ముగ్గురు మృతి అప్రమత్తంగా ఉండాలి : ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ
రియాద్ : సౌదీ అరేబియాలో చమురుక్షేత్రాలు, విమానాశ్ర యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్‌తో పోరాటం నేపథ్యంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సౌదీ ప్రభుత్వ రంగ దిగ్గజం అరామ్‌కో నిర్వ హిస్తున్న షాయ్‌బా ఆయిల్ ఫీల్డ్‌పైకి దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను భద్రతా దళాలు గాల్లోనే అడ్డుకుని కూల్చివేశాయి. అయితే, దాని శకలాలు కింద పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నేపాల్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారిగా గుర్తించారు. గాయపడినవారిలో పాకిస్థాన్, భారత్‌కు చెందినవారు ఉన్నారు. మరోవైపు కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ సౌదీ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
విమానాశ్రయంపై దాడి ఒకరు మృతి
సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జా తీయ విమానాశ్రయంపై అక్టోబర్ 21, బుధవారం సాయంత్రం దాడి జరిగినట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) వెల్లడించింది. ఈ మేరకు జీఏసీఏ 'ఎక్స్' వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయని తెలిపింది. గాయపడినవారికి స్వల్ప గాయాల నుంచి తీవ్రమైన గాయాల వరకు ఉన్నట్టు పేర్కొంది. వారందరినీ తక్షణ వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించినట్లు వివరించింది. దాడి కారణంగా విమానాశ్రయంలో ఆస్తి నష్టం కూడా జరిగినట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. నష్టం ఎంత జరిగిందన్న అంశంపై అధికారులు అంచనా వేస్తున్నారని పేర్కొం ది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భారత పౌరులకు భద్రతా సూచనలు
సౌదీ అరేబియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేప థ్యంలో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయ బార కార్యాలయం సూచించింది. స్థానికంగా విధిస్తున్న కర్ఫ్యూలు, భద్రతాపరమైన ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. నిరసనలు జరిగే ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. స్థానిక అధికారులు జారీ చేసే సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న, ప్రయాణిస్తున్న భారతీయులు తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ఫ్రాన్స్‌లోనూ ఉద్రిక్త పరిస్థితులు
ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలు, భద్రతాపరమైన ఆంక్ష ల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న భారతీయు లు అప్రమత్తంగా ఉండాలని పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనించాలని, అధికారిక ప్రకటనలను అనుసరించాలని కోరింది. ప్రజా రవాణాలో అంతరాయాలు ఉన్నాయో లేదో ముందుగానే తెలుసుకోవాలని సూచించింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అత్యవ సర పరిస్థితుల్లో భారత పౌరులకు సహాయం అందించేందుకు పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం, మార్సెయిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రత్యేక హెల్ప్‌లైన్ సంప్రదింపు వివరాలను అందుబాటులో ఉంచాయి.
అక్టోబర్ 24న జరగనున్న నిరసనల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరిస్తామని ఫ్రాన్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకార్ను హామీ ఇచ్చినట్టు సమాచారం. పెరుగుతున్న జీవన వ్యయాలు, పాఠశాలల్లో పరిస్థితులు క్షీణించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం కర్ఫ్యూలను పొడిగిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. సౌదీ అరేబియాలో చమురుక్షేత్రం, విమానాశ్రయంపై దాడులు, ఫ్రాన్స్‌లో నిరసనలు, భద్రతాపరమైన ఆంక్షల నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.






కామెంట్‌లు (0)