Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎవరికీ రాకూడని కష్టమిది.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

ఎవరికీ రాకూడని కష్టమిది..

- బతికున్నప్పుడే అద్దె ఇల్లు..చనిపోతే శ్మశానమే దిక్కు
- చివరి క్షణాల్లో కుటుంబ పెద్దను కాష్టానికి తీసుకొచ్చిన తల్లీకూతుళ్లు
- తుదిశ్వాస విడిచాక అతికష్టమ్మీద అంత్యక్రియలు
- ఇదీ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కలిచివేసిన ఓ నిరుపేదింటి దుస్థితి
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
           'ఎవరైనా చనిపోయినంక శ్మశానానికి తీసుకొస్తరు. కిడ్నీ ఫెయిల్‌ అయి చావుబతుకుల్లో ఉన్న మా నాన్నను ప్రాణం ఉన్నప్పుడే కాష్టానికి తీసుకొచ్చినం. ఓనరోల్లు రానియ్యకపోవడంతో ఏం చేయాల్నో అర్థం కాక.. ఎక్కడ ఉండాల్నో తెల్వక.. మిగిలింది ఈ చోటేనని శ్మశానికి వచ్చాం. కొన ఊపిరితో ఉన్న నాన్నను 24గంటలూ కాపలా కాస్తూ... కాలుతున్న కాష్టాల దగ్గర ముగ్గురు ఆడవాళ్లం గజగజ వణుకుతూ గడిపాం. నాన్న తుదిశ్వాస విడిచాక ఇక్కడే అంత్యక్రియలు చేసి కర్మకాండలు చేశాం. నాలుగేండ్ల కిందట గుండెపోటుతో అన్నయ్య చనిపోయినప్పుడూ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాం. అయితే, అప్పుడు అన్నయ్య మృతదేహాన్ని శ్మశానికి తెస్తే.. నాన్న బతికున్నప్పుడే వల్లకాడుకు తీసుకొచ్చాం. ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు' అంటూ కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన తల్లీకూతుళ్లు భారతి, స్వప్న, సరిత 'నవతెలంగాణ'తో బోరున విలపించారు. మరో ఘటనలో జిల్లా కేంద్రానికే చెందిన నేరెళ్ల మహేష్‌ ఆపరేషన్‌ వికటించి మరణిస్తే.. అల్గునూర్‌ చౌరస్తాలోనే శవాన్ని వేసుకుని అంత్యక్రియలు నిర్వహించింది ఆ కుటుంబం. చివరికి అదే వార్డులోని అంగన్‌వాడీ కేంద్రంలో తలదాచుకుని కర్మకాండలు నిర్వహించుకుంది.
ఇలాంటి ఘటనలు ఏ ఒక్కరి సమస్యో కాదు.. పట్టణాల్లో అద్దెకుండే కుటుంబాలందరిదీ. బతికున్నంత వరకూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే ఇండ్ల యజమానులు ప్రాణం పోయాక శవాలను దూరం పెడుతున్నారు. మూఢనమ్మకాల ప్రభావం వేళ్లూనుకున్న పట్టణాల్లో ఇలాంటి దురాచార సంస్కృతి మనుషుల్లో మంచితనం, మానవత్వాన్ని మంటగలుపుతోంది. సొంతిల్లు.. కనీసం సొంత జాగా లేని కుటుంబాల్లో నిత్యం ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రం సహా కార్మికక్షేత్రాలైన రాజన్నసిరిసిల్ల, రామగుండంలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి చేనేత పని కోసం సిరిసిల్లకు వచ్చి అద్దె ఇండ్లలో స్థిరపడిన నేత కార్మిక కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే చందాలు వేసుకుని దహన సంస్కారాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక్కడ సొంతిల్లు, జాగాలేని నేత కార్మిక కుటుంబాలే అద్దెఇండ్లలో సుమారు పది వేల వరకూ ఉన్నాయి.
చనిపోతే శవం బయటే..
కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, రామగుండంలాంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో సొంతిల్లు, జాగ లేని కుటుంబాలు సుమారు లక్షన్నరకుపైగానే ఉంటాయని ఓ అంచనా. ఇక పిల్లల చదువుల కోసమనో, వ్యాపారాల కోసమనో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారూ ఆ సంఖ్యకు మించే ఉంటారు. ఈ పరిస్థితిలో అద్దెకుండే కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఇంటి యజమానులు శవాలను తీసుకరానివ్వడం లేదు. ప్రాణం ఎక్కడ పోయినా పలువురు ఇండ్ల యజమానులు మాత్రం అద్దెకుండే వారి శవాన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. బయటి వ్యక్తులు ఇంట్లో చనిపోతే అరిష్టమని, ఇల్లు మూసేయాల్సి వస్తుందన్న మూఢ నమ్మకాలను పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం నాగరికతను మర్చిపోయి పాతతరం మనుషుల్లా ఆలోచిస్తున్నారు. మనిషి దూరమైన బాధతో కన్నీరు మున్నీరయ్యే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం మరిచి మృతదేహాలను బయటే ఉంచాలని నిర్దయగా చెప్పేస్తున్నారు.
వేళ్లూనుకుంటున్న మూఢాచారాలు
మత ఆచారాలు, కుల కట్టుబాట్లు.. మూఢనమ్మకాలు.. ఇలా ఏవైనా రానురానూ మనిషిలో మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. అదీ నాగరికత ఉన్న పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అద్దెకుండే ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలుంటే పాల్గొనే యజమాని.. అదే అద్దెకున్న మనిషి కన్నుమూస్తే మాత్రం అటు వైపుచూడటం లేదు సరికదా.. ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకరానివ్వని వారు కొందరు ఉంటే.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని చెప్పే ఘనులూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మనుషుల్లోనే మార్పురావాలి తప్ప.. చట్టాలు ఎన్ని ఉన్నా.. మార్పు సాధ్యంకాని పరిస్థితి నెలకొంది.
ఊరూరా శ్మశానవాటికలు, పట్టణాల్లో కర్మకాండ భవనాలు
వై.సునిల్‌రావు- కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌
గతంలో సొంతజాగ లేక, శ్మశానవాటికలు లేక చాలా మంది పేదలు ఇంట్లో ఎవరైనా చనిపోతే రోడ్డు మీదనో, చెరువుల్లోనో దహన సంస్కారాలు నిర్వహించుకునేవాళ్లు.. అలాంటి పరిస్థితికి పూర్తిగా చరమగీతం పాడిన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఊరూరికీ శ్మశానవాటికలు నిర్మించింది. కర్మకాండలు నిర్వహించుకునేందుకు సొంతిల్లు లేని వారి కోసం ఈ ఐదేండ్లలో భవనాలూ నిర్మించింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 12రోజుల కర్మకాండల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ భవనాల సంఖ్య మరిన్ని పెంచుతాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రయివేటు సంస్థలు ప్రజలను ఆదుకోవు
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 9న మహాధర్నా
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు
అదానీ ఆస్తుల లావాదేవీలపై 'సుప్రీం' పర్యవేక్షణలో విచారణ జరపాలి
పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
నూతన రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాలకు నిధులివ్వండి
చారిటీ కోసం ఫుడ్‌ కార్నివల్‌
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌
నేటినుంచి సర్కారు బడుల్లో బోధన బంద్‌
భద్రతకు ప్రాధాన్యతివ్వండి
బడ్జెట్‌లో ఆర్టీసీకి రెండుశాతం నిధులు కేటాయించాలి
హైదరాబాదులో శాండోస్‌ ప్రపంచ సామర్థ్య కేంద్రం
భారీ భద్రత మధ్య డెక్కన్‌ మాల్‌ కూల్చివేత
సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్‌ను రద్దుచేయించాలి
జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1మెయిన్‌
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌
హాస్టల్‌ వర్కర్ల బకాయిల కోసం 2న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష : సీఐటీయూ
ఏకకాలంలో రుణమాఫీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌
నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు వామపక్షాల పొత్తు కలిసొస్తుంది..
నిజామాబాద్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
స్కాలర్‌ షిప్‌ రెన్యూవల్స్‌కు మార్చి 31వరకు గడువు పొడింగింపు
ఏసీబీ వలలో 'ఉపాధి' అధికారి
మాతృభాష పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
పదోన్నతివ్వండి..న్యాయం చేయండి..
రబీ కరెంట్‌ డిమాండ్‌ 15,500 మెగావాట్లు ఏర్పాట్లు చేయండి
ఎమ్మెల్సీ వెంకట్‌రామ్‌రెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు

తాజా వార్తలు

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.