Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమ్మకు ఓ బహుమతి | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • May 08,2022

అమ్మకు ఓ బహుమతి

           అంతులేని అనురాగం అమ్మ. అలుపెరగని ఓరిమి అమ్మ. భువిలో వెలసిన దేవత అమ్మ. మాలిన్యం లేని మనసున్న అమ్మ. ప్రాణాలకు తెగించి పురిటినొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చి పునర్జన్మను పొందుతుంది. బిడ్డకు తొలి గురువు అమ్మ. తొలి స్నేహితురాలు అమ్మ. మాట, బాట, నడక, నడత నేర్పుతుంది అమ్మ. గురువు మార్గదర్శకుడు, శ్రేయోభిలాషి అన్నీ అమ్మే అవుతుంది. గోరుముద్దలు తినిపించి కొండంత ఎదగాలని ఆశిస్తుంది అమ్మ. సమాజంలోని మంచి చెడులను విశ్లేషించి చూపుతుంది. ధైర్యం సాహసాలు రంగరించి ఉగ్గు పాలలోనే తాగిస్తుంది అమ్మ. అమ్మ ప్రేమ ఉన్నతం, అమ్మ ప్రేమ అద్భుతం, అపూర్వం.
           మాతృమూర్తులను దైవంగా భావించి పూజించే సాంప్రదాయం భారతదేశంలో ఉన్నప్పటికీ విదేశీ ప్రభావం ఎక్కువగా పడుతున్నది. ఫలితంగానే భారతీయ యువత కూడా మాతృ దినోత్సవాలపై మక్కువ పెంచుకుంటున్నది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు కొద్దిగా పెరగగానే స్వతంత్రంగా బతకడం ఆరంభిస్తారు. ఆ క్రమంలో తల్లి ప్రేమను, త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక రోజును ఎన్నుకున్నారు. అందుకే మాతృదినోత్సవాలు ఏర్పడ్డాయి.
అమెరికాలో బాలియావర్డ్‌ హోవే అనే మహిళ ప్రపంచ శాంతి కోసం తొలిసారిగా మాతృదినోత్సవాలు జరపాలని నిశ్చయించింది. 1872లో బోస్టన్‌లో సమావేశాలు కూడా నిర్వహించింది. అలాగే అన్నామేరీ జెర్విన్‌ అనే మహిళ 'మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే' లను ఏర్పాటు చేసింది. ఆమె సివిల్‌ వార్‌ గాయాల తాలూకు జ్ఞాపకాలను చెదరగొట్టేందుకు ఇలాంటి దినోత్సవాలను నిర్వహించింది. ఆ తర్వాత మేరీ బెర్విన్‌ కూతురైన మిస్‌జెర్విన్‌ మాతృదినోత్సవాలను ప్రోత్సహించింది. అంతేకాకుండా తన తల్లి రెండవ వర్థంతి నాడు మాతృ దినోత్సవాన్ని నిర్వహించింది. ఆ రోజు మే నెలలోని రెండవ ఆదివారం అయింది. 1910వ సంవత్సరంలో వర్జీనియా రాష్ట్రంలో తొలిసారిగా మాతృదినోత్సవాన్ని జరిపారు. ఆ తర్వాత 1911వ సంవత్సరం నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. ఇదంతా మిస్‌ జెర్విన్‌ విపరీతంగా చేసిన ప్రచారం మూలంగా జరిగింది. ఆ తర్వాతి కాలలో అమెరికా అధ్యక్షుడు 'ఉడ్రోవిల్సన్‌' మాతృదినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయించాడు. దాంతో 1914 నుండి మాతృదినోత్సవం అధికారికంగా జరుగుతున్నది. అంతేకాక ఆ రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరుగుతున్నది. అంతేకాక ఆ రోజు సెలవుగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలూ పాటించడం మొదలుపెట్టాయి.
ప్రపంచంలోని దాదాపు నలభై దేశాలు తల్లుల గౌరవార్థంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో రెండవ ఆదివారాన్ని మాతృదినంగా జరుపుకుంటున్నారు. మొదటి సారి గ్రీస్‌ దేశంలో ఈ దినోత్సవం నిర్వహించారు. 'మథర్‌ ఆఫ్‌ గాడ్స్‌' అని పిలుచుకునే రియా దేవతకు నివాళిగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఇంగ్లండ్‌లో 17వ శతాబ్దంలో మాతృ మూర్తుల్ని గౌరవించే క్రమంలో 'మదరింగ్‌ సండే' పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు.
అమ్మ ప్రాణాలకు వెరవకుండా బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్ళలో బిడ్డను చూసీ చూడగానే పురిటి నొప్పులన్నీ మరిచిపోతుంది. బిడ్డ ఎందుకేడుస్తుందో తల్లికి మాత్రమే తెలుసు. బాధతో ఏడుస్తుందో, ఆకలితో ఏడుస్తుందో, ఏదైనా చీమ కుట్టి ఏడుస్తుందో తల్లి మాత్రమే చెప్పగలుగుతుంది. తన శరీరం నుంచి బయటపడ్డ శిశువును, తాను మరణించేంత వరకూ బిడ్డను ప్రేమించేది తల్లి మాత్రమే. అటువంటి త్యాగమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కనీసం ఆమె బతికి ఉన్నంత వరకూ కడుపునిండా తిండి కూడా పెట్టడం లేదు.
భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓల్డేజ్‌ హోంలలో ఎందరో మాతృమూర్తులు ఉంటున్నారు. ఏమీ తెలియని వయసులో మల మూత్రాదులు ఎత్తిపోసి, తన నెత్తురును పాలధారగా మార్చి బిడ్డల కడుపు నింపేది అమ్మ. అమ్మను ఉన్నత శిఖరాలకై విదేశాలకు పోతున్నామంటూ వృద్ధాశ్రమాల్లో సునాయాసంగా చేర్చేస్తున్నారు. అదేమంటే మేమే కదా డబ్బులు కడుతున్నాం అంటూ, సమాధానమిస్తున్నారు. మరికొంతమంది అన్నం కూడా పెట్టక ఏడిపిస్తున్నారు. దీనిని ఒక కవి ఎంతో చక్కగా రాశారు. ''చిన్నప్పుడు అన్నం తినక ఏడిపించాడు... పెద్దప్పుడు అన్నం పెట్టక ఏడిపిస్తున్నాడు''
కుటుంబానికి కేంద్ర బిందువు అయిన అమ్మ పిల్లల కోసం తన భవిష్యత్తునే త్యాగం చేస్తుంది. సంసార నావను నడిపించడమంటే సముద్రాన్ని ఈదడం కన్నా కష్టం అని భావిస్తారు. అటువంటి కుటుంబాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తొణకక బెణకక లాక్కొచ్చేది అమ్మ మాత్రమే. మన కోసం అనంతమైన ప్రమనూ, అపూర్వమైన త్యాగాన్ని ఇచ్చిన అమ్మకు మనం మాతృదినోత్సవ బహుమతిగా వృద్ధాశ్రమాల్లో చేర్చవద్దని ప్రతినబూనుదాం. అదే మనం అమ్మకు ఇచ్చే అద్భుత బహుమతి. మనలోనే ఉంచుకుని ఆమె అనుభవాలను తెలుసుకుంటూ మన బిడ్డలకు నానమ్మల అమ్మమ్మల ప్రేమ అందిద్దాం.

- డా|| కందేపి రాణీప్రసాద్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'ప్రబొధ గీతాల' కొక్కొరోకో (సంకలనం)
ఆనాటి సమాజం మీద ఆత్మార్పణ వీరుల ప్రభావం
50 యేళ్ళ క్రితం నేనో పెద్ద తప్పు చేశాను
భువి స్వ‌ర్గం మేఘాల‌య‌
వితంతు వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అన్యాయం ఎక్‌ చాదర్‌ మైలీ సీ
వస్తే - ఇస్తా
పోటీ పరీక్షలకు సమాయాత్తమవ్వడమెలా..?
దుంప‌ల‌తో గంపెడు లాభాలు
బాల్యం- సమస్యల వలయం
బేతి రెడ్డి గ్రంథాలయం-పిల్లలమర్రి
బుక్‌ ఫెయిర్‌ ఒక ఉద్వేగం...
అడవి తల్లి ఒడిలో ఉద్యమాల తల్లి మల్లు స్వరాజ్యం
అద్భుత ఊహాకాల్పనిక వైచిత్రి 'నీటినీడ' కథా సంపుటి
యల్లాప్రగడ సీతాకుమారి
మట్టిదిబ్బ కింద మహా దేవాలయం గొంగులూరు గుడి కథ
ఘనమైన చరిత్రకు సాక్ష్యం సంస్థాన్‌ నారాయణపురం
దూమపానం - నోటి క్యాన్సర్లు
స్మార్ట్‌ఫోన్‌లతో బాలలు దారి తప్పవద్దు
పెదకొండూరులో కాకతీయులనాటి మల్లు బాలమ్మ దాన శాసనం
జీవ వైవిధ్యం - మానవ మనుగడ
తన శరీరాన్ని వ్యాపార సరుకుగా మార్చిన సమాజంపై న్యాయపోరాటం చేసిన 'లక్ష్మి'
విద్యార్థి గేయకర్త సేనాపతి భాష్యకాచార్యులు
పేదల పెన్నిధి, పోరాట కవి కాళోజీ రామేశ్వరరావు
మరణాన్ని సైతం కవిత్వం చేస్తాన్నేను
పిల్లలను అలరించిన వేసవి శిబిరం
కూలుతున్న కుటుంబాలు
బొమ్మలరామారంలో కొత్తరాతిబొమ్మల తావు
వేగు చుక్కల వెలుగు తార ఇరివెంటి కృష్ణమూర్తి
ఒట్టు... నీ మీద ఒట్టు
కూతురుగా పుట్టి కొడుకుగా భాద్యతలు నెరవేర్చిన ఆర్తి కథ ఆమా

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.