మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత వృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే తదుపరి దశలో ప్రయివేటు పెట్టుబడులు, పరిశోధన, అభివృద్ధి వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్‌లో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత జిడిపిలో ఆర్‌అండ్‌డికి కేవలం 0.83 శాతం మాత్రమే ఖర్చు చేస్తుండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వాటా 2.7 శాతంగా ఉందని తెలిపారు. దేశ ఆర్‌అండ్‌డి వ్యయంలో ప్రయివేటు రంగం వాటా కేవలం 36 శాతమేనని పేర్కొన్నారు. ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయివేటు పెట్టుబడులను విస్తరించాలన్నారు. మేడ్ ఇన్ ఇండియా దశ నుంచి ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని కోరారు. గత నాలుగేళ్లలో ఎదురైన ఆర్థిక షాక్‌లను భారత్ సమర్థంగా అధిగమించిందన్నారు. 2026-27 తొలి త్రైమాసికంలో వాస్తవ జిడిపి వృద్ధి 7.8 శాతంగా నమోదైందని.. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయన్నారు. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ కారిడార్లు, సెమీకండక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై భారత్ దృష్టి సారించిందన్నారు.
పరిశోధనలపై దృష్టి సారించాలి
38 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)