Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తొలి అడుగు పడేదెవరిదో? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 24,2022

తొలి అడుగు పడేదెవరిదో?

            ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 15వ సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. లీగ్‌ దశ మ్యాచులు ఆదివారంతో ముగియగా.. మంగళవారం నుంచి నాకౌట్‌కు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫైనల్లో చోటు కోసం నేడు క్వాలిఫయర్‌1లో తలపడనున్నాయి. తొలి ఐపీఎల్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. తొలి ఐపీఎల్‌ అనంతరం తొలిసారి రాజస్థాన్‌ రాయల్స్‌ టాప్‌-2లో చోటు సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను ఎత్తుకుపోవాలని గుజరాత్‌ సంకల్పించగా.. తొలి ఐపీఎల్‌ తర్వాత తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడాలనే ఉబలాటం రాజస్థాన్‌లో కనిపిస్తోంది. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌ 1 సమరం నేడు.
- ఫైనల్లో చోటు కోసం టైటాన్స్‌, రాయల్స్‌ ఢ
- గుజరాత్‌, రాజస్థాన్‌ క్వాలిఫయర్‌ పోరు నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
నవతెలంగాణ-కోల్‌కత
             ఐపీఎల్‌ 2022 అంచనాలకు భిన్నంగా సాగింది. పది జట్ల ఐపీఎల్‌పై అభిమానులతో పాటు క్రికెట్‌ పండితులకు సైతం సానుకూల అభిప్రాయం లేదు!. లోతైన దేశవాళీ క్రికెట్‌ ప్రతిభ పది జట్ల ఐపీఎల్‌ను సూపర్‌హిట్టు చేసింది. ఐపీఎల్‌లో తొలిసారి ఆడుతున్న గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌, తొలిసారి విజేతగా నిలవాలని తపిస్తోన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు టాప్‌-4లో నిలిచాయి. ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తిరుగులేని ప్రదర్శనతో అగ్ర జట్టుగా నిలువగా.. మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్స్‌ ప్రదర్శనతో టాప్‌-2లో నిలువగలిగింది. సమిష్టిగా ఆడుతూ సంచలన విజయాలు నమోదు చేస్తోన్న గుజరాత్‌ టైటాన్స్‌, కీలక ఆటగాళ్లనే నమ్ముకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ నేడు క్వాలిఫయర్‌ 1 సమరానికి సిద్ధమయ్యాయి. క్వాలిఫయర్‌1లో నెగ్గిన జట్టు నేరుగా ఐపీఎల్‌ 2022 ఫైనల్లోకి ప్రవేశించనుంది. క్వాలిఫయర్‌1లో ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌ 2 రూపంలో ఫైనల్స్‌కు చేరుకునేందుకు మరో అవకాశం దక్కనుంది. క్వాలిఫయర్‌ 1 సమరంలో నెగ్గి ఫైనల్లో తొలి అడుగు వేసేదెవరో? ఆసక్తికరం.
టైటాన్స్‌కు ఎదురుందా?! : గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ లోతుపై తొలి నుంచీ అనుమానాలే. సమిష్టి ప్రదర్శనలతో టైటాన్స్‌ ఆ లోటు పూడ్చుకుంది. ఐపీఎల్‌ 2020లో టైటాన్స్‌ ఊహించని రికార్డు సాధించింది. ఛేదనలో తిరుగులేని జట్టుగా నిలిచింది. ఈ సీజన్లో ఆరుసార్లు ఛేదనకు బరిలోకి దిగిన టైటాన్స్‌ ప్రతిసారీ చివరి ఓవర్లో గెలుపొందింది. అయితే, లక్ష్యాలను నిర్దేశించటంలో గుజరాత్‌ టైటాన్స్‌ లోపం ప్రస్ఫుటం. గుజరాత్‌ టైటాన్స్‌ ఓడిన నాలుగు మ్యాచుల్లో ఏకంగా మూడింట లక్ష్యాలను కాపాడుకోవటంలో వచ్చినవే. ఆ మూడు మ్యాచుల్లోనూ గుజరాత్‌ టైటాన్స్‌ టాప్‌ ఆర్డర్‌ ప్రధాన కారణం. లీగ్‌ దశ చివర్లో ఆడిన ఐదు మ్యాచుల్లో గుజరాత్‌ ఏకంగా మూడింట పరాజయాలు చవిచూసింది. క్వాలిఫయర్‌1 ముంగిట టైటాన్స్‌ ఆత్మవిశ్వాసం కాస్త సడలేందుకు ఇద దోహదం చేయవచ్చు!. మహ్మద్‌ షమి రూపంలో పవర్‌ప్లేలో ప్రధాన పేసర్‌ వికెట్ల వేటలో ముందు నిలువగా.. డెత్‌ ఓవర్లలో రషీద్‌ ఖాన్‌ పరుగుల కట్టడిలో టైటాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. బలమైన మిడిల్‌ ఆర్డర్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ బలహీనతలను కప్పిపుచ్చుతోంది. ఇదే ఒరవడి మరో రెండు మ్యాచుల్లో కొనసాగించేందుకు టైటాన్స్‌ తయారైంది. హార్దిక్‌ పాండ్యకు నాయకత్వం బాగా కలిసొచ్చింది. కెప్టెన్సీ రాకతో పాండ్య ఆల్‌రౌండర్‌గా కదం తొక్కుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన అనుభవం ఇక్కడ నాకౌట్‌ దశలో హార్దిక్‌ పాండ్యకు ఉపయుక్తం కానుంది. శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌, హార్దిక్‌ పాండ్య,డెవిడ్‌ మిల్లర్‌ సహా రాహుల్‌ తెవాటియలు టైటాన్స్‌కు బ్యాట్‌తో కీలకం కానున్నారు. లాకీ ఫెర్గుసన్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమిలు బంతితో టైటాన్స్‌ ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలువనున్నారు.
రాయల్స్‌ నిలిచేనా?! : రాజస్థాన్‌ రాయల్స్‌ ఎక్కువగా వ్యక్తిగత ప్రదర్శనలతోనే విజయవంతమైంది. జోశ్‌ బట్లర్‌ లీగ్‌ దశలోనే మూడు శతకాలు బాదాడు. లీగ్‌ దశ తొలి అర్థభాగంలో 81.83 సగటుతో రెచ్చిపోయిన బట్లర్‌.. ద్వితీయార్థంలో నెమ్మదించాడు. 19.71 సగటుతోనే పరుగులు సాధించాడు. ఈ సమయంలో రాయల్స్‌కు యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ అండ లభించింది. సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌ ఆశించిన రీతిలో పరుగులు సాధించటంలో తేలిపోయారు. నేడు కీలక క్వాలిఫయర్‌లో బట్లర్‌, శాంసన్‌లు మెరిస్తే రాయల్స్‌కు ఎదురుండదు. బౌలింగ్‌ విభాగంలో రాయల్స్‌ ప్రధానంగా స్పిన్‌ జోడీపైనే ఆధారపడింది. యుజ్వెంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు సంయుక్తంగా 38 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మిడిల్‌ ఓవర్లలో చాహల్‌, అశ్విన్‌లను ఎదుర్కొవటం ప్రత్యర్థులకు అంత సులువు కాదు. డెత్‌ ఓవర్లలో పరుగుల పొదుపుతో పాటు వికెట్ల వేటలోనూ చాహల్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. లక్ష్యాలను నిర్దేశించటంలో తిరుగులేని రాయల్స్‌.. ఛేదనలో తడబడుతోంది. రాయల్స్‌ బలహీతను సొమ్ముచేసుకునేందుకు టైటాన్స్‌కు లక్ష్యాలను నిర్దేశించటంలో బలహీనత అడ్డుగా వస్తోంది. సిక్సర్ల మోతలో జోశ్‌ బట్లర్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌లు ముందున్నారు. అశ్విన్‌ బ్యాట్‌తోనూ నిలకడగా రాణించటం రాయల్స్‌కు అదనపు బలం.
పిచ్‌ రిపోర్టు : ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ తాజాగా ఉంది. ఈ ఐపీఎల్‌లో ఈడెన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. దీంతో క్వాలిఫయర్‌1లో పేస్‌ ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ రెండింట మాత్రమే గెలుపొందింది. గుజరాత్‌ టైటాన్స్‌ ఇక్కడ తొలి మ్యాచ్‌ ఆడబోతుంది. ఐపీఎల్‌లో ఇక్కడ ఛేదనకు అనుకూలత ఉంది. ఇక్కడ జరిగిన చివరి ఐదు ఐపీఎల్‌ మ్యాచుల్లో మూడింట రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టును విజయం వరించింది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గుచూపవచ్చు. లీగ్‌ దశలో గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఓసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గుజరాత్‌ 37 పరుగుల తేడాతో అలవోక విజయం నమోదు చేసింది.
వర్షం ముప్పు! : వాతావరణం చల్లబడింది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి!. రానున్న రోజుల్లో ఇక్కడ వర్షం, బలమైన గాలులు వీచేందుకు ఆస్కారం ఉంది. ఈ మేరకు వాతావరణం శాఖ పేర్కొంది. మ్యాచ్‌ ఆరంభానికి వర్షం ప్రభావం చూపించవచ్చు. వర్షం ప్రభావంతో ఆట సాధ్యపడకపోతే.. సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను తేల్చనున్నారు. సూపర్‌ ఓవర్‌ సైతం వీలుపడకపోతే.. లీగ్‌ దశ అనంతరం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టు ముందంజ వేయనుంది.
తుది జట్లు (అంచనా) :
రాజస్థాన్‌ రాయల్స్‌ : యశస్వి జైస్వాల్‌, జోశ్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దేవదత్‌ పడిక్కల్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రియాన్‌ పరాగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్‌ కృష్ణ, యుజ్వెంద్ర చాహల్‌, ఒబెడ్‌ మెక్‌కారు.
గుజరాత్‌ టైటాన్స్‌ : వృద్దిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌/అల్జారీ జొసెఫ్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), డెవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియ, రషీద్‌ ఖాన్‌, ఆర్‌. సాయికిశోర్‌, లాకీ ఫెర్గుసన్‌, యశ్‌ దయాల్‌, మహ్మద్‌ షమి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రసపట్టులో...!
ఓపెనర్లే కొట్టేశారు
బత్రాకు మళ్లీ షాక్‌
సూపర్‌ సిరాజ్‌
రోహిత్‌కు నెగెటివ్‌
సిరీస్‌పై అమ్మాయిల గురి
తెలంగాణ ఫెన్సర్ల సత్తా
అమ్మాయిలకు పరీక్ష!
జడేజా సెంచరీ
పంత్‌ ప్రతాపం
హ్యాండ్‌బాల్‌కు కొత్త జోష్‌
ముగిసిన పోరాటం
అమ్మాయిలు అలవోకగా..
సిరీస్‌ చిక్కేనా?!
ఆసియా హ్యాండ్‌బాల్‌ విజేత అల్‌ కువైట్‌
క్వార్టర్స్‌లో ప్రణయ్‌, సింధు
కూర్పు కుదిరేదెలా?
సింధు ముందంజ
ఖోఖోకు బాలీవుడ్‌ గ్లామర్‌!
జకోవిచ్‌ జోరు
ఇగా స్వైటెక్‌ @ 36
ఓ శకం ముగిసే
దీపక్‌ ధనాధన్‌
ప్రణయ్‌ శుభారంభం
మయాంక్‌కు పిలుపు
సిరీస్‌ లాంఛనమేనా?
ఇంగ్లాండ్‌ ఊడ్చేసింది
కెప్టెన్సీకి మోర్గాన్‌ గుడ్‌బై?
శ్రీలంకకు ఊరట
రోహిత్‌కు కరోనా

తాజా వార్తలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైరతాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.