Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తగ్గేదే లే..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

తగ్గేదే లే..!

- కొనసాగిన కుస్తీయోధుల ఆందోళన
- బ్రిజ్‌భూషణ్‌ను జైలుకు పంపించాలి
- రెజ్లింగ్‌ సమాఖ్యను ప్రక్షాళన చేయాలి
- వినేశ్‌, సాక్షి, భజరంగ్‌, రవి డిమాండ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ
           భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పదవికి రాజీనామాతో పాటు చట్టపరంగా విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లే వరకు రెజ్లింగ్‌ క్రీడాకారుల ఆందోళన కొనసాగుతుందని భారత స్టార్‌ రెజ్లర్లు తేల్చి చెప్పారు. లైంగిక వేధింపులు, చంపేస్తామని బెదిరింపులతో పాటు నియంతృత్వ విధానాలు, ఆటగాళ్లకు అన్యాం చేసే పద్దతుల పట్ల నిరసిస్తూ భారత స్టార్‌ రెజ్లింగ్‌ క్రీడాకారులు రెండు రోజులుగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడి ఆగడాలను నిరసిస్తూ గురువారం మరికొంత మంది రెజ్లర్లు ధర్నాలో కూర్చున్నారు.
జైలుకు పంపాలి
           రెజ్లర్ల జీవితాలతో ఆడుకున్న బ్రిజ్‌భూషణ్‌ పదవి నుంచి తప్పుకుంటే సరిపోదు. చట్టప్రకారం అతడిని జైల్లో ఉంచి శిక్షించాలని రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ డిమాండ్‌ చేసింది. 'మేమంతా (రెజ్లర్లు) బ్రిజ్‌భూషణ్‌ రాజీనామా మాత్రమే కోరటం లేదు. అతడిని చట్టప్రకారం శిక్షించాలి. పరిష్కారం కోసం ఎదురుచూస్తాం, లేదంటే శుక్రవారం బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించటంతో ఉత్తరప్రదేశ్‌లో రెజ్లింగ్‌ క్రీడ కనుమరుగయ్యేందుకు బ్రిజ్‌భూషణ్‌ కారణమయ్యాడు' అని వినేశ్‌ ఫోగట్‌ తెలిపింది. లైంగిక వేధింపుల పట్ల ఇప్పటివరకు ఐదారుగురు రెజ్లర్లు ఆధారాలతో ముందుకొచ్చారు. ఆత్మ గౌరవం అత్యంత ప్రధానం. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవటం ఎంత ఆలస్యమైతే లైంగిక వేధింపులపై ముందుకొచ్చే మహిళా రెజ్లర్లు సంఖ్య రెట్టింపు అవుతుంది. అది భారత క్రీడా రంగంలో ఓ చీకటి రోజుగా మిగిలిపోతుంది. మమ్మల్ని ఇలా మౌన రోదనకు వదిలేస్తే.. భారతదేశంలో ఎక్కడా మహిళలకు రక్షణ లేదని అనుకుంటాను. అసలు మన దేశంలో ఆడపిల్లలు జన్మించకూడదని భావిస్తానని' వినేశ్‌ ఫోగట్‌ భావోద్వేగానికి లోనైంది.
భవిత కోసమే పోరాటం
           'బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి రాజీనామా సరిపోదు. రెజ్లింగ్‌ సమాఖ్య పాలకవర్గం మొత్తం రద్దు కావాలి. రెజ్లింగ్‌ సమాఖ్య ప్రక్షాళన జరగాలి. బ్రిజ్‌ భూషణ్‌ ఒక్కడే తప్పుకుంటే, అతడిని అనుచరులకు పద వులు కట్టబెడతాడు. అందు వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ వ్యవస్థ మారాలి. ఇది మహిళా రెజ్లర్ల భవిష్యత్‌ కోసం చేస్తున్న పోరాటం. ఇందులో ఎటువంటి రాజకీ యాలకు చోటు లేదని' మరో స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూని యా పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ అనంతరం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో బ్రిజ్‌భూషణ్‌ నియంతృత్వ విధానాలపై ప్రధాని నరెంద్ర మోదికి బజరంగ్‌ పూనియా ఫిర్యాదు చేశారు. అయినా, పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదని పూనియా ఆవేదన వ్యక్తం చేశాడు.
తలుపులు తెరిచే ఉంచుతాడు!
           ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ సందర్భంగా బ్రిజ్‌భూషణ్‌ వ్యవహార శైలిపై యువ రెజ్లర్‌ అన్షు మాలిక్‌ మండిపడింది. ' జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ పోటీల్లో జూనియర్‌ బాలికలు బస చేసిన ఫ్లోర్‌లోనే బ్రిజ్‌భూషణ్‌ గది ఎంచుకున్నాడు. అతడు గది తలుపులు తెరిచే ఉంచేవాడు, ప్రతి మహిళా రెజ్లర్‌ బ్రిజ్‌భూషణ్‌ ప్రవర్తనతో అసౌకర్యానికి గుర య్యారు. ప్రస్తుత రెజ్లింగ్‌ ఫెడరే షన్‌ను పూర్తిగా తొలగించాలి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ వ్యవస్థలోనే సమూల మార్పులు అవసర మని' అన్షు మాలిక్‌ కోరింది.
ఉరివేసుకుంటా! :
           రెజ్లింగ్‌ క్రీడాకారులను ఆరోపణలను బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తోసిపుచ్చాడు. 'రెజ్లర్ల ఆరోపణల్లో నిజం లేదు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తేలితే ఉరి వేసుకుంటా. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. వాళ్లు ఏకంగా నాపైనే ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడు నేను ఏం చేయగలను. రెజ్లర్లతో మాట్లాడేందుకు సిద్ధంగానే ఉన్నాను. కానీ రెజ్లర్లు మాకు అందుబాటులో ఉండటం లేదు' అని బ్రిజ్‌భూషణ్‌ వ్యాఖ్యానించాడు.
క్రీడాశాఖ నోటీసు
           రెజ్లింగ్‌ క్రీడాకారుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌కు నోటీసులు పంపించింది. లైంగిక వేధింపులు, చంపేస్తామని బెదిరింపులు అత్యంత సీరియస్‌ ఆరోపణలు. ప్రస్తుత స్థితికి దారితీసిన పరిస్థితులపై 72 గంటల్లోగా పూర్తి నివేదిక అందజేయాలి. లేదంటే, 2011 నేషనల్‌ స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆందోళన చేపట్టిన రెజ్లింగ్‌ క్రీడాకారులతో క్రీడా మంత్రిత్వ శాఖ, శారు అధికారులు చర్చలు జరిపారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలకు స్పష్టమైన కార్యాచరణ లేకుండా హామీలతోనే సరిపెట్టడంతో రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బృందాకారత్‌ సంఘీభావం
           'మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఏ మహిళ అన్యాయానికి గురైనా అండగా ఉండి పోరాడుతాం. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ గర్వపడేలా పతకాలు సాధించిన రెజ్లర్లు ఆందోళనకు దిగటం బాధాకరం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని' సీపీఐ (ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్‌ డిమాండ్‌ చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల వద్దకు వెళ్లి ఆమె సంఘీభావం ప్రకటించారు.
గూండా చేతిలో అధికారం
- బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ చరిత్ర నేరపూరితం
- దావూద్‌తో దోస్తీ, దోపిడీ, అల్లర్లు నేపథ్యం
           భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చరిత్ర పూర్తిగా నేరపూరితం. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరఫున లోక్‌సభకు ఎన్నికైన బ్రిజ్‌భూషణ్‌ 2011 నుంచి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పై పట్టు సాధించాడు. దశాబ్దకాలానికి పైగా రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా నియంత పాలన సాగిస్తున్నాడు. శారు అధికారులు, టాప్‌ పథకం గైడ్‌లైన్స్‌, ప్రయివేటు స్పాన్సర్లు.. ఇలా ఎవరైనా అతడు గీసిన గీత దాటేందుకు వీల్లేదు. నియంతృత్వ విధానాల పట్ల ఎవరైనా గళం విప్పితే రెజ్లింగ్‌ క్రీడలో ఇక వారి పాత్ర చరిత్ర లోనే ఉండిపోతుంది. జాతీయ చాంపియన్‌షిప్స్‌ సందర్భంగా ప్రశ్నించిన ఓ యువ రెజ్లర్‌ను వేదికపై నుంచే చెంప చెళ్లుమనిపించాడు బ్రిజ్‌భూషణ్‌. మాట వినకపోతే.. ఒలింపిక్స్‌లో, వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో పత కం సాధించే రెజ్లర్‌పై నిషేధం విధించేందుకు వెనుకాడడు. అందుకు వినేశ్‌ ఫోగట్‌ సంఘట ననే నిలువెత్తు నిదర్శనం.
దావూద్‌తో దోస్తీ
           బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ గతంలో ఉగ్రవాదులతో సంబం ధాలు కలిగిన ఉన్నందున టాడా చట్ట ప్రకారం అభియోగాలు ఎదుర్కొన్నాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం కల్పించటం, తన ఫోన్‌ నుంచి దావూద్‌తో అతడి అనుచరులు సంభాషించేందుకు ఏర్పాటు చేసిన ఆరోపణలు బ్రిజ్‌భూషణ్‌ ఎదుర్కొన్నాడు. అయోధ్యలో రామ మందిర ఉద్యమం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన బ్రిజ్‌భూషణ్‌.. బాబ్రి మసీదు కూల్చివేత కేసు 40 మంది నిందితుల్లో ఉన్నాడు. 2020లో బాబ్రి కేసును న్యాయ స్థానం కొట్టివేయటంతో నిర్దో షిగా బయటపడ్డాడు. బ్రిజ్‌ భూషణ్‌పై దోపీడి, హత్యా యత్నం, అల్లర్లు సృష్టించటం వంటి నేరాల కింద అభియో గాలు నమోదయ్యాయి. నేర చరిత్ర కలిగిన బ్రిజ్‌భూషణ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ను గూండాగిరీ తోనే నడిపించాడు. పదేండ్లకు పైగా బ్రిజ్‌భూషణ్‌ ఆగడాలను భరించిన క్రీడాకారులు.. ఇప్పుడు గళం వినిపిస్తున్నారు.
ఇవీ ఆరోపణలు
- శిక్షణ శిబిరంలో మహిళా రెజ్లర్లపై అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌, జాతీయ కోచ్‌ల లైంగిక వేధింపులు. ఇందులో జూనియర్‌ బాలికలు సైతం ఉన్నారు.
- నియంతృత్వ విధానాలతో రెజ్లింగ్‌ సమాఖ్యను నడిపించటం
- రెజ్లర్లకు ప్రయివేటు స్పాన్సర్‌షిప్‌లను దూరం చేయటం
- నాణ్యత ప్రమాణాలు లేని శిక్షణ వ్యవస్థ
- రెజ్లర్లను ఇబ్బందిపెట్టేలా షెడ్యూలింగ్‌
- రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో అధ్వాన పాలన

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.