Magazines

బీజేపీకి షాక్..గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ

1 గంట క్రితం

Shock for BJP..RJD wins the graduates seat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : బిహార్‌ శాసనమండలి ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దర్భంగా గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆర్జేడీ అభ్యర్థి అనిల్ కుమార్ ఝా కైవసం చేసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి సర్వేశ్ కుమార్‌పై 4,010 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో చివరి వరకు బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 38వ రౌండ్‌ ముగిసేసరికి సర్వేశ్ కుమార్‌కు 20,033 ఓట్లు, అనిల్ కుమార్ ఝాకు 19,029 ఓట్లు వచ్చాయి. అయితే జన్‌ సురాజ్‌ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ నూరానీ ఎలిమినేట్ కావడంతో ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారాయి. వీటిలో సుమారు 2,900 ఓట్లు ఝాకు బదిలీ కావడంతో ఫలితం తారుమారైంది. చివరకు అనిల్ కుమార్ ఝాకు 25,406 ఓట్లు, సర్వేశ్ కుమార్‌కు 21,396 ఓట్లు పోలయ్యాయి. దీంతో 4,010 ఓట్ల మెజారిటీతో ఝా విజయం సాధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్