Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

పర్యావరణ రక్షణే ధరిత్రీ రక్షణ

         సమస్త జీవకోటికి జీవనాధారం భూమి. సమస్త జీవరాశుల భారాన్ని భూమి మోస్తుంది. మానవ జాతి మనుగడకు ఉపయోగకరమైన భూమి రక్షణ పట్ల పౌరుల్లో (భూమి పరిరక్షణ పై) అవగాహన లేకపోవడం దురదష్టం. భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా కనీసం భూమికి హాని కలిగించకుండా ఉంటే చాలు అన్న సామాజిక స్పహ పౌర సమాజంలో పెరగాలి. భూమి పరిరక్షణ ద్వారా సహజ వనరుల ఉపయోగం జరిగి మానవాళి మనుగడకు కావాల్సిన అవసరాలు ఆహారం, ఆర్థిక అవసరాలు తీరి ఆర్థికాభివద్ధి జరిగే అవకాశం ఉంటుంది. దీనిని దష్టిలో పెట్టుకుని పర్యావరణంతో పాటు ప్రకతి వనరైన భూమిని రక్షించుకోవడానికి పౌర సమాజం ఉద్యమించాలి.
పర్యావరణ రక్షణ భూమి సంరక్షణ వన్య ప్రాణుల రక్షణ పరస్పర ఆధారిత ప్రభావితాంశాలు. పర్యావరణం ధరిత్రీ రక్షణ ఏక కాలంలో చేదోడువాదోడుగా జరగాలి.
ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చి భూపరిరక్షణపై అవగాహనకోసం తొలి ధరిత్రీ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే కార్యక్రమం 1970 ఏప్రిల్‌ 22న జరిగింది. నాటి నుండి ప్రతి ఏటా ఏప్రిల్‌ 22 నాడు ''ధరిత్రీ దినోత్సవాన్ని'' జరుపడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆధునీకరణ సాంకేతిక ఉత్పత్తి విధానాలు పారిశ్రామికీకరణ వల్ల ధరిత్రీ పైన ఉష్ణోగ్రత పెరిగి వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యానికి సవాల్‌గా పరిణమించింది. పర్యావరణ పరిరక్షణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు వాతావరణం కాలుష్య నివారణ మొదలగు అంశాలను దష్టిలో పెట్టుకొని అమెరికన్‌ సెనటర్‌ గెరాల్డ్‌ నెల్సన్‌ ''ఏర్త్‌ డే'' కు రూపకల్పన చేశారు.
భూమి మీద రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. ప్రకతి సిద్ధమైన సరస్సులు చెరువులు కుంటలు జలపాతాల విద్వంసం పెరిగిపోయింది. శీఘ్రంగా పెరుగుతున్న పట్టణీకరణ వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న కొన్ని రకాల ఎరువులు పురుగు మందులు భూమి సారాన్ని కీణింప చేయడం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోవడం భూమి కోతకు గురికావడం బీడు భూములుగా మారడం విచారకరం.
వాతావరణం కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయి. గత కొన్ని లక్షల సంవత్సరాల భూమి చరిత్రలో ఇప్పుడు నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలే అధికంగా ఉన్నాయి.
420 కోట్ల సంవత్సరాల భూగోళం గత 300 సంవత్సరాలలో గుడ్డిగా అభివద్ధి పేరుతో చేసిన భీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాలలో బూడిద కాబోతుంది. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి అంతరించే ప్రమాదం వుంది అని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి.
2100 కల్లా భూమి మీద మానవుడు బతికి బట్ట కట్టలేని దుస్థితి వస్తుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.
మానవులు పరిశ్రమలు చేసే కాలుష్యం వల్ల గోల్బల్‌ వార్మింగ్‌ (భూతాపం) పెరుగుతుంది. సమస్త భూగోళం వినాశం దిశగా అడుగులు వేస్తోంది.
మన వారసులకు సిరి సంపదలు ఇచ్చే భూమిని కాకుండా అహల్లాదకరమైన వాతావరణం కాకుండా కాలుష్యాన్ని వారసత్వ ఆస్తిగా ఇవ్వబోతున్న దుస్థితి నెలకొనడం శోచనీయం. భారతీయులకు భూమికి అవినాభావ సంబంధం వుంది. భారతీయులు భూమిని తల్లిగా ఆరాధిస్తారు. భూమి కలిగి వుండడం సామాజిక హౌదాగా భావిస్తారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే ఈ అనుబంధం కాస్త ఎక్కువనే చెప్పాలి.
మన సంస్కతి భూ రక్షణ మీద ఆధారపడి ఉంది. భూమిని దేవతగా ఆరాధిస్తారు. పర్యావరణ పరిరక్షణ ప్రకతి రక్షణే లక్ష్యంగా సమగ్ర ధరిత్రీ రక్షణ విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. అందుకు దోహదపడే చర్యలు చేపట్టాలి. ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చెయ్యాలి. ప్రతి వ్యక్తి రోజు వారి అలవాట్లలో కార్యక్రమాల్లో కొన్నిటిని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
- బయటికి వెళ్లేందుకు కారును కాకుండా నడిచి వెళ్లడం లేదా సైకిల్‌ బైక్‌ రైడింగ్‌ ఎంచుకోవాలి.
- మాంసాహారానికి దూరంగా ఉండి తద్వారా కార్బన్‌ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించండి.
- పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించండి. ఎచెత్తను ఏప్పటికప్పుడు తొలగించండి
- పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్‌ బాటిల్స్‌ బ్యాగ్స్‌లనే ఉపయోగించండి.
- అవసరం లేనప్పుడు విద్యుత్‌ బల్బులను ఉపయోగించవద్దు.
- బిల్లులను తీసుకోవడం చెల్లించడం ఆన్‌లైన్‌లో చేయండి.
- స్థానిక మార్కెట్లోనే షాపింగ్‌ చేయండి స్థానికంగా దొరికే స్వదేశీ వస్తువులు ఆహారాన్ని వినియోగించండి
- సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్‌ అవకాశం ఉన్న వస్తువులను ఉపయోగించండి
- డిస్పోజెబుల్‌ ప్యాకేజీలకు దూరంగా ఉండండి.
- భూరక్షణ సంరక్షణ పాటశాల కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టీ ధరిత్రీ రక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన చైతన్యం కలిగించాలి. చుట్టుపక్కల పరిసరాలు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం, పచ్చదనం పరిశుభ్రత ''స్వచ్ఛభారత్‌'' హరిత వనాల పెంపకం సామాజిక అడవుల పెంపకం ఉద్యమంగా సాగాలి.
- భూమి సహజత్వాన్ని రక్షించే ప్రకతి వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాలను అమలు చెయ్యాలి. మానవాళి పురోగమనానికి ప్రగతికి తోడ్పాడాలి.
- ధరిత్రీ రక్షణలో పౌరసమాజం యువత స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాలు దరిత్రీరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించాలి. సమాజంలో ధరిత్రీ రక్షణ స్పహను స్ఫూర్తిని పెంచాలి.
''రండి మన భూమిని కాపాడుకుందాం'' భూమికి ప్రత్యామ్నాయం లేదు.

- నేదునూరి కనకయ్య,
  9440245771

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.