేకాక ప్రపంచం లోనే ప్రాచీనమైనవని మధ్య ప్రదేశ్‌కు చెందిన ''కుంతల్‌ గోయల్‌'' అనే ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ''సందేశ్‌'' అన్న పత్రికలో ఎప్పుడో రాశాడు. ఆయన ఈ గుహలను గురించి రాస్తూ ఇవి మౌర్యులకు పూర్వం నాటి, లోమేష్‌ గుహలను పోలి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
       ఈ రంగశాలలో ముఖ్యంగా నాటకాలు, నృత్య ప్రదర్శనలు జరిగేవి. గుహలలో ఆలయాలు బౌద్ధారామాలు, చైత్యాలు నిర్మించినట్లే ప్రాచీన భారతదేశ గుహల్లో నాటకాలు, నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉండటం పరిపాటే.
       జైన మతానికి చెందిన సౌభికులు ఇటువంటి నాటకాలను ప్రదర్శించేవారు. సీతారాం బొంగారా గుహ ప్రవేశ ద్వారం వద్ద ఒక శిలా శాసనం కూడా ఉన్నది. ఈ శాసనంలో మూడు అడుగుల ఎనిమిది అంగుళాల విస్తీర్ణంతో రెండు వాక్యాలు మాత్రమే ఉన్నాయి. వాటి అర్థం ఇది ''హృదయానందాన్ని కలిగించు. రాత్రిళ్ళు సన్నజాజి పూల దండలను మెడలో ధరించి హాస్యాన్ని, సంగీతాన్ని ఆస్వాదిస్తూ మహా కవులు రాత్రంతా ఎక్కడో విహరిస్తూ ఉంటారు'' అని.
       దీనిని బట్టి ఈ గుహలు కవులు, కళాకారులకు ఆట పట్టులని, కవి సమ్మేళనాలు కూడా జరిగేవని, అర్థమవుతుంది. భారతీయ కళావాస్తు పద్ధతిలో నిర్మించిన రంగస్థలం ఇది.
       ఈ రెండింటిలో జోగిమారా గుహ 30 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక్కడ వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది అంతకు ముందు వరుణ దేవాలయం అంటారు. ఈ రెండు గుహలు ఇలా నాటక రంగానికే కాక చిత్ర కళకు కూడా మొదటివని చెప్పవచ్చు.
ఈ గుహలలోని రంగస్థల నిర్మాణం భరతముని నాట్య శాస్త్రానికి ఉదాహరణగా నిర్మించారని చెప్పవచ్చు.
       ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది. వలస రాజ్యాల పాలకులయిన పాశ్చాత్య నాటక, చరిత్ర కారులు తొలినాటకాన్ని, తొలి నటుడిని తొలి రంగశాలను గ్రీకులోనే ఉద్భవించాయని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాన్ని ఇప్పటివరకు అందరూ ఆమోదించారు. కాని నాట్య శాస్త్రాన్ని రచించిన భారత దేశీయుడు భరతమునిని వారి తర్వాత చేర్చడం గమనించలేదు కాని భరతముని వారి కంటే పూర్వుడు అన్న విషయం గమనించలేదు.
       యవనిక అన్న పదం కూడా గ్రీకు భాషా పదమే అని కూడా నిర్ణయించారు. సముద్ర గుప్తుణ్ణి ''ఇండియన్‌ నెపోలియన్‌'' అన్నారు. కాళిదాసును ఇండియన్‌ ''షేక్స్‌పియర్‌'' అన్నారు. కానీ నెపోలియన్‌, షేక్స్‌పియర్‌ వారి తర్వాతవారు అన్నది చారిత్రక వాస్తవం.
అలాగే భరతముని నాట్య శాస్త్రం రాయడానికి ముందే భారతదేశంలో నాటకశాలలు, నాటక ప్రదర్శన శాలలు ఉన్నాయని భావించవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వస్తే కాకతీయుల కాలంలోనే మన తెలుగు దేశంలో నాటక ప్రదర్శనలు జరిగినాయని తెలుసుకోవచ్చు. ఒక కాకతీయ రాజు కన్న ముందున్న రాజుల కాలంలో ఆంధ్ర దేశంలోని కూచిపూడి భాగవతులు కొందరు ఆ రాజ్యంలోని ప్రజలు పడుతున్న బాధలను ''సంబెట గురువరాజు'' ఆ రాజు ముందు నాటక రూపంలో ప్రదర్శిస్తే రాజు నిజం తెలసుకుని వారి బాధలను రూపుమాపాడని చరిత్ర కథలున్నాయి.
       ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లాకు చెందిన గడియారం రామకృష్ణ శాస్త్రిగారు కన్నడ భాషలోని ''గధాయుద్ధ'' అనే నాటకాన్ని తెలుగు భాషలోకి అనువదించారు.
       ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెన్నపట్నంలో స్థిరపడిన అనేక మంది ఆంధ్రులు వారి వారి ప్రాంతాలలోని నాటక ప్రక్రియలను ఆయా ప్రదేశాలలో ప్రదర్శిస్తూ కళామతల్లి సేవ చేస్తున్నారు.
       నాటక కళ ఆధునీకరించబడి ఎన్నో సాంకేతికమైన హంగులతో నేడు ప్రదర్శించబడుతోంది. వర్తమాన కాలంలో సామాజిక ప్రయోజనం ఆశించి ప్రదర్శిస్తున్న నాటకాలు పెరిగాయి. సాంఘిక సంస్కరణల కోసం ఆనాడు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని రాసి ప్రదర్శింపజేశారు. అది బహుళ ప్రజాదరణ పొందింది. కాళ్ళకూరి నారాయణరావు వర విక్రయం, చింతామణి మొదలైనవీ ఆ కోవలేవే. ప్రజా సమస్యలను ప్రతిబింబింప చేసే వీధి నాటకాలు సఫ్దర్‌ హష్మి లాంటి వారు ప్రచారంలోకి తెచ్చి ప్రజలలోకి తీసుకెళ్ళారు. ఎన్ని మార్పులుకు లోనయినా సమాజం ఉన్నంతకాలం నాటకం ఉంటుంది.

-  తాటికొండాల నరసింహారావు,
  9885787250

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.