Magazines

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 సీట్లు గెలుస్తుంది: టీపీసీసీ చీఫ్‌

1 గంట క్రితం

Mahesh Kumar Goud
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌ రావు ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను వారు గ్రహించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మేధావి అని చెప్పుకునే కేసీఆర్ ఎలాంటి ఆలోచన లేకుండా అప్పులు చేశారని మహేశ్ గౌడ్ విమర్శించారు. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటే, దాని గురించి హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, 90,000 ఉద్యోగాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని... క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్