Magazines

జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తత..CRPF చెక్‌పాయింట్‌పై ఉగ్రవాదుల దాడులు

2 గంటల క్రితం

Tension in Jammu and Kashmir; terrorists attack CRPF checkpoint
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. అఖ్రాన్ వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెక్‌పాయింట్‌పై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు.గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించినట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. దీంతో అదనపు బలగాలను రప్పించి ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించమని అధికారులు తెలిపారు.


"జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఒక నాకా (చెక్‌పాయింట్) వద్ద మోహరించిన భద్రతా సిబ్బందిపై గుర్తు తెలియని మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది గాయపడ్డారు," అని CRPF ఒక ప్రకటనలో తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్