Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్వార్టర్స్‌లో స్వైటెక్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

క్వార్టర్స్‌లో స్వైటెక్‌

- ప్రీ క్వార్టర్స్‌లో గట్టెక్కిన సిట్సిపాస్‌
- ఎదురులేని మెద్వదేవ్‌, సిన్నర్‌
- ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
   మెల్‌బోర్న్‌లో యువ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వదేవ్‌ అలవోక విజయంతో క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపగా.. గ్రీసు వీరుడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చెమటోడ్చి ప్రీ క్వార్టర్‌ఫైనల్లో గట్టెక్కాడు. మహిళల సింగిల్స్‌లోనూ స్టార్‌ క్రీడాకారిణులు జోరు చూపిస్తున్నారు. రెండో సీడ్‌ ఆర్యనా సబలెంకకు కానేపి షాక్‌ ఇచ్చింది. ఏడో సీడ్‌ ఇగా స్వైటెక్‌ అదిరే ఆటతో క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది.
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
గ్రీసు వీరుడు, యువ క్రీడాకారుడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో చెమటోడ్చాడు. 20వ సీడ్‌ అమెరికా ఆటగాడితో ఐదు సెట్ల పోరులో పైచేయి సాధించింది. అతి కష్టంపై పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ ఫేవరేట్‌, రెండో సీడ్‌ రష్యన్‌ స్టార్‌ డానిస్‌ మెద్వదేవ్‌ తన జోరు చూపించాడు. అమెరికా ఆటగాడిపై వరుస సెట్లలో మెద్వదేవ్‌ అలవోక విజయం నమోదు చేశాడు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌, కానేపి, కార్నెట్‌ సహా కొలిన్స్‌లు క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నేటి నుంచి క్వార్టర్‌ఫైనల్‌ సమరాలు షురూ కానున్నాయి. మహిళల సింగిల్స్‌ విభాగంలో మడిసన్‌ కీస్‌, క్రిజికోవాలు తొలి క్వార్టర్స్‌లో.. వరల్డ్‌ నం.1 యాష్లె బార్టీ, పెగులా రెండో క్వార్టర్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో షపలోవ్‌, రఫెల్‌ నాదల్‌లు తొలి క్వార్టర్స్‌లో ఢ కొట్టనుండగా.. మోన్‌ఫిల్స్‌, బెరాటినిలు రెండో క్వార్టర్స్‌లో సమరానికి సై అంటున్నారు.
ఎదురులేని మెద్వదేవ్‌ : పురుషుల సింగిల్స్‌ సర్క్యూట్‌లో అత్యంత వేగంగా దూసుకొస్తున్న స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌. అగ్ర క్రీడాకారులకు సవాల్‌ విసురుతున్న డానిల్‌ మెద్వదేవ్‌ (రష్యా) గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటలో తనదైన దూకుడు చూపిస్తున్నాడు. అమెరికా ఆటగాడు మాక్సిమె క్రిస్సెపై 6-2, 7-6(7-4), 6-7(4-7), 7-5తో మెద్వదేవ్‌ విజయం సాధించాడు. తొలి సెట్‌ను సులువుగా సొంతం చేసుకున్న మెద్వదేవ్‌.. రెండో సెట్‌ కోసం టైబ్రేకర్‌ వరకు పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన మెద్వదేవ్‌.. తర్వాతి సెట్‌లోనే క్వార్టర్స్‌ బెర్త్‌ బుక్‌ చేసుకున్నాడు. 7-5తో క్రిస్సేపై తిరుగులేని పైచేయి సాధించాడు. 15 ఏస్‌లు సంధించిన మెద్వదేవ్‌ మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. 18 డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడిన క్రిస్సీ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. పాయింట్ల పరంగా 156-138తో, గేముల పరంగా 26-20తో మెద్వదేవ్‌ ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపించాడు. యువ ఆటగాడు, గ్రీసు స్టార్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ ప్రీ క్వార్టర్స్‌లో చెమటోడ్చాడు. 20వ సీడ్‌ అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోగొట్టుకున్నాడు. 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో సిట్సిపాస్‌ ఐదు సెట్ల పోరులో గట్టెక్కాడు. టేలర్‌ 13 ఏస్‌లు కొట్టగా, సిట్సిపాస్‌ 19 ఏస్‌లు సంధించాడు. టేలర్‌ 4 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా.. సిట్సిపాస్‌ ఒక్కదానితోనే సరిపెట్టాడు. సిట్సిపాస్‌ మూడు బ్రేక్‌ పాయింట్లతో మ్యాచ్‌ను వశం చేసుకోగా.. టేలర్‌ రెండు పాయింట్లు సాధించాడు. సిట్సిపాస్‌ 151 పాయింట్లు గెల్చుకోగా, టేలర్‌ 144 పాయింట్లు సాధించాడు. స్వీయ సర్వ్‌లో 110 పాయింట్లు సాధించిన సిట్సిపాస్‌ ప్రత్యర్థి సర్వ్‌ను మూడు సార్లు బ్రేక్‌ చేశాడు. 11వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) వరుస సెట్లలో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌పై పైచేయి సాధించాడు. 7-6(7-3), 6-3, 6-4తో సిన్నర్‌ వరుస సెట్లలో సత్తా చాటాడు. 9 ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో చెలరేగాడు. మరో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో మారిన్‌ సిలిచ్‌కు (క్రోయేషియా) పరాభవం తప్పలేదు. కెనడా ఆటగాడు ఫెలిక్స్‌ ఆగర్‌ అలిసిమె 2-6, 7-6(9-7), 6-2, 7-6(7-4)తో సిలిచ్‌పై గెలుపొందాడు.
స్వైటెక్‌ జోరు : ఏడో సీడ్‌ పొలాండ్‌ భామ ఇగా స్వైటెక్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 7-5, 3-6, 3-6తో సోరాన సిర్సిటీ పరాజయం పాలైంది. రెండు ఏస్‌లతో మెరిసిన స్వైటెక్‌ ఏకంగా ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. 105-95తో పాయింట్ల పరంగా, 17-13తో గేముల పరంగా ప్రత్యర్ధిపై స్వైటెక్‌ పైచేయి సాధించింది. బెలారస్‌ భామ సబలెంకాకు ప్రీ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అన్‌సీడెడ్‌ కానేపి చేతిలో మూడు సెట్ల పోరులో సబలెంకా చేతులెత్తేసింది. 7-5, 2-6, 6-7(7-10)తో సబలెంకా పరాజయం పాలైంది. సబలెంక మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించగా, కానేపి నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరిసింది. 14వ సీడ్‌ సిమోన హలెప్‌ (రోమానియా)కు సైతం పరాజయం తప్పలేదు. అన్‌సీడెడ్‌ అలిజె కార్నెట్‌ చేతిలో హలెప్‌ ఓటమి చెందింది. 4-6, 6-3, 4-6తో కార్నెట్‌కు క్వార్టర్‌ఫైనల్స్‌ బెర్త్‌ కోల్పోయింది. 27వ సీడ్‌ అమెరికా అమ్మాయి డానిల్లె కొలిన్స్‌ 4-6, 6-4, 6-4తో ఎలిసె మార్టెన్స్‌పై గెలుపొందింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.