Magazines

మరోసారి నేపాల్ లో వరదలు..వీడియో

1 గంట క్రితం

floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్:


మరోసారి నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి.గండకీ ప్రావిన్స్‌లో, మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా శనివారం నాడు కాళీ గండకీ నది నీటిమట్టం పెరగడం ప్రారంభమై, ఆదివారం ఉదయానికి అది తీవ్ర వరదగా మారింది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక జిల్లాల్లో కనీసం 24 మంది మరణించగా, 14 మంది గల్లంతయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వరదల ధాటికి పర్బత్‌లోని ఒక గ్రామంలో నివాస ప్రాంతాలు పూర్తిగా కొట్టుకుపోయ్యాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల చిత్వాన్‌కు వెళ్లే రహదారులు మూసుకుపోయి. ఈసంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన భద్రతా దళాలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్