Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తల లేని తోక! | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Apr 24,2022

తల లేని తోక!

వండుకోవడానికి భేషుగ్గా మండేదీ, నరుక్కోవడానికి తేలిగ్గా ఉండేదీ అయిన చెట్టు కోసం వెదికి పట్టుకున్నాడు చేతిలో గొడ్డలి ఉన్నవాడు.
మరణ శిక్షను అమలు జరుపుకోవచ్చు అంటూ తల వంచుకు నిలబడ్డది చెట్టు. చెట్టు మొదట్లో గొడ్డలి గాటు పెట్టేడు మనిషి.
బుస్సుమన్న చప్పుడు వినిపించి గొడ్డలి జారవిడిచి అడుగు వెనక్కి వేశాడు మనిషి. ఎక్కడ్నించి అక్కడికి వచ్చిందో అక్కడే ఎంత సేపట్నించీ వెయిట్‌ చేస్తూ ఉండో కాని పాము ఒకటి పడగెత్తి బుసకొట్టింది. బుసకొడుతూ పడగెత్తింది. అడుగు వెనక్కి వేసిన మనిషి జారవిడిచిన గొడ్డలి అందుకున్నాడు. 'తొందరపడకు అడుగు కదపకు' అన్నది పాము. 'నేను మామూలు కట్టెలు కొట్టే వాణ్ణికాను' అన్నాడు మనిషి.
'అనుకున్నాను ముఖం చూసి. నీ పేరేమిటి?' అన్నది పాము.
'నన్ను సత్యవంతుడంటారు. రాచపుట్టుక పుట్టిన వాణ్ణి' అన్నాడు సత్యవంతుడు.
'అయితే నేను వచ్చింది నీ కోసమే. నిన్ను మృత్యువుకి అప్పగించే పని మీద వచ్చాను' అన్నది పాము.
'నువ్వు నన్ను కాటేసేలోపు నేను నిన్ను రెండు ముక్కలు చెయ్యగలను' అన్నాడు సత్యవంతుడు.
'నేను మామూలు పాముని కాదు. నీ మృత్యుపాశాన్ని నా వెనకే నీ పంచప్రాణాల్ని 'ప్యాక్‌' చేసుకుపోవడానికి మృత్యువు సిద్ధంగా ఉన్నాడు' అన్నది పాము.
పాము అన్నట్టుగానే దాని వెనక నల్లటి నీడ కనిపించింది. చిక్కటి చీకటిలాంటి ఆ నీడను చూడగానే వంట్లో వణుకు పుట్టుకొచ్చింది సత్యవంతుడికి. 'అంత ప్రాణభయం ఎందుకు. ఎవడైనా చావడానికే కదా పుడతాడు' అంది పాము.
'మృత్యువును చూసి భయపడని వాడు ఉండడు. ఒకసారి చూశాక యిక భయం ఉండదు. నాకూ భయం లేదిప్పుడు కానీ అటు చూడు నా భార్య పరుగెత్తుకు వస్తున్నది' అన్నాడు సత్యవంతుడు.
'ఆమె వస్తే మాకేం? మా పని మేం చేసుకుపోతాం' అన్నది పాము.
'ఆమె సంగతి మీకు తెలీదు. నన్ను తీసుకుపోనీదు' అన్నాడు సత్యవంతుడు.
'టీవీలో సీరియళ్ళు చూసి వచ్చేసరికి ఆలస్యమైంది. మళ్ళీ సీరియళ్ళ టైముకు వెళ్ళిపోవాలి. తెచ్చింది తిని కదలండి' అంది ఆమె.
ఎంత గుండె ధైర్యం ఇక్కడ నేనూ మృత్యువూ నించున్నా మొగుడు ఒక్కడే ఉన్నాడు అన్నట్టు మాటాడుతోంది' అనుకున్న పాము 'డ్యూటీ ఫస్ట్‌' అనుకుని సత్యవంతుడ్ని కాటేసింది.
దబ్బుమని నేలమీద పడిపోతున్న సత్యవంతుడి తల వళ్ళో పెట్టుకుని భార్య పాముని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది.
'ఊరికే నోరు నొప్పి పుట్టేట్టు ఏం అరుస్తావు. కానీ నీ 'హబ్బీ' ప్రాణాలు కవర్‌లో పెట్టుకుపోనీ!' అన్నాడు మృత్యువు. 'నేనెవరో నీకు తెలీదు. సీరియళ్ళ సావిత్రి అంటే చెబుతారులే. నాతో పరాచికాలు వద్దు. నేను నా మొగుడి ప్రాణాల్ని టీవీ సీరియళ్ళనీ వదులుకోలేను. నువ్వు పో ఇక్కడ్నించి' అంది సావిత్రి.
ఈమెతో ఆర్గ్యుమెంటు లాభం లేదని సత్యవంతుడి ప్రాణాలు కవర్‌లో పెట్టుకుని బయల్దేరాడు మృత్యువు, నీడలా.
సావిత్రి నీడలాంటి మృత్యువును ఫాలో అయింది నీడలా. నీడనే నీడలా వెంటాడుతున్న సావిత్రిని వొదిలించుకుందుకు ఏదో ఓటి చెయ్యక తప్పదనిపించింది మృత్యువుకి.
ఎన్నో ఏళ్ళనుంచి సీరియళ్ళు చూసి చూసి కళ్ళు అపుపడకుండా పాయిన ఆమె అత్తమామలకు సీరియళ్ళు స్పష్టంగా కనిపించడానికి నేత్రదానం చేశాడు మృత్యువుడు. మధ్య మధ్య రిపేర్ల కారణంగా టీవీ సీరియళ్ళు మిస్సవుతున్న ఆమె జననీ జనకులకు అసలు రిపేరు రానటువంటి టీవీ ఒకటి ప్రదానం చేసేడు మృత్యువుడు.
అయినా తృప్తిపడక అయిపోని సీరియల్‌లా వెంటపడింది సావిత్రి.
మొగుళ్ళ మీద పగబట్టే పెళ్ళాల్ని కోడళ్ళ మీద పగబట్టే అత్తల్ని అక్కల మీద పగబట్టే చెల్లెళ్ళని, భార్య ఉండగానే భర్త కొంపలో దూరే ఆడాళ్ళను, రౌడీలను మెయిన్‌టైన్‌ చేసే ఆడ విలన్లను చూసే ఖర్మ తప్పిందని సత్యవంతుడు ప్రాణాలకు మృత్యువు పాకెట్లో సంతోషించే అవకాశం పోయింది.
సకుటుంబ సమేతంగా ఇప్పుడు టీవీలో వస్తున్న వో సీరియల్ని సావిత్రి భర్తతో ముగింపు వరకూ చూసే వరర యిచ్చి నాలుక్కరుచుకున్నాడు మృత్యువు.
సత్యవంతుడి ప్రాణాల పాకెట్‌ను పట్టుకుని వెనక్కి వచ్చేసింది సీరియళ్ళ సావిత్రి.
ఫలానా సీరియల్‌ ముగింపును వరంగా కోరుకున్నదంటే భర్త సత్యవంతుడు నూటపాతికేళ్ళు ఆపైనా గ్యారంటీగా బికే ఛాన్సన్నమాట అనుకుని టీవీ ఆన్‌ చేస్తూ నవ్వుకుంది సావిత్రి.

-చింతపట్ల సుదర్శన్‌,
 9299809212

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
అమ్మకు ఓ బహుమతి
ఒట్టు... నీ మీద ఒట్టు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.