నవతెలంగాణ-హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (61), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో జట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్, బ్లైర్ టిక్నర్ చెరో రెండు వికెట్లు తీశారు.
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సీఫెర్ట్ 93 పరుగులు బాది జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతనికి జతగా డారిల్ మిచెల్ 29 పరుగులతో రాణించగా, గ్లెన్ ఫిలిప్స్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ వరుసగా మూడు మ్యాచ్ లు గెలువగా చివరి రెండు మ్యాచ్‌లు ఆతిథ్య జట్టు గెలిచింది. దీంతో సిరీస్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ఇరుదేశాల మధ్య నవంబర్ 4 నుంచి వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.






కామెంట్‌లు (0)