Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిల్‌, రోహిత్‌ శతకోత్సవం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

గిల్‌, రోహిత్‌ శతకోత్సవం

- ఐసీసీ నం.1 వన్డే జట్టుగా టీమ్‌ ఇండియా
              విజయం పరిపూర్ణం. న్యూజిలాండ్‌ను వరుసగా మూడో వన్డేలో చిత్తు చేసిన భారత్‌ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. రోహిత్‌ శర్మ (101), శుభ్‌మన్‌ గిల్‌ (112) శతకాల పండుగ చేయగా భారత్‌ తొలుత 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించటంతో ఛేదనలో న్యూజిలాండ్‌ 295 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఏడాదిలో భారత్‌ వరుసగా రెండో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయటం విశేషం.
- మూడో వన్డేలో భారత్‌ భారీ విజయం 
- 3-0తో కివీస్‌పై వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

నవతెలంగాణ-ఇండోర్‌
శుభ్‌మన్‌ గిల్‌ (112, 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (101, 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక మోత మోగించటంతో మూడో వన్డేలో న్యూజిలాండ్‌ పై భారత్‌ 90 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. న్యూజిలాం డ్‌పై ఈ ఘనతను మూడోసారి సాధించింది. గిల్‌, రోహిత్‌లకు తోడు హార్దిక్‌ పాండ్య (54, 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 385 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (138, 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకంతో మెరిసినా.. న్యూజిలాండ్‌ 41.2 ఓవర్లలో 295 పరుగులకు కుప్పకూలింది. పేసర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (3/52), స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/62) మూడు వికెట్ల ప్రదర్శనతో కివీస్‌ పతనాన్ని శాసించారు. శార్దుల్‌ ఠాకూర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలువగా, శుభ్‌మన్‌ గిల్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు అందుకున్నాడు. భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ శుక్రవారం రాంచి తొలి టీ20లో ఆరంభం కానుంది.
ఓపెనర్ల శతక జోరు : టాస్‌ నెగ్గిన కివీస్‌ తొలుత భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. హోల్కర్‌ స్టేడియంలో భారత ఓపెనర్లు పరుగుల సునామీతో దండెత్తారు. కెప్టెన్‌ రోహిత్‌ (101) పూర్వ వైభవం చాటాడు. ఆరంభంలో నెమ్మదిగా పరుగులు సాధించినా, క్రీజులో కుదురుకున్నాక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో జాకబ్‌ డఫ్సీపై రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో చెలరేగిన రోహిత్‌ శర్మ.. అక్కడ్నుంచి దూకుడు తగ్గలేదు. మరో ఎండ్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (112) మరో శతకం సాధించాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 41 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టిన రోహిత్‌.. 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 బంతుల్లోనే వంద మార్క్‌ అందుకున్నాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన గిల్‌.. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 బంతుల్లోనే సిరీస్‌లో రెండో సెంచరీ సాధించాడు. ఓపెనర్లు 212 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయటంతో భారీ స్కోరుకు గట్టి పునాది పడింది. హార్దిక్‌ పాండ్య (54), విరాట్‌ కోహ్లి (36) విలువైన ఇన్నింగ్స్‌లతో భారత్‌ ధనాధన్‌ ముగింపు అందుకుంది. కివీస్‌ బౌలర్లలో జాకబ్‌, టిక్‌నర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
శార్దుల్‌, కుల్దీప్‌ షో : 386 పరుగుల భారీ ఛేదనలో ఆరంభంలోనే ఓపనర్‌ ఫిన్‌ అలెన్‌ (0)ను కోల్పోయింది కివీస్‌. డెవాన్‌ కాన్వే (138), హెన్రీ నికోల్స్‌ (42) రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో న్యూజిలాండ్‌ను రేసులో నిలిపారు. పేసర్‌ శార్దుల్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ మ్యాజిక్‌తో న్యూజిలాండ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 బంతుల్లోనే సెంచరీ బాదిన డెవాన్‌ కాన్వే ఛేదనపై ఆసక్తి నిలబెట్టాడు. కాన్వే నిష్క్రమణతో 230 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్‌ ఓటమి అంచున నిలిచింది. బ్రాస్‌వెల్‌ (26), శాంట్నర్‌ (34) కాసేపు ఆశలు నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. 41.2 ఓవర్లలోనే న్యూజిలాండ్‌ కుప్పకూలగా భారత్‌ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (బి) బ్రాస్‌వెల్‌ 101, గిల్‌ (సి) కాన్వే (బి) టిక్‌నర్‌ 112, కోహ్లి (సి) అలెన్‌ (బి) జాకబ్‌ 36, కిషన్‌ (రనౌట్‌) 17, సూర్య (సి) కాన్వే (బి) జాకబ్‌ 14, పాండ్య (సి) కాన్వే (బి) జాకబ్‌ 54, వాషింగ్టన్‌ (సి) డార్లీ (బి) టిక్‌నర్‌ 9, ఠాకూర్‌ (సి) లేథమ్‌ (బి) టిక్‌నర్‌ 25, కుల్దీప్‌ (రనౌట్‌) 3, మాలిక్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు :12, మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 385.
వికెట్ల పతనం : 1-212, 2-230, 3-268, 4-284, 5-293, 6-313, 7-367, 8-379, 9-385.
బౌలింగ్‌ : జాకబ్‌ 10-0-100-3, ఫెర్గుసన్‌ 10-1-53-0, టిక్‌నర్‌ 10-0-76-3, శాంట్నర్‌ 10-0-58-0, డార్లీ 4-0-41-0, బ్రాస్‌వెల్‌ 6-0-51-1.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : అలెన్‌ (బి) పాండ్య 0, కాన్వే (సి) రోహిత్‌ (బి) మాలిక్‌ 138, నికోల్స్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 42, డార్లీ (సి) కిషన్‌ (బి) ఠాకూర్‌ 24, లేథమ్‌ (సి) పాండ్య (బి) ఠాకూర్‌ 0, ఫిలిప్స్‌ (సి) కోహ్లి (బి) ఠాకూర్‌ 5, బ్రాస్‌వెల్‌ (స్టంప్డ్‌) కిషన్‌ (బి) కుల్దీప్‌ 26, శాంట్నర్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 34, ఫెర్గుసన్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 7, జాకబ్‌ (ఎల్బీ) చాహల్‌ 0, టిక్‌నర్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 19, మొత్తం : (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 295.
వికెట్ల పతనం : 1-0, 2-106, 3-184, 4-184, 5-200, 6-230, 7-269, 8-279, 9-280, 10-295.
బౌలింగ్‌ : పాండ్య 6-0-36-1, వాషింగ్టన్‌ 6-0-49-0, ఠాకూర్‌ 6-0-45-3, మాలిక్‌ 7-0-52-1, కుల్దీప్‌ 9-0-62-3, చాహల్‌ 7.2-0-43-2.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.