Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 17,2022

బాలల సినీ గీతకారుడు డా. సి.నారాయణ రెడ్డి

                పిల్లలూ! 'సినారె' తఖల్లుస్‌తో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న 'మహాకవి' పూర్తి పేరు డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పక్కనే ఉన్న హనుమాజీ పేటలో జులై 29, 1931న పుట్టారు. సింగిరెడ్డి బుచ్చమ్మ-మల్లారెడ్డి సినారె తల్లితండ్రులు. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే 'ఒకనాడు ఒక నక్క, ఒక అడవి లోపల / పొట్టకోసరమెటో పోవుచుండె' పద్యం రాసిన సినారె సినీ కవిగా మూడు వేలకు పైగా సినిమా పాటలు రాశారు. ఎనభై అయిదుకు పైగా కావ్యాలు రాశారు. 1989లో 'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం 'పద్మభూషణ్‌'తో సత్కరించింది. రెండు విశ్వవిద్యాలయాలకు వైస్‌-చాన్స్‌లర్‌గా పనిచేసి 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేయబడ్డారు. 1993 నుండి చివరిశ్వాస వరకు తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షులుగా సేవలందించారు.
                విద్యార్థిగా ఉర్దూలో విద్యాభ్యాసం చేసిన సినారె బాల్యం నుండే తెలుగులో రచనలు చేశారు. తొలి కావ్యం 'నవ్వని పువ్వు' నుండి 'కలం అలిగింది' వరకు చేసిన రచనల్లో పిల్లల కోసం రాసినవి అనేకం ఉన్నాయి. వేలాది సినిమా పాటు రాసిన సినారె సినిమా పాటల్లో బాలల కోసం, బాలల గురించి రెండు వందలకు పైగా గేయాలు రాశారు. బాల్యం నుండే పిల్లలకు సంస్కారాన్ని, విలువలను నేర్పేందుకు డా.దాశరథితో కలిసి పిల్లల కోసం 'బొమ్మల బాల భాగవతం', 'బొమ్మల బాల రామాయణం' రాశారు. పెద్ద పిల్లలకు, పెద్దలకు భాగవత భక్తిసుధను, పోతన పద్యాల మాధుర్యాన్ని అందించేందుకు 'మందార మకరందాలు' పేరుతో పోతన పద్యాలకు వ్యాఖ్యానం రాశారు.
                బాలల కోసం సినారె గేయాలతో పాటు పలు నృత్య, గేయ నాటికలను రాశారు. సినారె రాసిన 'సమతా ఫలం' నాటికను 1953లో తెలంగాణ రచయితల సంఘం, సిరిసిల్ల శాఖ ప్రచురించిన 'చిరుగజ్జెలు' సంకలనంలో అచ్చువేసింది. తరువాత దీనినే ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమి 'తోటతల్లి' పేరుతో ఏడిద కామేశ్వరరావు సంపాదకత్వంలో తెచ్చిన సంకలనంలో చేర్చి ప్రచురింది. ఇందులో రాము, సోము, భీములతో పాటు తోట కూడా ఒక పాత్రే. ఆ పాత్ర ద్వారా మనుషులందరూ సమానమనే మాటను చాటిచెబుతారు సినారె. అంతేకాకుండా తోట భూమాతకు సంకేతంగా కూడా అనుకోవచ్చు. కథలో భూమాత ఫలాల మీద అధికారం నాదే అని భీము విర్రవీగుతాడు. చివరకు తోట చేసిన బోధనలతో పిల్లలంతా ఏకమై భీముని పని బడతారు. అంతా కలిసి సమతాఫల సాధనకోసం ఉద్యమించి భీమునికి గర్వభంగం కలిగిస్తారు. 'భూమాతకు మీరొకరె / పుట్టి పెరిగినారా?/ అందరామె అదరమ్ము / అందుకొనగలేరా?' వంటి చక్కని సంభాషలు, 'పిల్లల్లార రారండి / బిరబిరాన చేరండి / అల్లరి చేయక రండి / ఆనందించగ రండి' అంటూ పిల్లలను ప్రేమించే తోటతల్లి మాటలు ఈ రూపకాన్ని మిక్కిలి రక్తికట్టించాయి.
                తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కలిగించిన కవి నారాయణ రెడ్డి. అంతే కాక తెలంగాణ భాషను సగౌరవంగా పాటల పల్లకిలో ఎక్కించి వెండితెర మీద ఊరేగించారాయన. 'గోగులుపూసే.. గోగులుగాసే ఓ లచ్చ గుమ్మాడి', 'ఓ ఒ జంబియా' వంటి పాటలు అందుకు ఉదాహరణలు. తెలుగు సినిమాల్లో బాలల కోసం, బాలల గురించి, బాలల నేపథ్యంతో అనేక గీతాలు రాశారు సినారె. 1973లో వచ్చిన జీవన తరంగాలు సినిమాలోని 'పుట్టిన రోజు పండుగే అందరికి - మరి / పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ' అనే గీతం దాదాపు అందరం విన్నదే, విని ఆనందించిందే. ఈ కోవలోనే దాదాపు మూడు వందల వరకు బాలల కోసం గీతాలు రాశారాయన. తాతా మనవడు సినిమా 1973లో వచ్చింది, అందులోని 'ఈ నాడే బాబూ నీ పుట్టిన రోజు ఈ యింటికు / ఈ యింటికే కొత్త వెలుగు వచ్చిన రోజు' అనేది గొప్ప గీతమే కాదు, సందేశాత్మకం కూడా. 'చిన్నిబాబు ఎదిగితే కన్నవారి కానందం / నెలవంక పెరిగితె నింగికే ఆనందం' అంటారు ఇందులో కవి.
                'గున్నమామిడీ కొమ్మ మీదా / గూళ్లు రెండున్నాయి / ఒక గూటిలోనా రామచిలకుంది / ఒక గూటిలోన కోయిలుంది', 'ఇది మా దేశం / ఇదే మా దేశం / బాపూజీ కలగన్న దేశం / సమసమాజ నిర్మాణం చేసే / బాల పౌరులు వెలసిన దేశం' వంటివి సినారె బాలల కోసం రాసినవి. లాలిపాటలు, జోలపాటలు కూడా సినారె రాశారు. వాటిలో 'ముద్దుల మా బాబు నిద్దురోతున్నాడు -ఉష్‌ / సద్దు చేశారంటె ఉలికులికి పడతాడు / గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు / మా చిన్ని కృష్ణయ్య లోకానికే వెలుగు' గీతం మిక్కిలి ప్రసిద్ధమే కాక అందరి నాల్కల మీద ఉంది. స్వాతి ముత్యం సినిమాలోని 'లాలీ లాలీ లాలీ / వటపత్రసాయికి వరహాల లాలి / రాజీవనేత్రునికి రతనాల లాలి / మురిపాల కృష్ణునికీ ఆ...' మనకు తెలిసిందే. పైన ప్రస్తావించిన బాల గీతాలే కాక 'చిట్టీ పొట్టీ పాపల్లారా-చెంగుచెంగున రారండి', 'చిన్నారి పాపల్లారా', 'చిన్నారి బాలల్లారా! రారండ్రీ' వంటివి మరికొన్ని ప్రసిద్ద బాలల గేయాలు. జూన్‌ 12, 2017 న మహాకవి డా.సి. నారాయణ రెడ్డి కన్ను మూశారు.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.