నవతెలంగాణ - హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని, అక్కడే ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని అన్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి ముఖంలో తీవ్ర నిరాశ, అసహనం కనిపించాయని వ్యాఖ్యానించారు. ఆయన పాలన సరిగా లేదని సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డే చెబుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన వెయ్యి టీఎంసీల నీటిని కిందకు వదిలిపెట్టి రాష్ట్రాన్ని కరవులోకి నెట్టారని ఆరోపించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలు తరలిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని హరీశ్‌రావు విమర్శించారు.
సిద్దిపేటలో తేల్చుకుందామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)