కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్‌కు తొలి ఐసీసీ టైటిల్ ప్రపంచకప్ అందించిన నాయకి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ బాధ్యతలను త్యజించింది. 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ విజయంతో భారత క్రికెట్‌కు జోష్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తాజాగా ఆసియా క్రీడల్లో భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టింది. 37 ఏండ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు మంగళవారం తన సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు టెస్టలు, 51 వన్డేలు, 155 టీ20ల్లో భారత్‌కు కెప్టెన్సీ వహించింది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా, చీఫ్ కోచ్ అమోల్ ముజుందార్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధానలు సోమవారం గువహటిలో భారత క్రికెట్ రోడ్‌మ్యాప్‌పై చర్చించగా.. ఒక్క రోజు వ్యవధిలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవటం గమనార్హం. కెప్టెన్‌గా తప్పుకున్నా, భారత జట్టులో కీలక ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగనుంది. వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన నాయకత్వ పగ్గాలు అందుకోనుంది.






కామెంట్‌లు (0)