Magazines

స్టార్‌లింక్ సేవలు అందించండి

57 నిమిషాల క్రితం

Starlink
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

మస్క్‌ను కోరుతున్న అమెరికా
ఇరాన్, ఇజ్రాయిల్‌లను దెబ్బతీయడమే లక్ష్యం


వాషింగ్టన్ : ఎలాన్ మస్క్‌కు చెందిన ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ స్టార్‌లింక్‌ను ఉక్రెయిన్ సైన్యం ఉపయోగించుకోకుండా చూసేందుకు అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. తమ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ దేశాల్లో సేవలు ఆపేయడమో లేదా ప్రారంభించడమో చేయాలని బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాలు స్టార్‌లింక్‌ను కోరాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యెమెన్, లెబనాన్ దేశాల్లోని ఇరాన్ అనుకూల గ్రూపులు స్టార్‌లింక్ సేవలను ఉపయోగించకుండా నిరోధించాలని గతంలో జో బైడెన్ ప్రభుత్వం స్టార్‌లింక్‌కు సూచించింది. అలాగే అమెరికా సైన్యానికి మద్దతుగా ఇరాన్‌లోనూ, ఉక్రెయిన్‌లోనూ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి స్టార్‌లింక్ సేవలు ప్రారంభించాలని కూడా కోరింది. గత ఏడాదిలోనూ, ఈ సంవత్సరం ప్రారంభంలోనూ అమెరికా`ఇజ్రాయిల్ సేనలు ఇరాన్‌పై దాడులు చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి,

కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి టెహ్రాన్‌లో స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం ఎలాన్ మస్క్‌ను కోరింది. స్పేస్‌ఎక్స్‌ ఉపగ్రహ సేవలను ఉక్రెయిన్ ఉపయోగించుకోవడంపై ఆంక్షలు విధించే విషయంలో ఇటీవల వివాదం చెలరేగింది. దీంతో అమెరికా ప్రభుత్వానికి, మస్క్‌కు మధ్య నెలకొన్న సంబంధాలపై అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. విదేశాంగ విధానాన్ని అమలు చేయడంలో అమెరికా ప్రభుత్వాలు ఓ ప్రయివేటు రంగంలోని సంస్థపై ఇంతగా ఆధారపడ్డాయన్న విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా ఇప్పుడే బయటపడింది. స్టార్‌లింక్ వ్యవస్థ యొక్క సైనిక వర్షన్ స్టార్‌షీల్డ్ వినియోగంపై విధించిన ఆంక్షల కారణంగా ఉక్రెయిన్ సైన్యం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. స్టార్‌షీల్డ్ లభ్యతను ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారని, దీంతో తమ సైనిక డ్రోన్ల పనితీరుకు ఆటంకం కలుగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గత వారం చెప్పారు. రష్యా క్షిపణి దాడులను ఎదుర్కోవడానికి, అలాగే కొన్ని సైనిక కార్యకలాపాల కోసం ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న స్టార్‌లింక్ వేగాలను కూడా పరిమితం చేశారని ఆయన విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్