Magazines

బోరబండలో దారుణం

1 గంట క్రితం

Horrific incident in Borabanda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోరబండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కొడుకునే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. శిల్పినగర్‌కు చెందిన విద్యాసాగర్‌ (36) మద్యం మత్తులో తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌ గొంతు నులిమినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్‌ పనికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గ.. కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే పోలీసులకు విషయం తెలిసిన వెంటనే నిందితుడు విద్యాసాగర్‌ పరారయ్యాడు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్