నవతెలంగాణ – హైదరాబాద్: బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసి చోరీలకు పాల్పడుతున్న పాగ జయ అనే యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో చోరీలకు పాల్పడుతున్న ఆమె.. బురఖా ధరించి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 26న న్యూభరత్‌నగర్‌లో ఓ ఇంట్లో 48 తులాల బంగారం, వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదును దొంగిలించినట్లు గుర్తించారు. నిందితురాలి నుంచి సుమారు రూ.70 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బురఖా ధరించి ఇళ్లలో చోరీలు.. యువతి అరెస్టు
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)