Magazines

న్యాయాధికారుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

5 గంటల క్రితం

Retirement age of judges increased to 62 years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాష్ట్ర హయ్యర్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌, జ్యుడీషియల్‌ సర్వీస్‌ అధికారుల పదవీ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు ఫుల్‌ కోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఆ తేదీన లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్