Magazines

నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

1 గంట క్రితం

Mahatma Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ లో గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.వీబీ - జీ ఆర్ఏఎం జీ (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్) అక్టోబర్‌ 2 కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులు, రైతులకు అవగాహన కల్పించారు.


సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, ఉపసర్పంచ్ ఆకుల శ్రీను, పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో గ్రామపంచాయతీ మ్యాప్‌ను రూపొందించి,వీబీజీ రామ్ జీ పథకం కింద ప్రతిపాదించిన 375 పనులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేశారు. రైతుల అవసరాలు, గ్రామ అభివృద్ధికి చేపట్టే పనులతోపాటు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతిపాదిత పనులను మ్యాప్‌లో వాటి ప్రదేశాలతో సహా గుర్తించి వివరించారు.


అనంతరం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, గ్రామసభల ప్రాధాన్యంపై కార్యక్రమంలో వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామదీపికలు, హెల్త్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, సొసైటీ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్