నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ చెల్లించేందుకు ఆగిన కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు బస్సు, లారీ మధ్య నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో అద్దంకి మండలం చెరుకుంపాలేనికి చెందిన నలుగురు మృతి చెందారు.
బెంగళూరు నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న 15 ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.






కామెంట్‌లు (0)