Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సరిలేరు సానియాకెవ్వరు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

సరిలేరు సానియాకెవ్వరు

            భారత క్రీడారంగంలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. ఆటతో పాటు సమాజం ఛట్రాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన చరిత్ర ఆమెది. మేరీకోమ్‌, సైనా నెహ్వాల్‌, పి.వి సింధు కంటే ముందే భారత క్రీడారంగ ముఖచిత్రంగా నిలిచిన సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించింది. 36 ఏండ్ల సానియా మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించింది.
- ముగిసిన గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ 
- భారత టెన్నిస్‌ ముఖచిత్రం
నవతెలంగాణ క్రీడావిభాగం
'నేను ఇప్పుడు కంటతడి పెడితే అవి ఆనందభాష్పాలే, బాధ నుంచి వచ్చినవి కావు' 2023 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్స్‌ అనంతరం సానియా మీర్జా వ్యాఖ్యలు ఇవి. ఎక్కడైతే గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ మొదలుపెట్టిందో, అక్కడే గ్రాండ్‌గా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించింది సానియా మీర్జా. 36 ఏండ్ల సానియా మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ రన్నరప్‌ ట్రోఫీతో వీడ్కోలు పలికింది. టెన్నిస్‌ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఐకానిక్‌ కోర్టు భారత క్రీడా దిగ్గజం సానియా మీర్జా వీడ్కోలుకు వేదికైంది.
ఆమె దారి రహదారి
భారత్‌లో మహిళలు క్రీడల్లో రాణించాలంటే, తొలుత కుటుంబం, ఆ తర్వాత సమాజం.. ఆ తర్వాతే ప్రత్యర్థులతో పోటీ పడాలి. క్లిష్టమైన సవాళ్ల నడుమ ఆ పని చేసింది సానియా మీర్జా. మధ్యతరగతి ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన సానియా మీర్జా ప్రస్థానం పూల బాట కాదు. టెన్నిస్‌ కోర్టులో రాకెట్‌ పట్టడానికి ముందే ఓ యుద్ధం చేసిన సానియా మీర్జా.. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎంసీ మేరీకోమ్‌, సైనా నెహ్వాల్‌, పి.వి సింధుల కంటే ముందుగానే భారత క్రీడా రంగ ముఖచిత్రంగా, ప్రత్యేకించి మహిళా అథ్లెట్లకు సూపర్‌స్టార్‌గా నిలిచింది సానియా మీర్జా. సంప్రదాయాలు, కట్టుబాట్లను దాటుకుంటూ సరికొత్త పంథాలో నడిచిన సానియా మీర్జా.. భారత క్రీడా రంగంలో మహిళా అథ్లెట్లకు దారి చూపిన బాటసారి. భారత్‌కు అసమాన విజయాలు సాధించినా, ఆమె దేశభక్తి ప్రశ్నార్థకమైంది. పాకిస్థాన్‌ క్రికెటర్‌తో వివాహంతో వ్యక్తిగత జీవితంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా, సానియా మీర్జా అధైర్యపడలేదు. ఎంచుకున్న మార్గంలో విజయవం తమైన సానియా మీర్జా.. తనెంటో సాధించిన ఘనతలు, రికార్డులతోనే విమర్శలకు సరైన సమాధానం ఇచ్చింది. షోయబ్‌ మాలిక్‌తో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా.. ఎవరూ ఊహించని విధంగా టెన్నిస్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. తనయుడితోనే నిరుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో పోటీపడిన సానియా మీర్జా.. ఈ ఏడాది కుమారుడు కండ్ల ముందు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరులో తలపడింది. ఆ భావోద్వేగం సానియా మీర్జాలో స్పష్టంగా కనిపించింది.
టెన్నిస్‌ ముఖచిత్రం
భారత టెన్నిస్‌ ముఖచిత్రం సానియా మీర్జా. కెరీర్‌ తొలినాళ్లలోనే సంచలన విజయాలు సాధించిన సానియా మీర్జా.. అటు సింగిల్స్‌, ఇటు డబుల్స్‌ విభా గాల్లో తనదైన ముద్ర వేసింది. సొంతగడ్డ హైదరా బాద్‌లో తొలిసారి (2005) డబ్ల్యూటీఏ టైటిల్‌ సాధించిన సానియా మీర్జా.. అదే ఏడాది యుఎస్‌ ఓపెన్‌లో నాల్గో రౌండ్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. రమేశ్‌ కృష్ణన్‌ (1987) తర్వాత మరో భారత టెన్నిస్‌ ప్లేయర్‌ న్యూయార్క్‌లో రెండో వారం రాకెట్‌ పట్టలేదు. గ్రాండ్‌స్లామ్‌ నాల్గో రౌండ్‌కు చేరిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా సానియా నిలిచింది. 2005 మెల్‌బోర్న్‌లో ప్రపంచ టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌తో ముఖాముఖి పోరు సానియా మీర్జా కెరీర్‌లో హైలైట్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్‌ అనంతరం సానియా ఈ విషయం వెల్లడించింది. 'నా వరకు మెల్‌బోర్న్‌లో 18 ఏండ్ల వయసులో సెరెనా విలియమ్స్‌తో ఆడిన మ్యాచ్‌ అత్యంత ప్రత్యేకం. ఆ మ్యాచ్‌లో నేను 1-6, 4-6తో ఓటమి చెందినా.. నాలో దృడమైన ఆత్మవిశ్వాసం నింపిన సమరం అది. ఓ సాధారణ భారతీయ అమ్మాయిగా నాపై నాకు విశ్వాసం కలిగించిన మ్యాచ్‌ అది' అని సానియా తెలిపింది.
అసమాన విజయాలు
భారత టెన్నిస్‌లో సానియా మీర్జా ఇప్పటికీ టాప్‌ క్రీడాకారిణి. డబ్య్యూటీఏ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో (2017) నం.27గా నిలిచింది సానియా. సింగిల్స్‌కు దూరమైన పదేండ్లలో సైతం సానియా రికార్డు చెక్కుచెదరలేదు. ఇక మహిళల డబుల్స్‌ సర్క్యూట్‌లో సానియా మీర్జా ప్రపంచంలోనే మేటీ అథ్లెట్లలో ఒకరుగా నిలిచింది. ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన సానియా మీర్జా.. డబుల్స్‌ విభాగంలో 43 టూర్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్‌ నం.1 ఏకధాటిగా 91 వారాల పాటు కొనసాగింది. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, పరిస్థితులను పట్టించుకోకుండా ఎంచుకున్న మార్గంలో నడిచిన సానియా మీర్జా.. కెరీర్‌ను ముగించటంలోనూ అదే స్టయిల్‌ చూపించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ఘనంగా ముగించింది. వచ్చే నెల దుబారులో డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌తో సానియా మీర్జా అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకనుంది.
రన్నరప్‌ సానియా జోడీ
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
మెల్‌బోర్న్‌ : భారత టెన్నిస్‌ దిగ్గజం, మహిళల డబుల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ రన్నరప్‌గా నిలిచింది. భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న జంటగా మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌పై కన్నేసిన సానియా మీర్జా.. శుక్రవారం ఉదయం జరిగిన ఫైనల్లో వరుస సెట్లలో పోరాడి ఓడింది. బ్రెజిల్‌ జంట స్టెఫాని, రఫేల్‌ మాటోస్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 6-7(2-7), 2-6తో సానియా, బోపన్నలు ఫైనల్లో పోరాడి ఓడారు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయిన సానియా, బోపన్నలు రెండో సెట్‌లో అంచనాలను అందుకోలేదు. 4 ఏస్‌లు, 2 బ్రేక్‌ పాయింట్లు సాధించిన సానియా, బోపన్నలు టైటిల్‌ ముంగిట నిరాశపరిచారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాత్విక్‌ జోడీకి టైటిల్‌
తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్‌ జరీన్‌
బంగారు నిఖత్‌
పసిడి పంచ్‌
మనుకు కాంస్యం
ఇంగ్లాండ్‌, శ్రీలంక, యుఏఈ!
సింధు పరాజయం
రుద్రాంక్ష్‌ కాంస్య గురి
మెస్సిఏ 800 గోల్స్‌
పసిడి పోరుకు నిఖత్‌
ఆ బాధ్యత ఆటగాళ్లదే!
శ్రీకాంత్‌ ఔట్‌
పోరాడినా..
షూటింగ్‌లో భారత్‌కు తొలిస్వర్ణం
సిరీస్‌ నీదా?నాదా?
క్వార్టర్‌ఫైనల్లో నిఖత్‌
ఈ బలహీనత దాటేదెలా?
క్వార్టర్స్‌లో సాక్షి
కివీస్‌ క్లీన్‌స్వీప్‌
కుప్పకూలి..!
ఎ.ఆర్‌ రావుకు టెన్నిస్‌ టైటిల్‌
డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ
ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌
కథ ముగిసింది
తీరంలో తేల్చేస్తారా?
గెలిపించిన రాహుల్‌, జడేజా
సెమీస్‌కు త్రీసా-గాయత్రి
అంతర్జాతీయ క్రికెట్‌కు టిమ్‌ పైన్‌ గుడ్‌బై
గిల్‌, రాహుల్‌కు పరీక్ష
నిఖత్‌ శుభారంభం

తాజా వార్తలు

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.