Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జర్మనీ ఇంటికి! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

జర్మనీ ఇంటికి!

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం భారీ పతనం. ఓ వైపు జపాన్‌ వరుసగా రెండోసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించి కొత్త ఉత్సాహం సంతరించుకోగా.. నాలుగు సార్లు చాంపియన్‌ జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్‌ దశ నుంచే ఇంటి బాట పట్టింది. చివరగా 2014 ఫిఫా ప్రపంచకప్‌ నెగ్గిన జర్మనీ.. ఆ తర్వాత 2018, 2022 ప్రపంచకప్‌ల్లో గ్రూప్‌ దశ దాటలేదు. 2014 వరకు వరుసగా 16 ప్రపంచకప్‌ల్లో నాకౌట్‌కు చేరుకున్న జర్మనీ.. ఆ తర్వాత అనూహ్య పతనం దిశగా పయనిస్తోంది. కోస్టారియాపై 4-2తో భారీ విజయం సాధించినా గ్రూప్‌-హెచ్‌లో మూడో స్థానానికి పరిమితమై, ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది.
- కోస్టారియాపై 4-2తో ఊరట విజయం
- నాకౌట్‌కు అర్హత సాధించని మాజీ చాంప్‌
నవతెలంగాణ-దోహా (ఖతార్‌)
జర్మనీ నిష్క్రమించింది. జర్మనీ వరుసగా రెండో ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశను దాటలేకపోయింది. చివరి మ్యాచ్‌లో కోస్టారియాపై 4-2తో ఘన విజయం సాధించినా.. గ్రూప్‌-ఈ నుంచి నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకునేందుకు ఆ ప్రదర్శన సరిపోలేదు. కోస్టారికాపై గెలుపుతో పాటు జపాన్‌పై స్పెయిన్‌ విజయం సాధిస్తేనే జర్మనీ నాకౌట్‌కు చేరుకునే పరిస్థితి నెలకొంది. జపాన్‌, స్పెయిన్‌ మ్యాచ్‌లో ప్రథమార్థంలో స్పెయిన్‌ 1-0 ఆధిక్యంలో నిలువగా.. ఆ సమయంలో జర్మనీ నాకౌట్‌ అవకాశాలు సజీవంగా కనిపించాయి. కానీ జపాన్‌ మెరుపు విజయంతో.. జర్మనీ 4-2తో నెగ్గినా ఇంటి బాట పట్టక తప్పలేదు. కోస్టారికా నుంచి తజేడ, నేయుర్‌ (సెల్ఫ్‌ గోల్‌) గోల్స్‌ కొట్టారు. సెర్జ్‌ గాబ్రి, కారు హవెర్ట్జ్‌, నిక్లాస్‌ ఫుల్‌కృగ్‌లు గోల్స్‌ నమోదు చేశారు. స్పెయిన్‌, జర్మనీ నాలుగు పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. మెరుగైన గోల్‌ వ్యత్యాసంతో స్పెయిన్‌ ముందంజ వేసింది.
ఊరట విజయం : గ్రూప్‌-ఈ చివరి మ్యాచ్‌లో కోస్టారికాపై జర్మనీ గోల్స్‌ వర్షం కురిపించింది. ఆ జట్టుపై అన్ని విధాలుగా ఆధిపత్యం చెలాయించింది. ఆటలో 69 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న జర్మనీ.. 89 శాతం కచ్చితమైన పాస్‌లతో మెరిసింది. జర్మనీ ఎటాకర్లు కోస్టారికాపై భీకర దాడి చేశారు. ఏకంగా 32 సార్లు కోస్టారికా గోల్‌పోస్ట్‌పై ఎదురుదాడి చేశారు. అందులో 11 కిక్‌లు టార్గెట్‌ దిశగా దూసుకెళ్లాయి. ఆట పదో నిమిషంలోనే జర్మనీ గోల్‌ చేసి ముందంజ వేసింది. సెర్జ్‌ గాబ్రి గోల్‌ కొట్టినా సెలబ్రేట్‌ చేసుకోలేదు. తొలి అర్థ భాగం ఆట ముగిసే సమయానికి జర్మనీ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థం ఆరంభంలోనే కోస్టారియా ఆటగాడు యల్‌స్టిన్‌ తజేడా జర్మనీకి షాక్‌ ఇచ్చాడు. 58వ నిమిషంలో గోల్‌ ప్రయత్నాన్ని నిలువరించిన జర్మనీ గోల్‌ కీపర్‌ బంతిని చేతుల్లో నిలుపుకోలేకపోయాడు. వేగంగా దూసుకొచ్చిన తజేడా ఆ బంతిని నేరు గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. ఇక 70వ నిమిషంలో జర్మనీ సెల్ఫ్‌ గోల్‌తో ఆధిక్యం కోస్టారికాకు కోల్పోయింది. మాన్యూల్‌ నెయుర్‌ పొరపాటున బంతిని సొంత గోల్‌పోస్ట్‌లోకి కొట్టాడు. ఈ గోల్‌తో కోస్టారికా 2-1తో ముందంజలో నిలిచింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కారు హవెర్ట్జ్‌ 73వ నిమిషంలో స్కోరు సమం చేశాడు. ఇన్‌సైడ్‌ బాక్స్‌లో ఎదురుచూసిన హవెర్ట్జ్‌ బంతిని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. 85వ నిమిషంలో కారు హవెర్ట్జ్‌ మరో గోల్‌ కొట్టాడు. 89వ నిమిషంలో నిక్లాస్‌ మెరుపు గోల్‌తో జర్మనీ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు.
కోస్టారికాపై తిరుగులేని విజయం సాధించిన జర్మనీ.. మరో మ్యాచ్‌లో స్పెయిన్‌పై జపాన్‌ విజయంతో నాకౌట్‌ బెర్త్‌కు దూరమైంది. గ్రూప్‌ దశ తొలి మ్యాచ్‌లో జపాన్‌ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసిన జర్మనీ.. ఆ ఓటమికి భారీ మూల్యం చెల్లించుకుంది. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో గ్రూప్‌ దశ దాటకపోవటంతో స్వదేశంలో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. 2024 యూరో కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న జర్మనీ ఆ లోగా సమస్యలను చక్కదిద్దుకునే వీలుంది.
ఇక నాకౌట్‌ సమరం
           2022 ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి అనంతరం సెర్బియా, స్విట్జర్లాండ్‌..కామెరూన్‌, బ్రెజిల్‌ మ్యాచులతో గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు తెరపడనుంది. నేటి నుంచి నాకౌట్‌ పోరుకు తెరలేవనుంది. తొలి ప్రీ క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్‌తో యుఎస్‌ఏ తలపడనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 8.30 గంటలకు ఆరంభం కానుంది. రెండో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అగ్రజట్టు అర్జెంటీనాతో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ నేడు రాత్రి 12.30 గంటలకు ఆరంభం అవనుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
జూన్‌లో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
హాకీ కోచ్‌ రాజీనామా
మురళీ విజయ్ వీడ్కోలు
జగజ్జేత భారత్‌
జకోవిచ్‌ విజయ ఢంకా
ఛేదనలో చతికిల
ఫైనల్లో అమ్మాయిలు
అవమానం 'ఆరు'
సరిలేరు సానియాకెవ్వరు
ఇక పొట్టి పోరు!
ఫిబ్రవరి 4న ఏసీసీ భేటీ
కష్టాల్లో హైదరాబాద్‌
రుతురాజ్‌కు గాయం
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం
క్రీడాశాఖ కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి
రాణించిన రాయుడు
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌
క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..
రంజీ పోరుకు జడేజా
విచారణ కమిటీ చీఫ్‌ మేరీకోమ్‌
రేసులో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు
ఇక్కడైనా మెరుస్తారా?

తాజా వార్తలు

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.