Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక పొట్టి పోరు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ఇక పొట్టి పోరు!

          స్వదేశీ వైట్‌బాల్‌ ధమాకాలో మరో అంకానికి తెరలేచింది. న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. తాజాగా పొట్టి ఫార్మాట్‌లో ధనాధన్‌కు సిద్ధమవుతోంది. హార్దిక్‌ పాండ్య ముచ్చటగా మూడో సిరీస్‌లో భారత్‌కు సారథ్యం వహించనుండగా యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌పై పర్యటనలో తొలి విజయం సాధించేందుకు న్యూజిలాండ్‌ తహతహలాడుతోంది. ధోని ఇలాకా రాంచీలో భారత్‌,న్యూజిలాండ్‌ ధనాధన్‌ నేడు.
- భారత్‌, కివీస్‌ తొలి టీ20 నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-రాంచి

          సీనియర్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు లేకుండానే టీమ్‌ ఇండియా వరుసగా మూడో టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం చేసుకుంది. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ద్వంద్వ కెప్టెన్సీ విధానం అమలు చేస్తున్నారా? రెగ్యులర్‌ సారథికి విశ్రాంతి ఇచ్చారా? యువ జట్టుతోనే పొట్టి ఫార్మాట్‌లో కొనసాగుతారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే భారత క్రికెట్‌ను బీసీసీఐ ముందుకు నడిపిస్తోంది. భారత క్రికెట్‌ దిగ్గజం ఎం.ఎస్‌ ధోని అడ్డా రాంచీలో ఆతిథ్య జట్టుకు తిరుగులేని రికార్డుంది. ఇక్కడ ఆడిన మూడు టీ20 మ్యాచుల్లో టీమ్‌ ఇండియా విజయాలు సాధించింది. భారత పర్యటనలో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న న్యూజిలాండ్‌ ఓవైపు, పాండ్య సారథ్యంలోని యువ భారత్‌ ఓవైపు నేడు రాంచీ షోకు సిద్ధం.
సత్తా చాటుతారా?
2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అనంతరం భారత టీ20 జట్టులో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. అధికారికంగా బోర్డు ఎటువంటి ప్రకటన చేయకపోయినా.. పొట్టి ఫార్మాట్‌లో యువ క్రికెటర్లతోనే ముందుకెళ్లే ప్రణాళిక అమలు జరుగుతోంది. బ్యాటింగ్‌ విభాగంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచానికి సత్తా చాటాడు. కానీ టాప్‌ ఆర్డర్‌లో మిగతా బ్యాటర్లు ఆ స్థాయి అందుకోవాల్సి ఉంది. రుతురాజ్‌కు గాయంతో గిల్‌, కిషన్‌, పృథ్వీ షా రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. పృథ్వీ షా భయమెరుగని క్రికెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఇషాన్‌ కిషన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌లు ఆడటంలో దిట్ట. గిల్‌ కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గిల్‌ తోడుగా కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, ఈ ఫార్మాట్లో ఈ ఇద్దరూ పరిస్థితులకు అనుగుణంగా, జట్టు ప్రణాళికల ప్రకారం ఎదురుదాడి పరీక్షలో నెగ్గాల్సి ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో ఉమ్రాన్‌ మాలిక్‌, శివం మావిలు తుది జట్టులో కొనసాగనున్నారు. అరంగేట్ర సిరీస్‌లో శివం మావి మెప్పించాడు. వికెట్లు, పరుగుల పొదుపుతో కెప్టెన్‌ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ వికెట్ల పరంగా ఫర్వాలేదనిపించినా, పరుగుల పొదుపులో మెరుగుపడాల్సి ఉంది. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు కూల్చిన మాలిక్‌.. 10.90 ఎకానమీతో ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఎకానమీ అంశంలో ఉమ్రాన్‌ మాలిక్‌ లోపాలు దిద్దుకుంటేనే తుది జట్టులో నిలువగలడు. స్పిన్‌ విభాగంలో చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌, మణికట్టు మాయగాడు యుజ్వెంద్ర చాహల్‌ ఒకే స్థానం కోసం పోటీపడుతున్నారు. తాజా ఫామ్‌తో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
పుంజుకుంటారా?
కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ. న్యూజిలాండ్‌కు బ్యాట్‌తో, బంతితో ఇద్దరు అగ్ర ఆటగాళ్లు. ఈ ఇద్దరు లేకుండానే కివీస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. మూడు వన్డేల్లో చేతులెత్తేయగా.. ఇక టీ20ల్లోనైనా పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ పగ్గాలు మిచెల్‌ శాంట్నర్‌ అందుకున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో న్యూజిలాండ్‌కు ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు. కానీ అనుభవం పరంగా కివీస్‌ అత్యంత బలహీనం. పొట్టి ఫార్మాట్‌లో గణాంకాలు, సమీకరణాలకు పెద్దగా చోటుండదు. అందుకే ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డార్లీ మిచెల్‌లు భారత్‌కు సవాల్‌ విసరనున్నారు. వన్డే సిరీస్‌లో మెరిసిన మైకల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ అదే జోరు కొనసాగించేందుకు చూస్తున్నారు. బంతితో లాకీ ఫెర్గుసన్‌ ఒక్కడే అనుభవజ్ఞుడు. ఇశ్‌ సోధి ఫిట్‌నెస్‌ సాధించటం కివీస్‌కు అతి పెద్ద ఊరట. బ్లెయిర్‌ టిక్‌నర్‌, బెన్‌ లిస్టర్‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
పిచ్‌, వాతావరణం
రాంచీ పిచ్‌ తొలుత బౌలింగ్‌ చేసిన జట్టుకు అనుకూలం. ఇక్కడ 25 టీ20 మ్యాచుల్లో 16 మ్యాచుల్లో ఛేదించిన జట్టును విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం గణనీయంగా కనిపించనుంది. టాస్‌ నెగ్గిన కెప్టెన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు ఏమాత్రం ఆలోచన చేయరు. శుక్రవారం రాంచీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. చల్లని సాయంత్రం పొట్టి పోరు ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది. ఎటువంటి వర్షం సూచనలు లేవని సమాచారం.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివం మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌/యుజ్వెంద్ర చాహల్‌.
న్యూజిలాండ్‌ : ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే (వికెట్‌ కీపర్‌), మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డార్లీ మిచెల్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), బ్లెయిర్‌ టిక్‌నర్‌, ఇశ్‌ సోధి, బెన్‌ లిస్టర్‌, లాకీ ఫెర్గుసన్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.