Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హెచ్‌ఎఫ్‌సీ గెలుపు జోరు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 28,2022

హెచ్‌ఎఫ్‌సీ గెలుపు జోరు

- 3- 2 తేడాతో ఒడిశాపై విజయం
గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(హెచ్‌ఎఫ్‌సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బరిలోకి దిగిన హెచ్‌ఎఫ్‌సీ.. ఒడిశా ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఓఎఫ్‌సీ)పై విజయకేతనం ఎగురవేసింది. గురువారం తిలక్‌మైదానం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎఫ్‌సీ 3-2 తేడాతో ఓఎఫ్‌సీపై విజయం సాధించింది. దీంతో 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 23 పాయింట్లతో హెచ్‌ఎఫ్‌సీ తమ అగ్రస్ధానాన్ని మరింత పటిష్ఠం చేసుకోగా, ఒడిశా 17 పాయింట్లతో ఏడో స్ధానంలో నిలిచింది. మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున జోయల్‌(51ని), జావో విక్టర్‌(70ని), ఆకాశ్‌ మిశ్రా(73ని) గోల్స్‌ చేశారు. మరోవైపు ఒడిశా జట్టులో జెర్రీ(45ని), జొనథాస్‌(84ని) గోల్స్‌ అందించారు.
ఆది నుంచే హౌరాహౌరీగా:
   ఐఎస్‌ఎల్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది. టాప్‌-4లో సుస్ధిర స్థానమే లక్ష్యంగా రెండు జట్లు ఆది నుంచే హౌరాహౌరీగా తలపడ్డాయి. ఆట మొదలైన మొదటి నిమిషం నుంచే హైదరాబాద్‌, ఒడిశా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాయి. మ్యాచ్‌ మొదలైన ఎనిమిదో నిమిషంలో బంతిని అందిపుచ్చుకున్న అనికేత్‌ జాదవ్‌..డీబాక్స్‌లో దూకుడుగా దూసుకెల్లినా గోల్‌ సాధ్యపడలేదు. రెండు నిమిషాల తేడాతో సౌవిక్‌ చక్రవర్తి యెల్లో కార్డ్‌కు గురయ్యాడు. ప్రత్యర్థి ప్లేయర్‌ లిరిడాన్‌ను దురుసుగా అడ్డుకోవడంతో సౌవిక్‌..రిఫరీ మందలింపునకు గురయ్యాడు. రెండు జట్లు ఒకరి గోల్‌పోస్ట్‌పై ఒకరు మెరుపు దాడులకు పూనుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు హెచ్‌ఎఫ్‌సీ, ఒడిశా ప్రయత్నించాయి. ఈ క్రమంలో తమ వ్యుహాలకు మరింత పదును పెట్టాయి. ప్రథమార్థం ఇక మరికొద్ది సేపట్లో ముగుస్తుందన్న తరుణంలో ఒడిశా గోల్‌తో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హెచ్‌ఎఫ్‌సీ గోల్‌కీపర్‌ కట్టిమణి తప్పిదాన్ని అనుకూలంగా మలుచుకుంటూ ఓఎఫ్‌సీ ప్లేయర్‌ జెర్రీ గోల్‌ కొట్టాడు. బంతిని తమ ఆధీనంలో ఉంచుకునే విషయంలో సమవుజ్జీలుగా వ్యవహరించిన హెచ్‌ఎఫ్‌సీ, ఒడిశా కీలకమైన ద్వితీయార్థంలో మరింత జోరు పెంచాయి.
హెచ్‌ఎఫ్‌సీ ట్రిపుల్‌:
   ద్వితీయార్థంలో హెచ్‌ఎఫ్‌సీకి మొదట్లోనే అద్రుష్టం కలిసి వచ్చింది. మ్యాచ్‌ మొదలైన కొద్ది సేపటికే జోయల్‌ చియానిస్‌ గోల్‌ కొట్టడంతో హెచ్‌ఎఫ్‌సీ గోల్‌ సంబురాల్లో మునిగి పోయింది. ఒడిశా డిఫెన్స్‌ లోపాలను ఎత్తిచూపుతూ జోయల్‌ కొట్టిన గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఈ క్రమంలో గోల్స్‌ సంఖ్యను పెంచుకునేందుకు హెచ్‌ఎఫ్‌సీ ఇద్దరు ప్లేయర్లను మార్చింది. 62వ నిమిషంలో పెనాల్టీ అవకాశం కోసం హెచ్‌ఎఫ్‌సీ రిఫరీకి అప్పీల్‌ చేసినా..లాభం లేకపోయింది. అయినా వెనుకకు తగ్గని హెచ్‌ఎఫ్‌సీకి 70వ నిమిషంలో లక్‌ మళ్లీ కలిసి వచ్చింది. అశిష్‌ రారు నుంచి బంతి అందుకున్న జావో విక్టర్‌ కండ్లు చెదిరే రీతిలో గోల్‌ కొట్టడంతో హైదరాబాద్‌ ఆధిక్యం 2-1కు చేరింది. అయితే మరో మూడు నిమిషాల తేడాతో హెచ్‌ఎఫ్‌సీ మరో గోల్‌ ఖాతాలో వేసుకుంది. యాసిర్‌ అహ్మద్‌ అందించిన పాస్‌ను అకాశ్‌ మిశ్రా గోల్‌ కొట్టడంతో ఆధిక్యం 3-1కు చేరింది. దీంతో అప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన ఒడిశా..తిరిగి పుంచుకునేందుకు ప్రయత్నించింది. మ్యాచ్‌ 84వ నిమిషంలో జొనథాస్‌ గోల్‌ చేయడంతో ఒడిశా ఖాతాలో మరో గోల్‌ చేరింది. ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు ఒడిశా ప్రయత్నించినా లాభం లేకపోయింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
సెమీస్‌లో సింధు ఓటమి
ప్రజ్ఞానంద సంచలనం
భగత్‌, ఢిల్లాన్‌కు బంగారు పతకాలు
అశ్విన్‌ అదరగొట్టాడు
ఒలింపిక్‌ స్వర్ణమే లక్ష్యం!
మహిమ ముగియలేదు!
సెమీస్‌లో సింధు
నిఖత్‌ చారిత్రక పంచ్‌
క్వార్టర్స్‌లో సింధు
కదం తొక్కిన కోహ్లి
ఆర్చర్‌కు మరో గాయం
సిద్దూకి ఏడాది జైలు

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.