Magazines

మున్సిపల్ వాణిజ్య స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి 

42 నిమిషాల క్రితం

acquired
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను

ఆలేరు పట్టణంలోని మెయిన్ రోడ్డు వద్ద గల మున్సిపల్ వాణిజ్య స్థలాన్ని కొంతమంది వ్యక్తులు, గత రెండు సంవత్సరాల నుండి కబ్జా చేసి పక్క షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో  కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డికి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వాణిజ్య స్థలం దాదాపు 800 గజాలు ఉంటుందని, దీని విలువ సుమారుగా 10 కోట్లు రూపాయలు ఉంటుందని, ఈ స్థలము ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు.


 మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి మున్సిపల్ వాణిజ్య స్థలాన్ని కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకొని ఇట్టి స్థలంలో మడిగలు నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని, నిరుద్యోగులకు ఉపాధి  అవకాశాలు పెరుగుతాయని వినతిలో పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో నంద గంగేష్, ఎలుగల వెంకటేష్, పసుపునూరు వీరేశం, వడ్డేమాన్ నరేందర్, బైరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్