నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సింగిల్ ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 విమానం కెనోషా నుంచి మెనోమోనీకి వెళ్తుండగా డెల్లోనా పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన ఉరుములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి.
అమెరికాలో విమాన ప్రమాదం.. చిన్నారితో సహా ఆరుగురు మృతి
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)