కిచెన్ సింక్ పైపుల్లో చేరిన జిడ్డును వదిలించడానికి, అక్కడ చేరే బ్యాక్టీరియాను చంపడానికి ఉప్పు ఒక అద్భుతమైన నేచురల్ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఉప్పును ఉపయోగించి సింక్ దుర్వాసనను ఎలా పోగొట్టాలో చూద్దాం. ఉప్పు, వేడి నీళ్లు రాత్రి పూట వంటగది పనులన్నీ పూర్తయిన తర్వాత సింక్ డ్రైన్ హోల్లో ఒక పెద్ద కప్పు కల్లుప్పు లేదా నార్మల్ ఉప్పును వేయాలి. ఒక 15-20 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక లీటర్ బాగా కాగిన వేడి నీళ్లను నేరుగా ఆ పైపులోకి పోయాలి. ఉప్పు అక్కడ పేరుకుపోయిన మురికిని లూజ్ చేస్తే, వేడి నీళ్లు ఆ జిడ్డునంతటినీ కరిగించి కిందకు పంపేస్తాయి. దీనివల్ల బ్యాడ్ స్మెల్ క్షణాల్లో మాయమవుతుంది. ఉప్పు, బేకింగ్ సోడా కాంబినేషన్: దుర్వాసన చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.. అర కప్పు ఉప్పు, అర కప్పు బేకింగ్ సోడా కలిపి సింక్ రంధ్రంలో వేయాలి. ఆ వెంటనే ఒక కప్పు వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం పోయాలి. ఇవి మూడూ కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగి నురగ వస్తుంది. ఇది పైపుల గోడలకు పట్టిన మురికిని, బ్యాక్టీరియాను పూర్తిగా క్లీన్ చేస్తుంది. అరగంట తర్వాత వేడి నీళ్లతో ఫ్లష్ చేస్తే సరిపోతుంది. ఐస్ ముక్కలు, ఉప్పు ట్రిక్: పైపులలో జిడ్డు గట్టిగా పేరుకుపోతే.. గుప్పెడు ఉప్పుతో పాటు కొన్ని ఐస్ ముక్కలను సింక్ రంధ్రంలో వేసి కాసేపు ఉంచాలి. ఐస్ ముక్కలు పైపుల్లోని జిడ్డును గడ్డకట్టేలా చేస్తే, ఉప్పు దాన్ని స్క్రాప్ చేసి (రుద్ది) బయటకు పంపడానికి సహాయపడుతుంది.







కామెంట్లు (0)