నవతెలంగాణ-హైదరాబాద్:
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు. విజయానికి సంకేతంగా నిలిచిన జమ్మి వృక్షానికి పూజ చేయడం, శుభానికి సూచికగా పాలపిట్టను దర్శించుకోవడం, అలయ్ బలయ్ తో పరస్పరం ప్రేమాభిమానాలను చాటుకోవడం, పవిత్ర మైన జమ్మి ఆకును బంగారంగా భావించి పంచుకోవడం, పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునే మహోన్నత సంస్కృతి సంప్రదాయాన్ని దసరా పండుగ మనకందిస్తున్నదని కేసీఆర్ తెలిపారు.






కామెంట్‌లు (0)