Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 10,2022

రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం

          విశ్వగతిని మార్చే గమన సూత్రాలు కనిపెట్టిన ఇజాక్‌ న్యూటన్‌ ఒక మాటంటాడు ఒకచోట, ''నేనీ విశాల జ్ఞాన ప్రపంచాన్ని ఇలా చూస్తున్నానంటే కారణం, నా ముందు తరపు జ్ఞానుల భుజాల మీద నిలబడి చూస్తున్నా కాబట్టే'' న్యూటన్‌కున్న వినయం ఈ ప్రపంచంలో వంద మందికున్నా ఈ ప్రపంచం ఇంత ఘోరంగా వుండేది కాదు! ఈ దేశంలో కనీసం పిడికెడు మందికున్నా 'రిజర్వేషన్లు' తప్పుగా ధ్వనించేవి కావు!
          సంకెళ్ళతో బిడ్డ నెత్తుకున్న ఒక నీగ్రో తల్లి శిల్పాన్ని చూసి ఆహా! ఎంత గొప్పగా చెక్కేడు శిల్పం అనుకొని అక్కడే ఆగి పోయిన వాడికి 'ఏడు తరాల' వేదన తెలుస్తుందా ఎప్పటికైనా? అక్షరానికీ, బడికీ, గుడికీ, ఊరికీ, మనిషికీ, మానవత్వానికీ శతాబ్దాలుగా వెలివేసిన నీచత్వాన్ని సమర్ధించుకునేవాడికి, యుగయుగాల బడుగుల దోపిడి గురించి ఎప్పటికైనా తెలుస్తుందా?
ఇంకా 'రిజర్వేషన్లు' కంటగింపు చాలా మందికి. జాతి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుకోకుండా ''ప్రతిభ'' కు ఆటంకం అంటుంటారు కొందరు. ఎక్కడిదీ ''ప్రతిభ?'' ఫస్ట్‌ ర్యాంకు కొట్టిన పిల్లాడికి 'ప్రతిభ' తన సొంతంగా అనిపించొచ్చు, కానీ ఈ దేశ మేధావి వర్గానికి కూడా 'ప్రతిభ' ఒక సామాజిక సంపత్తి అని తెలియకపోవడం ఘోరం కాదా? రాజ్యాంగాల ముందు అందరూ సమానులు, కుల, మత, లింగ, వర్ణ వివక్షత లేకుండా! శతాబ్దాలుగా వెనక్కి నెట్టేసిన వాడూ, శతాబ్దాల వెంట పరుగుపెట్టుకుంటూ వచ్చినవాడూ యిద్దరూ సమానులే!
          'కులాలుండాలి సుమండీ' అంటున్నారు పీఠాధిపతులు సాక్షాత్తూ అధికార పీఠాల పెద్దలతో సాష్టాంగ నమస్కారాలు చేయించుకునే దేవర్షులు! ఏకలవ్యుడి బొటనవేలు అడగడం తప్పేంటి అంటున్నారు ప్రవచకులవారు! అత్యధిక శాతం అగ్ర ఉన్నత వర్గాలతో కొలువుదీరే సభల్లో, న్యాయవ్యవస్థల చేతుల్లో రిజర్వేషన్ల ఉనికి దినదినగండం గానే వుంటోంది. (డెబ్భై ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఎస్సీ న్యాయమూర్తులు యిద్దరూ, ఎస్టీ తెగల్లో అయితే ఒక్కరూ లేరు!)
          ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు యెందుకవసరమో వివరించే ప్రయత్నం చేశారు నాగటి నారాయణ.
          చట్టాలు చాలా తెలివిగా, ఆకుకూ పోకకూ అందకుండా కూర్చుతారు కాబట్టే రిజర్వేషన్లు కల్పించే చట్టాల్లో నిగూఢ ప్రవచనాలకు తావుంటుంది. 16(4) 16(4ఏ) లను వంకర తిప్పి 'పబ్లిక్‌ సర్వీసుల్లో రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదనీ, రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణే' అనీ ఇటీవల ధర్మాసనం (2020 ఫిబ్రవరిలో) ఒక తీర్పులో చెప్పిందంటే అడుగులు ఎటువైపు పడుతున్నట్టు? అందుకే రాహుల్‌ గాంధీ అన్నట్టు రిజర్వేషన్లపై అసహనం 'డిఎన్‌ఏ' లోనే ఉన్న వారి హయాంలో ఇంత ముఖ్యమైన వాటిని పరిరక్షించుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని అంటారు నాగటి.
2020 ఏప్రిల్‌లో షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల జాబితా సమీక్షించాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించిం దంటే, న్యాయమూర్తులకు కూడా ఈ రిజర్వేషన్ల పట్ల అసహనమే వుందని తెలుస్తోంది.
          అసలు రిజర్వేషన్లు అమలు కావడానికి ప్రభుత్వ రంగ సంస్థలు వుండాలి కదా ముందు? రోజుకొకటి చొప్పున టోకుగా ప్రభుత్వం అమ్ముకొని వ్యూహాత్మకంగా వాటికి మంగళం పాడే కార్యక్రమం ఓ వైపు సజావుగా సాగుతోంది. ఇంక ''ప్రతిభల్ని'' సష్టించి, 'ప్రతిభ'లను వేలం వేసి, గాలం వేసి లాక్కెళ్లే ప్రయి వేటు రంగంలో రిజర్వేషన్లు ఒక ఫార్స్‌ అవుతాయనేది అర్థం చేసుకోవడానికి పెద్దగా తెలివి తేటలు అక్కర్లేదు. ఇంకా ఇలాంటి విషయాలు చాలానే చర్చించారు నాగటి ఈ పుస్తకంలో.
          అసలు రిజర్వేషన్లు ఎందుకు, ఎవరికి? బ్రిటీష్‌ హయాం లోనే పునాది పడ్డ ఈ రిజర్వేషన్లు కల్పించే అవసరం ఎందుకుంది? ఇవి ప్రతిభకు ఎలా విరుద్ధంగా వుండవు? ధర్మాసనాలే ఒకోసారి ఈ విషయంలో సరైన రీతిలో స్పందించకపోతే రేపు వీటి భవిష్యత్‌ ఏమిటి? అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ లెవరు? విద్యా ఉద్యోగాల్లో ''ఆడెక్వెసీ'' గురించి ఎందరికి తెలుసు? రాజ్యాంగం, కొందరు అభిప్రాయపడ్డట్టు రిజర్వేషన్లని సమీక్షించే అధికారాన్ని ప్రజాప్రతినిధుల విచక్షణకు వదిలేసిందా? బీజేపీ రిజర్వ్డ్‌ స్థానాల్లో గెలిస్తే ముప్పెవరికి? కుల ధర్మాల గురించీ, ఆశ్రమ ధర్మాల గురించీ, సనాతన మనుధర్మాల గురించీ ఆధునిక పీఠాధిపతులు యెందుకు తరచుగా భౌతిక సమస్యల కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యత నిచ్చే ఎస్సీ/ ఎస్టీ వెనుకబడిన వర్గాల్లో పనిగట్టుకొని ఇలాంటి భావజాలాన్ని ఎందుకు చొప్పిస్తోంది? లాంటి విషయాల్ని సునిశితంగా పరామర్శించారు నాగటి. ఇంకా ఆలయాల్లో రిజర్వేషన్లూ, ప్రయివేటు విద్యారంగంలో రిజర్వేషన్ల పట్ల అనుచిత వైఖిరీ, మధ్యాహ్న భోజన పథకంలో అగ్రవర్ణ జోక్యం, కులాంతర వివాహాల్లో సామాజిక మార్పు గురించీ శాస్త్రీయ కోణంలో విశ్లేషించారు.
          ఒక గొప్ప సామాజిక మార్పుకోసం, నిరంతర వేదనలో నలిగిపోతున్న బడుగుల పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్న నేపథ్యంలో, ప్రధానంగా రిజర్వేషన్ల పట్లా, ఇంకా ముఖ్యమైన ఇతర సమస్యల పట్లా, ఒక సామాజిక విశ్లేషకుడిగా, విద్యారంగంలో అపారమైన అనుభవజ్ఞులైన నాగటి నారాయణ గారి ఈ విలువైన గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. ముఖ్యంగా రిజర్వేషన్ల గురించి ఏమీ తెలియకుండా అసహనాన్ని వ్యక్తం చేస్తుండే వారూ, 'ప్రతిభ' వ్యష్టి సొంతం అనే అభిప్రాయం కలిగి ఉన్నవారూ ఈ పుస్తకాన్ని మరింత శ్రద్ధగా చదవాలి.

- వి.విజయకుమార్‌, 8555802596

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిల్లలు 'వయస్సు' మీరుతున్నారా..?
ఏడు కాకతీయుల వేడుక
ప్రకృతి వైద్య నిధి వరంగల్‌ గ్రంథాలయం
గెలిపించేవాడు
'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.