నవతెలంగాణ-హైదరాబాద్: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. విమానంలోని ఒక టాయిలెట్ రూంలో ఉన్న అద్దంపై హైజాక్‌కు సంబంధించిన బెదిరింపు సందేశం రాసి ఉండటాన్ని గుర్తించినట్లు సమాచారం. ముంబైకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ బెదిరింపు సందేశం బయటపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పైలట్, వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని అప్రమత్తం చేశారు. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.
కోల్‌కతా విమానాశ్రయంలో హైజాక్ బెదిరింపు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)