ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఉత్పత్తులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో కెనరా బ్యాంకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ద్వారా మహిళలకు ఉచిత జూట్ బ్యాగుల తయారీ శిక్షణ సోమవారం ప్రారంభమైంది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ.. జూట్ బ్యాగుల తయారీ ద్వారా మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.
వ్యవసాయ పనులు చేసుకుంటూనే అదనపు ఆదాయం పొందేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. జూట్ బ్యాగులను వ్యాపార, గృహ అవసరాలతో పాటు కార్యాలయాలు, కళాశాలలకు వెళ్లేవారు రోజువారీ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు.ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జూట్ బ్యాగులను వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని,జూట్ సహజంగా కుళ్లిపోయి భూమిలో కలిసిపోతుందని పేర్కొన్నారు.మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు భువనగిరి మేనేజర్,RSETI భువనగిరి డైరెక్టర్ బి. కిషన్,ఏ.సిద్ధులు,మహిళలు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)